Full Style

>

అరోమా థెరిపీ,aromatherapy-with oils,పరిమళ వైద్యం

అరోమా థెరిపీ,aromatherapy-with oils,పరిమళ వైద్యం

అరోమా థెరిపీ,aromatherapy-oils- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


రుచికరమైన ఆహారాన్ని వండడానికి మాత్రమే కాదు మేని సౌందర్యాన్ని పెంచడానికి నూనెలు ఎంతగానే దోహదంచేస్తాయి. అరోమా, సుగంధ నూనెలతోపాటు, మనం రోజూ వాడుకునే నూనెలను కూడా సౌందర్య సాధనాలుగా వాడుకోవచ్చు. చర్మం నిగారింపు తగ్గ కుండా, మృదుత్వాన్ని కోల్పోకుండా నూనెలు ఉపయోగపడతాయి. అయితే ఏ నూనెను ఏలాంటి వాతావరణంలో, ఏ రకం చర్మం ఉన్నవారు ఏలా వాడాలో తెలుసుకుంటే అందం మీ సొంతమే.

పూర్వ కాలము నుండి పరిమళభరితమైన కొన్ని నూనెలను వైద్యపరంగా ఉపయోగించడం పరిపాటి . మెదడు, చర్మం, మొత్తంగా శరీరానికే స్వస్థత చేకూర్చే ప్రత్యామ్నాయ వైద్య పద్ధతిగా ''అరోమా థెరపీ'' ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందింది. చెట్లు, పూల నుంచి తీసిన సారంతో తయారయ్యే ఈ నూనెలను ఎక్కువగా సౌందర్య పద్ధతులలో వాడుతున్నప్పటికీ డిప్రెషన్‌ తగ్గించేందుకు, ఉత్సాహాన్ని పెంచేందుకు, సంపూర్ణ ఆరోగ్యం కోసం వీటిని ఉపయోగించవ్చనని అరోమా థెరపీ ప్రాక్టిషనర్లు చెప్తున్నారు. ఆరోమా థెరపీ ఎప్పుడు పుట్టింది అనేది నిర్ధిష్టంగా ఎక్కడా నమోదు కానప్పటికీ ఈజిప్షియన్లు మృతి చెందిన వారి శరీరాలకు పూతగా ఉపయోగించేందుకు కొన్ని మొక్కల నుంచి తైలాన్ని తీసి ఉపయోగించారని తెలుస్తోంది. ఇక ఉత్సాహాన్ని పెంచేందుకు అరోమా ఆయిల్స్‌ను చైనాలో ఎక్కువగా ఉపయోగించేవారట.

వైద్య పితామహుడిగా భావించే హిప్పోక్రేట్స్‌ కూడా స్వస్థత కోసం అరోమా థెరపీ ఉపయోగించారుట. అయితే ''అరోమా థెరపీ'' అనే పదాన్ని తొలిసారిగా ప్రయోగించింది ఫ్రెంచి కెమిస్ట్‌ 'రినె మారిస్‌ గట్టెఫోసె'. లావెండర్‌ నూనె తనకు అయిన కాలిన గాయాన్ని మాన్పడాన్ని గమనించిన ఫ్రెంచ్‌ సర్జెన్‌ జీన్‌ వాల్నెట్‌ రెండవ ప్రపంచ యుద్ధంలో సైనికుల గాయాలకు పూతగా ఈ నూనెలను వాడటం ప్రారంభించాడు.

వివిధ మొక్కల ఆకులు, బెరడు, పూలు, కాండం, వేర్లు ఇలా ప్రతి ఉపయుక్తమయ్యే ప్రతిభాగం నుంచీ సారాన్ని సేకరించే ఈ తైలాలను ''ఎస్సెన్షియల్‌ ఆయిల్స్‌'' అంటారు. అన్నింటిలోకీ ప్రాచుర్యం పొందింది లావెండర్‌ ఆయిల్‌. ఇది ఒత్తిడిని తగ్గిస్తుందని రుజువైంది. అలాగే పిప్పరమెంట్‌ సహజ శక్తిని పెంచేదిగా తేలింది. అనేక తైలాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి ఎందుకు ఉపయుక్తమో తెలుసుకునే వాటిని కొనుగోలు చేయడం మంచిది.

బెర్గామాట్ ‌: ఇది నిమ్మ వాసన కలిగిన నూనె. దీనిని సిట్రస్‌ బెరాగమియా చెట్టు నుంచి గ్రహిస్తారు. ఈ చెట్లు ఆగ్నేయ ఆసియాలో ఎక్కువగా కనుపిస్తాయి. దీనిని మసాజ్‌ ఆయిల్‌లో కలుపుకునో లేక స్నానం చేసే నీళ్ళలో కలుపుకునో ఉపయోగించవచ్చు. ఈ నూనెను ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌, సొరియాసిస్‌, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులకు, అనెరెగ్జియాకు చికిత్సగా ఉపయోగిస్తారు. అయితే దీనికి చర్మానికి మంటపుట్టించే గుణం ఉన్నందున నేరుగా చర్మానికి రాసుకోకూడదు. అలాగే ఈ నూనె ఉపయోగించేటప్పుడు ఎండలో తిరగరాదు.

మల్లె : మల్లెపూల వాసన ఎంత ఘాటుగా, ఎంత రొమాంటిక్‌గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. దీని నూనెను డిప్రెషన్‌ను తగ్గించేందుకు, మనస్సును ఉత్తేజితం చేసేందుకు ఉపయోగిస్తారు. ఇది మంచి యాంటీ సెప్టిక్‌, డిస్‌ఇన్ఫెక్టెంట్‌ అని కూడా తేలింది. అయితే గర్భిణీలు దీనిని వాడకపోవడం మంచిది.

సెడార్‌ వుడ్ ‌:


ఇది ఉత్తర అమెరికాకు చెందిన వృక్షం. దీనిని కూడా ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు ఉపయోగిస్తారు. అలాగే శ్వాస సంబంధమైన సమస్యలు, చర్మ సమస్యలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. మూత్రకోశ ఇన్ఫెక్షన్లను కూడా ఇది తగ్గిస్తుంది. దీనిని వేరే మసాజ్‌ ఆయిల్‌లో కలిపి ఉపయోగించాలి. అలాగే గర్భం ధరించిఉన్న సమయంలో దీనిని ఉపయోగించరాదు.

