స్విట్జర్లాండ్‌కు చెందిన బేసల్లోని ఫ్రెడరిక్ మైషేర్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ రీసర్చ్కు చెందిన ఓ పరిశోధనా బృందం పరిశోధనలుగావించింది.
ఈ బృందం చేసిన పరిశోధనల్లో కళ్ళలోని రెటీనాలోని ఓ నరం మెదడుతో సంబంధం లేకుండానే స్పందిస్తుందని తేలింది. ఆ నరాన్ని ఇటీవలే కనుగొన్నామని పరిశోధకులు తెలిపారు.
మెదడుతో సంబంధం లేకుండానే ఈ నరం మనిషిని జగృతపరుస్తుందని న్యూ సైంటిస్ట్ ఓ నివేదికలో తెలిపింది. ముఖ్యంగా స్థనాలున్న ప్రాణుల కన్నుల్లో రెటీనాలో లంబకోణాల మార్పులను పసిగట్టేస్తుందని, ఇది న్యూరాన్లను హెచ్చరిస్తుందని పరిశోధకుల బృందం తెలిపింది.
ఎలుకలలోని కళ్ళలోని నరాలలో ఈ మార్పును తాము గమనించినట్లు వారు వెల్లడించారు. ఈ నరాలు తమ కంటికి దూరంగా ఏవైనా పదార్థాలుంటే వెంటనే వాటినుంచి తమను తాము కాపాడుకునేందుకుగాను మెదడుకన్నాకూడా వేగంగా కళ్ళు ప్రతిస్పందిస్తాయని వారు పేర్కొన్నారు.
0 Comments