ఆరోగ్యమే
మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు
పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు
ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి .
జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా
ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మహిళల్లో సంతాన లేమి ముప్పు తెచ్చే అంశాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని
కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం
వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను
సంప్రదించాలి ...
మహిళల్లో సంతానలేమికి ఎన్నో కారణాలున్నాయి. వీటిలో కొన్ని రకాల అంశాలు పరోక్షంగా ఈ సమస్యకు కారణమవుతాయి. అవి అండం, వీర్యం నాణ్యతను ప్రభావితం చేస్తాయి. వీటిలో చాలా అంశాలను నియంత్రించుకునే వీలుంది. ఇలా చేయడం ద్వారా సంతాన భాగ్యం పొందడం మాత్రమే గాకుండా మొత్తంమీద శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చు.
ప్రవర్తనకు సంబంధించినవి:
1.భోజనం, వ్యాయామం:
- ప్రత్యుత్పత్తి వ్యవస్థ పని తీరు సక్రమంగా ఉండాలంటే సరైన ఆహారంతో పాటు సరైన స్థాయిలో వ్యాయామం కూడా ఉం డాలి. బరువు ఎక్కువగా ఉన్నా, బరువు తక్కువ గా ఉన్నా కూడా గర్భం దాల్చడం కష్టమవుతుం ది. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 18.5 నుంచి 25 వరకు ఉండడం మంచిది. శరీర బరువును (కిలోల్లో) రెట్టింపు చేసిన ఎత్తు (మీటర్లలో)తో భాగించడం ద్వారా బీఎంఐ తెలుసుకోవచ్చు.
2.ధూమపానం: మగవారు పొగ తాగడం వల్ల స్మెర్ప్ కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు అధ్య యనాల్లో తేలింది. అంతేగాకుండా గర్భస్రావం, నెలలు నిండకముందే
పుట్టడం, తక్కువ బరువు ఉన్న పిల్లలు పుట్టడం లాంటివి చోటు చేసు కు నేందుకు అవకాశాలు అధికం అవుతాయి. భా ర్యాభర్తల్లో ఎవరికి పొగ తాగే అలవాటు ఉన్నా సహజ / కృత్రిమ గర్భధారణ అవకాశాలను మూడింట ఒక వంతు తగ్గించే అవకాశముంది.
3. ఆల్కహాల్: మహిళలు మద్యం తీసుకోవడం గర్భస్థలోపాలతో శిశువులు పుట్టే అవకాశాన్ని అధికం చేస్తుంది. తల్లిరక్తంలో ఆల్కహాల్ సంబంధిత స్థాయి అధికంగా ఉంటే పుట్టిన శిశువుల్లో ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ (ఎదుగుదలలో లోపాలు / ఇతరత్రా సమస్యలు) కు దారితీస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం మగ వారిలో స్పెర్మ్‌కౌంట్‌ను తగ్గిస్తుంది.
4. మాదకద్రవ్యాలు: మార్జువానా, అనబోలిక్ స్టెరాయిడ్స్ లాంటి వాటి వాడకం మగవారిలో స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుంది. గర్భవతులు గనుక కొకైన్‌ను ఉప యోగిస్తే అది పుట్టబోయే శిశువుకు కిడ్నీ సమస్యలు కలిగిస్తుంది. గర్భం దాల్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, గర్భవతిగా ఉన్న కాలంలో మాద ద్రవ్యాలు లాంటివాటికి దూరంగా ఉండాలి.
5. పర్యావరణం, వృత్తిపరమైన అంశాలు: పని చేసే చోట వివిధ విషతుల్యాల లకు, రసాయనాలకు గురి కావడం, చుట్టూ ఉండే వాతావరణం కూడా గర్భ ధారణపై ప్రభావం కనబరుస్తుంది. ఉత్పరివర్తనం, పుట్టుకతో లోపాలు, గర్భస్రావం, సంతానలేమిలకు కారణమయ్యే ఈ విషతుల్యాల్లాంటి వాటిని రిప్రొడక్టివ్ టాక్సిన్స్‌గా వ్యవహరిస్తుంటారు.
6. లెడ్: లెడ్ కలిగి ఉండే పదార్థాలు మను ష్యుల్లో ప్రత్యుత్పత్తిపై ప్రతికూల ప్రభావం కనబరుస్తాయని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది అసాధారణ వీర్యం ఉత్పత్తి అయ్యేం దుకు కారణమవుతుందని, ఫలితంగా గర్భస్రావాలు కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
7. వైద్య చికిత్సలు, ఉపకరణాలు: రేడియే షన్ (సాధారణ ఎక్స్‌రేలు మొదలుకొని కేమోథెరపీ వరకు)కు బాగా గురి కావడం వీర్య ఉత్పత్తిని మారుస్తుందని వెల్లడైంది. వివిధ గర్భాశయ సమస్యలకూ ఇది దారి తీస్తుంది.
8. ఇథలెన్ ఆకై్సడ్: సర్జికల్ ఉపకరణాల స్టెరిలైజేషన్‌లో, కొన్ని రకాల క్రిమి సంహారకాల తయారీలో ఇథలెన్ ఆకై్సడ్‌ను ఉపయోగిస్తారు. పుట్టుకతో లోపా లకు, అబార్షన్లకు ఇది కారణం కాగలదు.
9. డిబ్రొమొక్లోరోప్రొపేన్ (డీబీసీపీ): క్రిమిసంహారకాల్లో ఉండే డీబీసీపీ లాంటి వాటికి గురికావడం అండాశయ సమస్యలకు దారి తీయగలదు. త్వరిత మెనోపాజ్ లాంటి వివిధ రకాల ఆరోగ్యసమస్యలూ తలెత్తుతాయి. ఇవన్నీ కూడా సంతానోత్పత్తి శక్తిపై ప్రత్యక్ష ప్రభావం కనబరుస్తాయి.
ఈ అంశాలూ కీలకమే!
- ఓ మహిళ గర్భం దాల్చాలంటే అండం విడుదలయ్యే సమయంలో ఆ జంట కలుసుకోవాలి. అండం, వీర్యం ఉత్పత్తి స్థాయిలో గరిష్ఠస్థాయిలో ఉండాలి. మహిళ
శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఉండాలి. కొంతమంది మహిళల్లో అండాశయాలు పరిపక్వం చెందవు. దీని వల్ల అండాలు విడుదల కావు. ఇలాంటి సందర్భాల్లో సింథటిక్ ఎఫ్‌ఎస్‌హెచ్ (ఇంజెక్షన్) లేదా క్లోమిడ్ (పిల్) ద్వారా తగు చికిత్సను అందించే అవకాశం ఉంది. ఎండోమెట్రియోసిస్ (గర్భాశాయనికి చెందిన కణజాలాన్ని పోలిన కణజాలం శరీరంలోని ఇతర భాగాల్లో వృద్ధి చెందడం) లేదా వివిధ రకాల ఇన్‌ఫెక్షన్‌ల వల్ల ఫాలోపియన్ ట్యూబ్‌లు (అండాలను గర్భాశయానికి రవాణా చేసేవి) దెబ్బ తినడం లాంటివి కూడా మహిళ సంతానోత్పత్తి శక్తిని ప్రభావితం చేస్తాయి.
0 Comments