కేమొమైల్ ‌:
 దీనిని మసాజ్‌ ఆయిల్స్‌తో కలిపి తీసుకోవడం లేదా స్వేదన చికిత్సలో ఉపయోగించవచ్చు. ఇందులో లభించే రోమన్‌ రకం కేమొమైల్‌ను మౌత్‌ వాష్‌గా ఉపయోగించవచ్చు. ఇది చాలా ప్రశాంతత కలిగించే గుణాలు కలిగినది. దీనితో పాటుగా యాంటీ బయాటిక్‌, యాంటీసెప్టిక్‌, యాంటీ డిప్రెసెంట్‌గా ఉపయోగించవచ్చు. అలాగే మొటిమలు తగ్గించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనిని గర్భం ధరించిన సమయంలో ఉపయోగించరాదు.

యూకలిప్టస్- Eucalyptus ‌:  శ్వాసకు సంబంధించిన వ్యాధులను తగ్గించడంలో, ఏకాగ్రత పెంచడంలో దీనికి సామర్ధ్యం ఉందని తెలుస్తోంది. వీటితో పాటుగా దీనిని యాంటీసెప్టిక్‌గా, నొప్పులకు, ముక్కులు బ్లాక్‌ అయినప్పుడు, మైగ్రైన్లు, జ్వరాలు, కండరాల నొప్పులు, ఇతర నొప్పులకు ఉపయోగించవచ్చు. అయితే పిల్లలకు పాలు ఇచ్చే స్ర్తీలు, మూర్ఛ రోగం ఉన్నవారు దీనిని ఉపయోగించరాదు.

భారత దేశంలో ఖ్యాతిగాంచిన నీలగిరి కొండలు అందరకూ బాగా తెలుసు. ఎందుకంటే అక్కడ ‘యూకలిప్టస్’ మొక్కలు అధికం. యూకలిప్టస్ ( Eucalyptus) ఒక పెద్ద చెట్టు. దీని ఆకుల నుండి నీలగిరి తైలం తీస్తారు.యూకలిప్టస్ ఆయిల్ శరీరానికి ఎన్నో ప్రయోజనాలనిచ్చే ఘాటైన నూనె. యూకలిప్టస్ నూనెను చర్మం చాలా అధికంగాను వేగంగాను పీల్చేసుకుంటుంది. ఎంతో తాజాదనాన్ని ఇస్తూ, శరీరాన్ని చల్లబరచి బాక్టీరియా, ఇతర క్రిములను నశింపజేస్తుంది. యూకలిప్టస్ నూనె శరీర మర్దనకు మంచి నూనె. చర్మం మంటలు, పురుగులు కుట్టిన నొప్పులు, లేదా బొబ్బలు మొదలైనవి రెండు చుక్కలు వేస్తే చాలు నయమైపోతాయి. ఆరోగ్యరీత్యా చాలా మంచిది. దీనికిగల మరికొన్ని ప్రయోజనాలను చూద్దాం-

1. యూకలిప్టస్ ఆయిలో సహజ సువాసన కలది. చర్మంపై వచ్చే అనేక వ్యాధులను, మ్యూకస్ విడుదల, పుండ్లు, యోని సంబంధిత ఇతర వ్యాధులు నయం చేస్తుంది. చర్మం సెప్టిక్ అయినా, లేదా చీము పట్టినా దీని వాడకం మంచి ఫలితాన్నిస్తుంది.

2. నొప్పుల నివారణకు సహజ ఔషధం. శారీరక, కీళ్ళ నొప్పులు తగ్గించి మైండ్ కు రిలాక్సేషన్ ఇస్తుంది. బకెట్ వేడి నీటిలో కొద్ది చుక్కలు వేసి స్నానం చేస్తే ఎంతో హాయిగా వుంటుంది. మరిన్ని మంచి ఫలితాలు కావాలంటే దీనితో లవెండర్ కలపండి.

3. ఈ నూనె రాస్తే చర్మం నునుపు రావటం, చర్మంపై మచ్చలు పోవడం జరుగుతుంది. భుజాలు, వీపు భాగాలకు విటమిన్ ఇ ఆయిల్ తో కలిపి రాస్తే మంచి ఫలితాలుంటాయి.

4. చర్మ సంబంధిత వ్యాధులకు లేదా పురుషులు వారి షేవ్ తర్వాత ఆఫ్టర్ షేవ్ లోషన్ గాను వాడవచ్చు.

5. యూకలిప్టస్ ఆయిల్ ను శనగపిండి లేదా ముల్తాని మిట్టితో కలిపి రాస్తే చర్మం పొడిబారకుండా వుండి మెత్తగాను, ఎంతో అందంగాను కనపడుతుంది.

నిమ్మ నూనె :


 చర్మ సమస్యల నుంచి జీర్ణ సంబంధ సమస్యల వరకూ అనేకానికి ఉపశమనం కలిగించగల గుణం నిమ్మ నూనెకు ఉంది. కొవ్వు తగ్గించడంలో, ఇమ్యూనిటీని పెంచడంలో ఇది సహాయపడుతుంది. తలనొప్పులు, జ్వరానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. దీనిని కూడా వేరే మసాజ్‌ నూనెలలో కలిపి వాడడం మంచిది తప్ప నేరుగా వాడరాదు. అలాగే ఎండలోకి వెళ్ళేటప్పుడు దీనిని ఉపయోగించరాదు.

రోజ్‌ (గులాబి):మహిళలకు సంబంధించిన అనేక స మస్యలను తగ్గించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. డిప్రెషన్‌, ఒత్తిడి, జీర్ణం కోశ సమస్యలు, గుండెకు, రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు, శ్వాసకోశ ఇబ్బం దులు వంటి ఎన్నింటి నుంచో ఇది కాపాడుతుంది. అలాగే చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే దీనిని గర్భధారణ సమయంలో ఉపయోగించరాదు.

ఇవే కాకుండా మార్జోరాం, పచౌలీ, పెప్పర్‌మింట్‌, రోజ్‌ మేరీ, శాండల్‌ వుడ్‌ తదితర ఎన్నో నూనెలు లభ్యమవుతాయి.

