Full Style

>

శ్వాసకోశ వైరస్ జలుబు,Cold due to Respiratory Virus

-శ్వాసకోశ వైరస్ జలుబు,Cold due to Respiratory Virus- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




    జలుబు శ్వాసావయవాలకు సంక్రమించే బాధ. శ్వాసావయవాలు రెండు. పీల్చిన గాలి ప్రయాణం చేసే విభాగం మొదటిది. గాలి మార్పిడి చోటుచేసుకునే గాలి గోళాలు (ఏల్వియులై) రెండో విభాగం. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా శ్వాసావయవాల రోగులే అత్యధికం. శ్వాసావయవాల వ్యాధులలో జలుబు అతి సామాన్యమైన బాధ. ఇది వైరస్‌ క్రిముల ద్వారా సంక్రమించే వ్యాధి. --ఆరోగ్యంగా ఉండే పెద్దలకు, పిల్లలకు తరచుగా వచ్చే వ్యాధుల్లో శ్వాసకోశ వైరస్‌ వ్యాధులు ముఖ్యమైనవి.

సాధారణ జలుబు (కామన్‌ కోల్డ్‌), పెద్దల్లో రైనోవైరస్‌ మూలంగా (20 నుంచి 40 శాతం), పిల్లల్లో కరోనా వైరస్‌ (10 నుంచి 20 శాతం) కారణంగా వస్తుంది. పాఠశాలలకు, రోజువారీ వృత్తుల్లోని విధులకు హాజరు కాలేకపోవడానికి జలుబు ఒక ముఖ్య కారణంగా ఉంటున్నది. తుమ్మినప్పుడు వచ్చే తుంపరల్ల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది.
సాధారణ జలుబు వ్యాధిలో ముక్కు కారడం, తుమ్ములుముఖ్య లక్షణాలు. గొంతు నొప్పి, తలనొప్పి, నలతగా ఉండటం - కరోనా వైరస్‌ వల్ల వచ్చే జలుబులో ఉండవచ్చు.

సాధారణ జలుబు దానంతట అదే తగ్గే స్వభావం కలది. సాధారణంగా 5 నుండి 7 రోజులు బాధిస్తుంది. పిల్లల్లో ఈ జలుబు సంవత్సరానికి ఐదారుసార్లు వస్తుంది.

వయస్సు పెరిగే కొద్దీ తక్కువసార్లు వస్తుంది. లక్షణాలనుబట్టి ఈ వ్యాధిని వైద్యుడు నిర్ధారిస్తాడు.
అరుదుగానే, సైనుసైటిస్‌, బ్రాంకైటిస్‌, బ్రాంకియోలైటిస్‌, న్యుమోనియా వంటి సమస్యలు తలెత్తుతాయి. ఉపశమనానికి జలుబుకు, దగ్గుకు ఇతర లక్షణాలకు మందులు ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా వ్యాధిని నివారించవచ్చు.

ఇన్‌ఫ్లూయెంజా జ్వరం (ఫ్లూ) ఎ,బి,సి ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ల వల్ల వస్తుంది. ఈ వ్యాధి వర్షాలకు ముందు, చలికాలంలోను ఒకేసారి ఒకే ప్రాంతంలో అనేకమందికి (ఎపిడమిక్‌) సోకుతుంది.
ఇన్‌ఫ్లూయెంజా సోకినప్పుడు హఠాత్తుగా జ్వరం, తలనొప్పి, దగ్గు, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, నలతగా ఉండటం మొదలైన లక్షణాలు ఉంటాయి.

జ్వరం 38 - 41 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకూ ఉంటుంది. కళ్లలో నొప్పులు, కళ్లు నీరు కారడం, మంటలు ఉండవచ్చు. జ్వరం రెండు మూడు రోజులు ఉండవచ్చు. రెండు మూడు రోజుల్లో తగ్గే జ్వరాలను ఫ్లూ జ్వరాలని పిలవడం పరిపాటే.
కొంతమంది వ్యాధిగ్రస్తుల్లో ఫ్లూ లక్షణాలతో ప్రారంభించి న్యుమోనియా, గుండె వైఫల్యం, సి.ఒ.పి.డి. తిరగబెట్టడం వంటి ఇక్కట్లకు దారి తీయవచ్చు.

