అన్ని వ్యాయామాల్లోకి నడక
ఉత్తమమైన వ్యాయామం. దానివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రతి ఒక్కరూ రోజూ
అరగంట నుంచి గంటసేపు నడవాలి. నడిచేటప్పుడు తప్పనిసరిగా బూట్లు వేసుకోవాలి.
నడక మొదలు పెట్టే ముందు కనీసం పది, పన్నెండు నిముషాలు వామప్ (శరీరానికి
చురుకు పుట్టించే వ్యాయామాలు, కాళ్ళుచేతులను సాగదీయటం) చేయాలి. ఆ తర్వాత
వేగంగా నడవాలి.
గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో నడిస్తే మంచి వేగంతో నడిచినట్లు లెక్క. మొదట్లో గంటకు నాలుగు కిలోమీటర్లు నడవగలిగితే చాలు. నడిచేటప్పుడు దూరమూ, సమయం దృష్టిలో ఉంచుకోవటం ముఖ్యం.
ఎత్తయిన ప్రాంతానికి ఎక్కుతున్నట్లు మూడు నిమిషాలు తర్వాత చదును ప్రాంతం మీద రెండు నిమిషాలు మళ్ళీ ఎత్తయిన ప్రాంతం మీద ఇలా మార్చి మార్చి నడిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మొదట్లో తక్కువ దూరం వెళ్ళినా తర్వాత వేగం, దూరం పెంచుకుంటూ వెళ్ళాలి. వాకింగ్ చేసేటప్పుడు పండ్లు, కొబ్బరినీళ్ళు త్రాగితే మంచిది.

0 Comments