అరోమా థెరపీ ప్రారంభించాలనుకునేవారి కోసం కొన్ని సలహాలు, సూచనలు:

- మార్కెట్‌లో మనకు చాలా రకాల తైలాలు దొరుకుతాయి. చాలావరకు పరిమళ తైలాలు ఎసెన్షియల్‌ ఆయిల్స్‌లాగే ఉన్నా... అవి వైద్యపరమైన లాభాలను పూర్తిగా అందజేయవు. ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ కొనేముందు ఒకటికి రెండుసార్లు పరీక్షించుకోవడం మంచిది.
- సువాసన కోసం జీవనశైలిలో అరోమా థెరెపీని వాడాలని భావించినా మనం అఘ్రాణించే ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ చికిత్సాపరమైన లాభాలు సమకూరుస్తాయి. ఈ లాభాలు పరిమళ తైలాలు వాడినందువల్ల ఒనగూరవు.
- రబ్బర్‌ గ్లాస్‌ డ్రాపర్‌ టాప్స్‌ ఉండే ఎస్సెన్షియల్‌ ఆయిల్స్‌ కొనవద్దు. ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఎంతో చిక్కనైనవి. రబ్బరును జిగురుగా మార్చేస్తాయి. ఫలితంగా నూనె పనికిరాకుండా పోతుంది.
- అరోమా థెరెపీ గురించి సాధ్యమైనంత మేరకు చదవండి. అరోమా థెరెపీ మొదలు పెట్టడం ఎంతో సులభం. కానీ భద్రతకు సంబంధించిన విషయాలు గుర్తుంచుకోవాలి.

- ఈ థెరపీ గురించి ప్రస్తుతం అనేక పుస్తకాలు కూడా మార్కెట్‌లో లభిస్తున్నాయి. వాటిలో కొన్ని ప్రముఖ పుస్తకాలు చూడండి.

- ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ను ఎంపిక చేసుకుని కొనండి. వీటి నాణ్యత విషయంలో కంపెనీకి కంపెనీకి మధ్య తేడాలుంటాయి. పైగా, కొన్ని కంపెనీలు తమ తైలాలు మాత్రమే కల్తీలేనివని, శుద్ధమైనవనీ బూటకపు ప్రచారం చేసుకుంటాయి.
- ఆయిల్స్‌ కొనేప్పుడు నిజమైనవి పసిగట్టడం నేర్చుకోండి. అనిస్‌, ల్యావెండర్‌, బే, సెడార్‌వుడ్‌, యూకిలిప్టస్‌ ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ తయారుచేయడానికి వాడే మొక్కల సాధారణ పేర్లు. కానీ ఈ మొక్కల్లో విభిన్న రకాలైనవి ఉన్నాయి. ఈ వైవిధ్యాన్ని గర్తించడానికి వాటి బొటానికల్‌ పేరు లేక లాటిన్‌ పేరును చెప్పండి.
- ఉదాహరణకు రెండు వేర్వేరు ఆయిల్స్‌ను బే ఎసెన్షియల్‌ ఆయిల్‌గా పిలుస్తారు. కానీ ఈ రెండు వేర్వేరు మొక్కలకు చెందినవి. వీటి ధరల్లాగే వీటి గుణాలు, పరిమళాలు భిన్నంగా ఉంటాయి. కనుక బొటానికల్‌ పేరుపై శ్రద్ధ వహించాలి.
- ఆయిల్‌ ఏ దేశానికి చెందినదో తెలుసుకోవడం కూడా మంచిది. నాణ్యమైన ఎసెన్షియల్‌ ఆయిల్‌ అమ్మకందారులు ఆయిల్‌ బాటిల్స్‌పై వాటి బొటానికల్‌ పేరు, అది ఏదేశానికి చెందినదీ అనే సమాచారం ఉంటుంది.
- ఈ కెంపెనీలు అమ్ముతున్న ఆయిల్స్‌ సహజసిద్ధమైనవా, తయారుచేసివా లేక స్థానికంగా అందుబాటులో ఉన్న సహజవనరులతో చేసినవా అన్న విషయం కూడా గమనించాలి.
- వీధిలో పెట్టుకుని అమ్మే వారి దగ్గర, ప్రదర్శనల్లో, తక్కువ కాలపు సందర్భాల్లో ఆయిల్స్‌ కొనకుండా ఉండడం మంచిది. కానీ కొత్తగా ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ వాడడం ప్రారంభించినవారు తరువాత దశలో కూడా తమ దగ్గరకు వస్తారని వీరికి తెలుసు. ఇలాంటి సందర్భాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన కంపెనీలు కూడా ఆయిల్స్‌ అమ్మవని అనడంలేదు. కానీ అంతగా నాణ్యతను పసిగట్టలేని వారికి ఇది హెచ్చరిక మాత్రమే.
- మెయిల్‌ ఆర్డర్‌ ద్వారా తక్కువ ధరకు ఉన్నతస్థాయి నాణ్యత కలిగిన ఆయిల్స్‌ కంపెనీలు పంపుతాయి. స్థానికంగా ఆరోగ్య, ఆహారపదార్థాల షాపు నుంచి కొనడం కంటే ఇది మంచిది, ఖర్చు తక్కువ. కానీ కంపెనీ కంపెనీకి, షాపుకీ షాపుకీ తైలాల నాణ్యతలో వ్యత్యాసం వుంటుంది.
- బిజినెస్‌ ప్లాజా వారి వెండర్‌ పెవిలియన్‌ ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ అరోమాథెరెపీ ఉత్పత్తులమ్మే వివిధ కంపెనీల జాబితా రూపొందించింది.
- మీ అరోమా థెరెపీ తైలాలను నల్లటి గ్లాసులో నింపి చల్లటి చీకటి ప్రదేశంలో భద్రపరచండి. ఖాదీభండార్‌లో చక్క బాక్సులు కొనండి. వాటిలో ఆయిల్స్‌ను భద్రపరచండి. ఇలా అయితే ఇంట్లో ఒకచోటునుంచి మరొక చోటికి సులవుగా వీటిని తరలించవచ్చు.
- అన్ని ఎసెన్షియల్‌ ఆయిల్స్‌తో పాటు ఇచ్చే భద్రతాపరమైన సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి. ఆరోగ్యపరమైన సమస్యలున్నవారు, గర్భిణులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.