కాంప్లికేషన్లు లేని ఇన్‌ఫ్లూయెంజా జ్వరం 3నుంచి 5 రోజుల్లో తగ్గిపోతుంది. కొద్ది మందిలో నీరసం, నిస్సత్తువ కొద్దివారాలు ఉండవచ్చు. ఈ జ్వరంలో వచ్చే ఇక్కట్లలో న్యుమోనియా ముఖ్య మైనది.
న్యుమోనియా వచ్చిన ప్పుడు జ్వరం తగ్గ కుండా, ఆయాసం (ఎగశ్వాస), కళ్లె పచ్చగా పడటం, గోళ్లు, చర్మం నీలం రంగుగా ఉండటం (సయనోసిస్‌) మొదలైన లక్షణాలు ఉండవచ్చు.
గొంతునుండి స్రావాలను స్వాబ్‌ ద్వారా తీసి లేబొరేటరీకి పంపి పరీక్ష చేయించి వైరస్‌ను కనుగొని వ్యాధి నిర్ధారణ చేస్తారు. రక్తంలో వైరస్‌ యాంటిబాడీ టైటర్‌ నాలుగు రెట్లు పెరుగుతుంది.

మామూలు ఇన్‌ఫ్లూయెంజా జ్వరాన్ని పారా సెటమాల్‌ వంటి ఔషధాలతో చికిత్స చేస్తారు. న్యుమోనియా వంటి కాంప్లికేషన్లకు యాంటిబ యాటిక్స్‌, ఆక్సిన్‌ మొదలైన అత్యవసర చికిత్స అందిస్తారు. ఎమాంటిడిన్‌ వంటి యాంటీవైరల్‌ ఔషధాలను ఉపయోగిస్తారు.
చైతన్యరహితమైన వైరస్‌నుంచి తయారైన ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్‌ను వ్యాధి సోకకుండా, ముఖ్యంగా రోగ నిరోధక శక్తి లేని వారికి, ఊపిరి తిత్తులు, మూత్ర పిండాలు, గుండె జబ్బులుఉన్నవారికి చేయించడం శ్రేయస్కరం.

ఈ వ్యాక్సిన్‌ను వానాకాలం ప్రారంభం కావడానికి ముందు జూన్‌ నెలలోనూ, చలికాలం ప్రవేశించకముందు నవంబర్‌లోనూ చేయించుకోవాలి.
పారా ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ పిల్లల్లో ఎక్కు వగా బాధిస్తుంది. టైప్‌ 1 వైరస్‌ వల్ల క్రూప్‌ అనే తీవ్ర వ్యాధి వస్తుంది. ఊపిరి పీల్చడంలో ఇబ్బంది, శబ్దంతో కూడిన దగ్గు ఈ వ్యాధి లక్షణాలు.

టైప్‌ 3 వైరస్‌ వల్ల పసిపిల్లల్లో బ్రాంకియో లైటిస్‌, న్యుమోనియా వస్తాయి. టైప్‌ 2, టైప్‌ 4 వైరస్‌ల వల్ల కొద్దిపాటి లక్షణాలు ఉన్న జ్వరాలు వస్తాయి. పారా ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ వ్యాధి వల్ల జలుబు, గొంతు నొప్పి, గొంతు జీరపోవడం, శబ్దంతో కూడిన దగ్గు ఉంటాయి.
ఈ వ్యాధికి గురైన చాలామంది పసిపిల్లలు ఒకటి రెండు రోజుల్లో కోలుకుంటారు. ఇక్కట్లు ఎదురైనప్పుడు పిల్లల వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఆక్సిజన్‌, స్టీరాయిడ్స్‌ మొదలైన అత్యవసర చికిత్స జరగాలి.

జలుబుకి ... మార్కెట్ లో దొరికే (Anticold)జలుబు మాత్రలు వాడవచ్చు . ఉదా : Zincold , Coldact ,
జ్వరానికి : పారాసెటమోల్ (Paracetamol)
దగ్గుకి : ఏదైనా దగ్గుమందు ను తీసుకోవచ్చు . ఉదా : DM , Tossex , instaryl.
వాళ్ళు నొప్పులకు : Combiflame , dolomed , acelonac 750 ,
అప్పటికి తగ్గకపోతే వైద్య సలహా పొందాలి .

Post a Comment

0 Comments