కొబ్బరి నూనె , Coconut Oil
ప్రకృతి మనకి అందించిన ఎన్నో గొప్ప వస్తు వుల్లో కొబ్బరి కూడా ఒకటి. దీనిలోని పోషక విలువలు అపారం. కొబ్బరి నీళ్లు, కొబ్బరిపాలు అన్నిటికంటే కొబ్బరినూనె ఎన్నో సుగుణాలను కలిగి వుంది. ఆడవారి కురుల పోషణలో కొబ్బరినూనె పాత్ర ఎంతైనా వుంది. పరిశుభ్రమైన కొబ్బరి నూనె ప్రతిరోజూ నాలుగు చెంచాలు, సలాడ్లు లేదా గ్రీన్ టీ లేదా మీరు ఇష్టంగా తినే ఇతర పదార్ధాలలో కలిపి తింటే ఆరోగ్యవంతమైన నిగనిగలాడే చర్మం, దానితో పాటు దట్టమైన నల్లని జుత్తు వద్దన్నా మీకు వచ్చేస్తుంది .

కొబ్బరి చెట్టును జీవితమంతా పనికి వచ్చే చెట్టు అంటారు. మన దేశంలో శతాబ్దాలపాటు కొబ్బరి సంబంధిత పదార్ధాలను తినేటందుకు, వివిధ ఔషధాల తయారీకి వినియోగించటం అందరకూ తెలిసిందే. కొబ్బరినూనె వంటలకు, వంటికి ఎంతో మంచిదని అందరికి సాధారణంగా తెలిసిందే. ఇదే విషయం ఆయుర్వేదం లో కూడా పేర్కొన్నారు. శరీరంపై ఏర్పడే పుండ్లు, గడ్డలు లేదా ఇతర వైరల్ ఇన్ ఫెక్షన్స్ లో కూడా కొబ్బరి నూనె వాడతారు.

ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కేవలం కొబ్బరినూనెతోనే వంటలు చేయడం నడుస్తోంది. కేరళ ఇందుకు ప్రధాన ఉదాహరణ. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ ప్రయో గాలద్వారా నిరూపితమైందేమంటే కొబ్బరినూనె గుండెకు నేస్తం లాంటిదని. వంటనూనె సరైన దైనప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. అందుకు కొబ్బరినూనె శ్రేష్ఠమైనదని శాస్త్రవేత్తలంటున్నారు. ఒత్తిడినుంచి ఉపశమనం ఇచ్చేందుకు, కొలె స్ట్రాల్‌ను అదుపులో ఉంచేందుకు, బరువు తగ్గ డానికి, రోగనిరోధక శక్తి పెంచేందుకు, జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడానికి, మెటబాలిజమ్‌ సమర్థవంతంగా వుండేందుకు, కిడ్నీ సమ స్యలకు, బిపిని నియంత్రించడానికి, డయా బెటిస్‌ను తగ్గించేందుకు, ఎముకల గట్టిదనానికి, దంతాల పటిష్టతకు కొబ్బరినూనె అద్భుతంగా పనిచేస్తుంది.

కొబ్బరినూనె ప్రతిరోజూ వాడితే చర్మం చక్కటి తేమ కలిగి నిగ నిగ లాడుతుందని చర్మ నిపుణులు చెపుతున్నారు. అయితే, కొబ్బరినూనెలో శాచ్చ్యురేటెడ్ కొవ్వులు అధికంగా వుండటంతో కొబ్బరినూనె ఆహారంగా వాడటం శ్రేయస్కరం కాదంటున్నారు పోషకాహార నిపుణులు. కనుక ఆహారంగా కాకపోయినా దీనిని ప్రతిరోజూ చర్మానికి, జుత్తుకు పట్టిస్తే మహిళల సౌందర్యం రెట్టిపు అవటంలో కొబ్బరినూనె ఎంతో సహకరిస్తుందనటంలో సందేహం లేదు.

వేప నూనె,Neem Oil :
విత్తనంల నుండి తీసిన నూనె ముదురు ఎరుపుగా లేదా పచ్చని ఛాయ వున్నబ్రౌనురంగులో కాని వుండి, ఘాటైన వాసన కల్గివుండును. వేపనూనెలో సంతృప్త కొవ్వుఆమ్లాలైన మిరిస్టిక్‌, పామిటిక్, స్టియరిక్‌ ఆసిడులు, అసంతృప్త కొవ్వు ఆమ్లాలైన ఒలిక్‌, లినొలిక్‌ ఆసిడులున్నాయి. నూనెలో వున్న అజాడిరిక్తిన్ కారణంగా వంటనూనెగా ఉపయుక్తం కాదు.వేపనూనెలో ఇంకను స్టెరొలులు (sterols), టెర్పొనొయిడులు (terpenoids), అల్కలైడు (alkalniods)లు, ఫ్లవొనొయిడులు (flavonoids) మరియు గ్లైకొసిడులు (glycosids) వున్నాయి.

* ఐయోడిన్‌విలువ :ప్రయోగశాలలో 100 గ్రాములనూనెచే శోషింపబడిన(గ్రహింపబడిన)ఐయోడిన్ గ్రాముల సంఖ్య.ప్రయోగసమయంలో నూనెలోని,ఫ్యాటి ఆమ్లంల ద్విబంధంవున్న కార్బనులతో ఐయోడిన్ సంయోగం చెంది,ద్విబంధాలను తొలగించును.ఐయోడిన్‌విలువ నూనెలోని అసంతృప్త కొవ్వుఆమ్లం ల వునికిని తెలుపును.నూనె ఐయోడిన్‌విలువ పెరుగు కొలది,నూనెలోని అసంతృప్త కొవ్వుఆమ్లంల శాతం పెరుగును.

* సపొనిఫికెసన్‌విలువ:ఒక గ్రాము నూనెలో వున్న కొవ్వుఆమ్లాలన్నింటిని సబ్బుగా(సపొనిఫికెసను)మార్చుటకు అవసరమగు పొటాషియం హైడ్రాక్సైడు,మి.గ్రాములలోఉన్నాయి .
* అన్‌సపొనిఫియబుల్ మేటరు: నూనెలో వుండియు,పోటాషియంహైడ్రాక్సైడ్‌తో చర్యచెందని పదార్థములు.ఇవి అలిఫాటిక్‌ఆల్కహల్‌లు,స్టెరొలులు(sterols),వర్ణకారకములు(pigments),హైడ్రోకార్బనులు,మరియు రెసినస్(resinous)పదార్థములు.

వేప నూనె ఉపయోగాలు
* వేపనూనెకున్న ఓషదగుణం కారణంగా, సబ్బుల తయారిలో విరివిగా వాడుచున్నారు. వేపనూనెతో చేసిన సబ్బునురుగ ఎక్కువగా ఇచ్చును.
* వేపనూనె, సబ్బుద్రవం, నీటి మిశ్రమాన్నిమొక్కల చీడ, పీడల నీవారిణిగా పిచికారి చేసి వాడెదరు.
* ఆయుర్వేద, యునాని మందుల తయారిలో ఉపయోగిస్తారు.
* కీళ్ళనొప్పుల నివారణకు మర్ధననూనెగా వాడెదరు.
* రాత్రి తల వెంట్రుకలకు వేపనూనెను దట్టంగా పట్టించి, గాలి అందకుండగా గట్టిగా వస్త్రాన్నిచుట్టి వుదయం వరకు వుంచిన తలలోని పేలు చనిపోవును.
* నేలలోపాతు కర్ర భాగానికి, ఇంటిలోని దూలలకు,వాసాలకు, గుమ్మాలకు వేపనూనెను రాసిన చెదపట్టదు.
* నూనె తీసిన వేపచెక్క (oil cake) ఎరువుగా రసాయనిక ఎరువులతో కలిపి చల్లెదరు. నూనె తీసిన చెక్కలో5.2-5.6 వరకు నత్రజని వున్నది. భాస్వరం 1.9%, పోటాషియం 1.5% వున్నది .


ఆవ నూనె ( Mustard oil) :
ఆవాల గింజల నుంచి తయారయిన మూడు రకాల నూనెలకి ఆవాల నూనె లేదా ఆవ నూనె అనే పదాన్ని ఉపయోగిస్తారు:

* విత్తనాలను దంచడం ద్వారా వచ్చే క్రొవ్వుతో కూడిన స్థావర నూనె (ఉద్భిజ్జ తైలం),
* విత్తనాలను రుబ్బి, నీటితో కలిపి, స్వేదన ప్రక్రియ ద్వారా ఆవశ్యక నూనెని గ్రహిచడం వంటి పద్ధతుల ద్వారా లభించే సుగంధ తైలం.
* ఆవాల గింజల లభ్యాన్ని సోయాబీన్ నూనె వంటి వేరే స్థావర నూనెతో కలపడం ద్వారా చేసే నూనె.

ఆరోగ్యం మీద ప్రభావాలు
తినదగిన నునెల నుంచి తయారయిన యురిసిక్ ఆమ్లపు ప్రభావాలు మానవుల మీద వివాదాస్పదం. అయితే మానవుల మీద ప్రతికూల ప్రభావాలు మాత్రం ఎప్పుడూ నమోదు కాలేదు. ఒకటి-లో-నాలుగో వంతు యురిసిక్ ఆమ్ల మరియు ఒలియక్ ఆమ్లం కలిపి లోరెంజో ఆమ్లం; అతి అరుదైన అడ్రెనోలేయుకోడిస్ట్రోపి అనే నాడిజీవశాస్త్ర వ్యాధికి ఇది ప్రయోగాత్మక చికిత్స.

ఎక్కువ మోతాదులో యురిసిక్ ఆమ్లాన్ని కలిగి ఉండడంవలన యునైటెడ్ స్టేట్స్, కెనడా మరియు ఐరోపాలలో ఒకప్పుడు ఆవాల ఆమ్లాన్ని మానవుల వాడడానికి పనికిరాదని భావించేవారు. ఎలుకల మీద చేసిన పూర్వ అధ్యయనాల వలన ఇలా భావించేవారు. ఎలుకల మీద అధ్యయనాలు అవి మనుషులు, పందుల కంటే తక్కువగా కూరగాయల క్రొవ్వులని (అవి యురిసిక్ ఆమ్లం కలిగి ఉన్నా లేకపోయినా) అరిగించుకుంటాయని చూపించాయి. చారిటోన్ ఎట్ ఆల్.సూచనల ప్రకారం ఎలుకలలో: "యురిసిక్ ఆమ్లపు నుండి యురిసిల్-CoA అప్రభావవంత చర్య మరియు ట్రైగ్లిసరైడ్ లైపేజ్ల నిమ్న స్థాయి చర్యలు, యురిసిక్ ఆమ్లంకోసం బేటాక్సిడేషన్ ఎంజైమ్ లు కార్డియాక్ లిపిడ్ పోగుపడడానికి, నిలబడడానికి దోహదమవవచ్చు. ఈచర్య పూర్తిగా అర్థం అవ్వకముందు యురిసిక్ ఆమ్లం మరియు ఆవాల నూనె రెండూ మనిషికి అతి విషపూరితమైనవన్న నమ్మకానికి దారితీసాయి.

ఎపిడెమియోలాజికల్ అధ్యయనాలు ఇప్పటికీ ఆవాల నూనెని సాంప్రదాయ రీతిలో ఉపయోగిస్తున్న ప్రాంతాలలో, ఆవాల నూనె గుండె సంబంధిత వ్యాధులని ఎదుర్కోవడంలో రక్షణగా ఉపయోగపడుతుందని సూచిస్తున్నాయి. ఈసందర్భంలో "సంప్రదాయం" అంటే నూనెని తాజాగా కూరగాయల క్రొవ్వులు మొత్తం కాలరీలలో అతి తక్కువ శతం ఉండడం. ఈప్రభావం యురిసిక్ ఆమ్ల శాత స్వభావమైన రక్త బింబాణువుల జిడ్డుతనాన్ని తక్కువ చేయడం వలన లేదా α-లినోలేనిక్ ఆమ్ల అధికశాత ప్రదర్శన లేదా తాజా శుద్ధి చేయని నూనె సమ్మేళన లక్షణాలా అనేవి ఖచ్చితంగా తెలియదు. ఫలితాలను తారుమారు చేసే మరణాల అవకాశాన్ని తొలగించడానికి ఇటువంటి ఎపిడెమియోలాజికల్ అధ్యయనాల గురించి తగిన శ్రద్ధ తీసుకోవాలి. నిజమేమిటంటే పూర్వ అసింప్టోమాటిక్ కరోనరీ వ్యాధిని పోస్ట్ మార్టంలో వెంటనే గుర్తించవచ్చు, ఇది ఆవాలనూనె పటాలంలో కనిపించదు, ఎందుకంటే ఇది ఆవాలనూనె సురక్షితం అన్న ఊహకి ఆధారాన్నిస్తుంది. సాంప్రదాయ సమాజాలలో ఆవాలనూనెని చిన్నపిల్లల మర్దనకి ఉపయోగించడం వారి చర్మ సరళతని మరియు పారగామ్యత పోయే ప్రమాదముంది.
ఖాద్య లైలము గా పేరు పొందిన ఆవనూనె బహుళ ఉపకారి. చర్మ సౌందర్యానికి ఇది సహకరిస్తుంది . మాడుకు రక్త ప్రసరణ బాగా జరగడము వ్ల్లఅ అవనూనె జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది .

నువ్వుల నూనె (Sesame oil or gingelly oil or til oil): నూనె గింజలైన నువ్వులు నుండి తయారౌతుంది. నువ్వులు శాస్త్రీయ నామం : సెసమమ్ ఇండికమ్ (sesamum indicum L) ఇది పెడాలియేసి (Pedaliacae) కుటుంబంలో సెసమమ్ (Sesamum) ప్రజాతికి చెందినది. నువ్వులను సంస్కృతంలో 'తిల '(Til) అందురు.

చరిత్ర
సింధు లోయ నాగరికత (hindu valley civilization) కాలం నాటికి అప్పటి ప్రజలు నువ్వుల నూనెను వాడేవారు. మానవుడు మొదటగా నువ్వుల నుండె నూనెను తీసి వాడటం ప్రారంబించినట్లు తెలుస్తున్నది. వేదాలలో కూడ నువ్వుల ప్రస్తావన వున్నది. నువ్వుల నుండి గానుగ ద్వారా నూనెను తీయువారు తిలకల వాళ్లు గా పిలవబడి కాలక్రమేన తెలికల వాళ్ళు గా మారారు. తెలికల కులానికి చెందిన వారు గానుగల ద్వారా నూనెను తీయటం తమ వృత్తిగా అక్కడక్కడ గ్రామాలలో వున్నారు. క్రీ. పూ. 600 నాటికి సింథులోయ నుండి మెసొపొటొమియా కు వ్యాప్తిచెందినది. సింథులోయ ప్రాంతం నుండే నువ్వులు మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందినది.

ఉపయోగాలు
నువ్వులనూనెను కేవలం వంటనూనెగానే కాకుండ దేహ మర్ధన తైలంగా, ఆయూర్వేద మందులలో, కాస్మాటిక్స్‌తరారిలో వాడెదరు. పసిబిడ్దకు (నెలల పిల్లలు) మొదట నువ్వుల నూనెతో మర్ధన ఛెసి ఆ తరువాత స్నానం చెయ్య డం ఇప్పటికి గామాలలో చూడ వచ్చును. ఆంతేకాదు, ప్రసవానంతరం,15-20 రోజుల వరకు బాలింతరాలికి నువ్వుల నూనె, నువ్వులతో చేసిన పథార్దంలు ఆహరంగా యిచ్చెవారు. పుస్కర సమయంలో, కర్మక్రియలలో, గ్రహ దోష నివారణ పూజలు చేసినప్పుడు బ్రహ్మణులకు నువ్వులను దానంగా యిస్తారు. దేవాలయాలలో, ముఖ్యంగా శనేస్వర ఆలయంలో నువ్వులనూనెతో దీపారాధన చెయ్యడం ఆచారం.

నువ్వులనూనెలో సెసమొల్ (sesamol), మరియు సెసమిన్ (sesamin) వున్నాయు. సెసమిల్ "రక్త వత్తిడి" (Blood pressure)ని తగ్గించును. వనస్పతి (డాల్డా)లో తప్పని సరిగా 10% వరకు నువ్వుల నూనెను ఉపయోగించాలని ప్రభుత్వ నూనెల-వనస్పతి శాఖ-కల్తి నిరోధక విభాగం నిభందన వున్నది. నువ్వుల నూనెను ఎదైన నూనెలో కల్తి చేసిన బౌవడిన్ టెస్ట్‌ (Baudouin test) ద్వారా గుర్తించవచ్చును.వనస్పతిని నెయ్యిలో కల్తి చేసిన ,ఈ బౌడిన్ టెస్ట్‌వలన గుర్తించవచ్చును. నువ్వులనూనె తో మర్ధన చేస్తే శరీర ఉష్ణోగ్రత క్రమపరచబడుతుంది .

పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు -శక్తి 880 kcal 3700 kJ-పిండిపదార్థాలు 0.00 g-కొవ్వు పదార్థాలు 100.00 g-- సంతృప్త 14.200 g- ఏకసంతృప్త 39.700 g -- బహుసంతృప్త 41.700 g -మాంసకృత్తులు 0.00 g-విటమిన్ సి 0.0 mg 0%-విటమిన్ ఇ 1.40 mg 9%-విటమిన్ కె 13.6 μg 13%
కాల్షియమ్ 0 mg 0%-ఇనుము 0.00 mg 0%-మెగ్నీషియమ్ 0 mg 0% -భాస్వరం 0 mg 0%-పొటాషియం 0 mg 0%-సోడియం 0 mg 0%శాతములు, అమెరికా వయోజనులకు సూచించబడిన వాటికి సాపేక్షంగా Source: USDA పోషక విలువల డేటాబేసు.

ఆముదపు నూనె (Castor Oil):

ఆముదపు గింజల నుండి తీయు నూనె ఖాద్యతైలం కాదు.కాని పారీశ్రామిక రంగంలో దీని వాడకం విసృతంగా కలదు. శాస్త్రీయనామము రిసినస్ కమ్మినిస్ (Ricinus communis), యుపెర్బెసియె కుటుంబానికి చెందినది. ఆముదపు మొక్కలను కేవలం నూనె గింజల ఉత్పత్తికై సాగుచేయుదురు. తూర్పుఆఫ్రికాలోని యిథోఫియా అముదం మొక్క ఆవిర్భవ స్దానం. అముదపు మొక్క ఏపుగా, ఎత్తుగా పెరగడం వలన ఆముదపు చెట్టు అని కూడా అంటారు.
నూనెను తయారుచేయడం

విత్తనంలనుండి నూనెను 'ఎక్సుపెల్లరు'లనబడునూనెతీయుయంత్రాలద్వారా తీయుదురు.40-50 సంవత్సరంలక్రితం,ఆముదంను కేశనూనెగా వాడుటకై 'వంటాముదం'పేరుతో నూనెను ప్రత్యేకంగా చేసెవారు.ఆముదంగింజలకు కొద్దిగానీరును కలిపి మెత్తగా దంచి,ఇకపెద్దపాత్రలోవేసి,తగినంతగా నీరుచేసిబాగా వేడిచేయుదురు,వేడికి నీటిపైభాగంలో ఆముదంచేరును.ఆలాపైకితేరిన నూనెను వేరేపాత్రలో వేసి,తేర్చెవారు.విత్తనంపై పెంకును తొలగించిలేదా,విత్తానాన్ని యదావిధిగా యంత్రాలలో ఆడించి నూనెను తీయుదురు.కేకులో వుండిపోయిన నూనెను సాల్వెంట్‌ప్లాంట్‌ ద్వారా తీయుదురు.

ఆముదపునూనె లేతపసుపు రంగులో వుండును.ఒకరకమైన ప్రత్యేకమైన వాసన వుండి,'ఆముదపువాసన'అనే జననానుడి వచ్చినది.ఆముదంలో వున్నకొవ్వుఆమ్లాలలో 75-85% వరకు రిసినొలిక్‌కొవ్వు ఆమ్లమున్నది.ఈ కొవ్వు ఆమ్లం ఒలిక్‌ఆసిడ్‌వలె ఎకద్విబంధంను 9-వకార్బను వద్దకల్గివుండి,18కార్బనులను కల్గివున్నప్పటికి,12-వకార్బను వద్ద అదనంగా ఒక హైడ్రొక్షిల్(OH)ను కలిగివుండటం వలన దానిభౌతిక,రసాయనిక ధర్మాలలో వత్యాసం వచ్చినది.రిసినొలిక్‌ఆసిడ్‌జీవవిషగుణం(toxic)మనుషులమీదచూపించును.తక్కువమోతాదులో రిసినొలిక్‌ఆసిడ్‌ను ఆహారంగా తీసుకున్న జీర్ణవ్యవస్ద మీద ప్రతికూల ప్రభావంచూపించి,విరోచనాలు కల్గును.ఎక్కువ ప్రామాణంలోతీసుకున్నదేహంలో నిర్జలీకరణ్ జరిగి సృహతప్పె ప్రమాదముంది.విరేచనాలకై పిల్లలకు ఆముదంను త్రాగించడం ప్రమాదకరం.శాకతైలంలలో ఎక్కువ సాంద్రత,స్నిగ్థత వున్ననూనె ఆముదం.అముదంను పలుపారీశ్రామిక ఉత్పత్తులలో విరివిగా వుపయోగిస్తున్నారు.

ఆముదం నూనె ఉపయోగాలు
* అముదంనూనెను ఆనాదిగా బళ్లచక్రాల ఇరుసుకు కందెనగా వాడకంలో వున్నది.అలాగే కండారాలబెణకునొప్పులకు ఆముదం నూనెతో మర్దన చెయ్యడం ఇప్పటికి గ్రామీణ ప్రాంతాలలో కొనసాగుచున్నది.అలాగే కేశతైలంగా కూడా వినియోగించెదరు.
* విద్యుతులేని గ్రామాలలో దీపాలను వెలిగించుటకు వాడెదరు.ఆముదం నూనె ఎకువ స్నిగ్థత కలిగి వున్నందువలన నెమ్మదిగా ఎక్కువ సమయం వెలుగును.
* పారిశ్రామికంగా పలు పరిశ్రమలలో ఆముదంను వాడెదరు.ద్రవ మరియు ఘనకందెనలు చేయుటకు,ముద్రణ సీరాలను,సబ్బులను చేయుటకు(లైఫ్‌బాయ్‌సబ్బులవంటివి),ఔషద తయారిలో(ఆయింట్‌మెంట్‌లలో బేస్‌గా హైడ్రొజెనెటెడ్‌ ఆయిల్)ఉపయోగిస్తారు.
* మెచిన్‌కటింగ్‌ఆయిల్స్‌,రంగులతయారి(paints&dyes),వస్తువులను అతికించు జిగురుల(adhesives),రబ్బరు,వస్త్రపరిశ్రమలలొ వినియోగిస్తారు.
* నైలాన్,ప్లాస్టిక్‌పరిశ్రమలోను,
* హైడ్రాలిక్‌ఫ్లుయిడ్స్‌లలో,విమాన యంత్రాలలో కందెనగా వినియోగిస్తారు.
ఆముదం నూనెను చర్మానికి పైపూతగా ఉపయోగి స్తారు. చర్మంపై ఏర్పడే పులి పిరులు, చెమట పొక్కులు, పాదాలకు ఏర్పడే అనెలకు లోతైన గాయాల తాలూకు మచ్చలను పోగొట్టడానికి కాస్ట్రా యిల్‌ దివ్యౌషధంగా పని చేస్తుంది. శిరోజాల ఆరోగ్యానికి రక్షణగా పనిచేస్తుంది. కనుబొమల వెంట్రుకలు పెరగడానికి కనురెప్పల సౌందర్యానికి ప్రతిరోజూ నూనెను రాయడం మంచిది. కేశాలు నల్లగా నిగనిగలాడటానికి తోడ్పడుతుంది. శిరోజాలకు ఉపయోగించే సౌందర్య సాధనాల తయారీలో కాస్ట్రాయిల్‌ వాడుతున్నారు.

ఆలివ్‌నూనె(Olive Oil) : చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఆలివ్‌ నూనెది ప్రత్యేక స్థానం. చిన్నారులకు మర్ధన చేయడానికి ఎక్కువగా ఈనూనెను ఉపయోగిస్తారు. చర్మానికి వాడే మందులు, ఆయింట్‌మెంట్స్‌ తయారీ లో నూ దీనిని ఎక్కువగా వాడుతారు. ఈ నూనెతో చర్మాన్ని మసాజ్‌ చేసి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చర్మం మృదువుగా, కాంతిగానూ మారుతుంది. చలికాలంలో డ్రై చర్మం కలవారు ఆలివ్‌ ఆయిల్‌ను చర్మానికి ప్రతిరోజూ రాస్తుంటే, చర్మం పగలకుండా ఉంటుంది. చర్మంపై పుండ్లు గాయాల కారణంగా ఏర్పడిన మచ్చలను పోగొట్టి చర్మం సహజ రంగుతో నిగారింపుగా ఉండేలా చేస్తుంది. చిన్న పిల్లలకు ఆలివ్‌ ఆయిల్‌ పట్టించి శరీరానికి మసాజ్‌ చేస్తే వారి చర్మం మృదువుగా ఉండి అందంగా తయారవుతారు. పీలగా ఉన్న పాపాయిలకు ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేస్తే బొద్దుగా అందంగా అవుతారు. గ్రీస్‌కు చెందిన మహిళలయితే.. ఆలివ్‌నూనెను మించిన పరిష్కారం లేదంటూ సూచిస్తారు. రోజు స్నానానికి ముందు కొద్దిగా ఆలివ్‌నూనె రాసుకుంటే చాలు.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. దాంతోపాటు.. స్నానపు నీటిలో నాలుగైదు చుక్కల ఆలివ్‌నూనెనూ వేసుకుంటారు వీరు. ఇక కొద్దిగా ఆలివ్‌నూనె రాసుకుని.. ఆ తర్వాత పంచదారతో రుద్దుకుంటే.. ముడతలు దరిచేరవని వీరి నమ్మకం.

నాలుగు చెంచాల ఓట్‌మీల్ పొడిలో మూడు చెంచాల ఆలివ్‌నూనె కలిపి పాదాలకు మర్థన చేసి అరగంటయ్యాక చల్లటినీళ్లతో కడిగేస్తే మృతకణాలి తొలగిపోయి పాదాలు మృదువుగా తయారవుతాయి.

వంటకాల్ని రుచిగా మాత్రమే కాదు.. పోషకాలు తగ్గిపోకుండా వండటం.. కూడా తెలిసుండాలి. అందుకు ఏం చేయాలంటే.. ఆకుకూరలు ఉడికించే నీళ్లలో కొద్దిగా ఆలివ్‌నూనె లేదా నిమ్మరసం వేస్తే పోషక విలువలు పోకుండా తగ్గకుండా ఉంటాయి.

జుట్టు పొడిబారకుండా ఉండాలంటే కొబ్బరి నూనె, ఆలివ్‌నూనె, ఆముదాలను సమపాళ్ళలో తీసుకుని బాగా కలపాలి. తలస్నానం చేయడానికి ఒక గంట ముందు తలకు బాగా పట్టించి తరువాత తలస్నానం చేయాలి.

బరకగా మారిన మోచేతులకు కొద్దిగా ఆలివ్‌నూనె రాసి మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మార్పు ఉంటుంది

చెంచా గ్లిజరిన్‌, కొద్దిగా రోజ్‌వాటర్‌, రెండుచెంచాల ఆలివ్‌నూనె, కాస్త నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన కలిపి చేతులకు పూతలా వేసుకోవచ్చు. ఆరాక కడిగేసుకుంటే చాలు... చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.

నాలుగుచుక్కల అల్లంరసంలో కొద్దిగా ఆలివ్‌నూనె చేర్చి జుట్టు కుదళ్లకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. కుదుళ్లు దృఢమవుతాయి.
ఆముదం, ఆలివ్‌నూనె వేడిచేసి చేతులను వేళ్లను ముంచి పావుగంటయ్యాక బయటకు తీసి మర్దన చేయడం వల్ల చక్కటి పోషణ అందుతుంది.చక్కగా పెరుగుతాయి.

సంపెంగ, సంపంగి లేదా చంపకం (Michelia):

దీని గాఢమైన వాసన మంచి శృంగారప్రేరితం. ఒత్తిడి చేత్తో తీసినట్లుగా పోతుంది. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. అధిక రక్తపోటునీ తలనొప్పినీ తగ్గిస్తుంది.

మరువం-Marjorana hortensis:


హైపర్‌ యాక్టివ్‌గా వుండే పిల్లలకు స్నానంలో రెండుచుక్కలు నూనె కలిపితే కాస్త స్థిరత్వం వస్తుంది. మలబద్ధకాన్ని పోగోడతుంది. ఈ నూనెని మర్దన చేస్తే తలనొప్పి, టెన్షన్‌ దూరంగా పారిపోతాయి. నీళ్ళలో వేసుకుని ఆవిరిపట్టడం వల్ల ఆస్థమా, సైనసైటిస్‌ వంటి సమస్యలన్నీ హుష్‌ కాకి.
చందనం-Sandal wood :
యోగా చేసేవాళ్ళకి చాలా మంచిది. మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. అలసటనీ తగ్గిస్తుంది.

లావెండర్‌-Lavender :
అత్యంత అధికంగా వాడుకలో వున్న ఈ నూనె వాడితే ఒత్తిడి పరార్‌. జలుబు, మైగ్రైయిన్‌ వంటి వాటిని తగ్గిస్తుంది. స్నానం చేసేటప్పుడు నీళ్ళలో ఒకటి రెండు చుక్కలు కలుపుకుంటే తాజాగా వుంటుంది. దిండుమీద రెండుచుక్కలు వేసుకుంటే హాయిగా నిద్రపడుతుంది. మంచి డియోడరెంట్‌, యాంటిసెప్టిక్‌ కూడా. అందుకే సబ్బులు, ఇతర లోషన్లలోనూ దీన్ని ఎక్కువగా వాడతారు.Source : Text book of Natural Medicaments for BAMA students.

Post a Comment

0 Comments