Colon Hydrotherapy,కొలోన్ హైడ్రోథెరఫీ.-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
బయటి శరీరాన్ని రోజూ స్నానంతో శుభ్రం చేసుకుంటాం.. మరి లోపల పేగుల పరిస్థితి ఏంటీ. వాటి శుభ్రం చేసుకోవడం ఎలా? ఈ ఆలోచన నుంచి ఉద్భవించిన ప్రక్రియే ‘కొలోన్ హైడ్రోథెరపీ’. పెద్దపేగులో పోగుపడి ఉండే మలమాలిన్యాలను శుభ్రం చేయడం ప్రకృతి చికత్సలో ఒక భాగం. గతంలో ఏదో ఒక పైప్ ద్వారానో, ఒక చిన్న డబ్బా ద్వారానో చేసే ఈ చికిత్సను ఇప్పుడు పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునికమైన యంత్రపరికరాల ద్వారా చేయడానికి ఏర్పట్లున్నాయి.
ఎలాంటి కాలుష్యాలూ లేని అత్యంత పరిశుభ్రమైన ‘డిస్టిల్డ్ వాటర్’ను ఒకింత గోరువెచ్చటి ఉష్ణోగ్రతకు యంత్రమే వేడి చేసుకుంటుంది. మామూలుగా గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటితో కూడా ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేయవచ్చు. కానీ... ఒకింత గోరువెచ్చని నీటి వల్ల ఆహ్లాదకరమైన అనుభూతి మరింత ఇనుమడిస్తుంది. అందుకే ఈ స్వల్ప ఉష్ణోగ్రత. ఈ నీటిని మలమార్గం(రెక్టమ్) ద్వారా పంపడానికి ఉపయోగించే పైప్‌ల ద్వారా లోనికి పంపుతారు. ఇవి మలమార్గంలోకి ఎంత తేలిగ్గా ప్రవేశస్తాయంటే... వీటి వల్ల ఎలాంటి నొప్పీ ఉండకపోగా... లోపల ఉన్న మాలిన్యాలు చాలా సాఫీగా బయటకు వెళ్లడమన్నది చాలా తేలిగ్గా జరిగిపోతుందన్నమాట. ఒకవైపు నుంచి లోపలికి గోరువెచ్చని నీరు ప్రవహిస్తుండగా... లోపలికి వెళ్లిన నీరంతా అక్కడ ఉన్న మలమాలిన్యాలను శుభ్రం చేసుకుంటూ మరో పైప్ ద్వారా బయటకు వెళ్లిపోతూ ఉంటుంది.
ఇలా మన కడుపులోని మాలిన్యాలు వెళ్లిపోవడాన్ని ఈ ఆధునిక యంత్రానికి ఉన్న పారదర్శక పైప్‌ల ద్వారా ఎవరికి వారు చూడవచ్చు కూడా. ఒక్కోసారి వాళ్లు ఊహించనంతటి మాలిన్యం బయటకు వెళ్లూ ఉంటుంది.మరి ఇలా లోపలి మాలిన్యాలను బయటకు పంపించడం వల్ల ఒనగూరే ప్రయోజనాలేమిటి అన్నదే ప్రశ్న. దీనికి చాలా సంతృప్తికరమైన సమాధానాలు ఉన్నాయి. చాలా సురక్షితమైన ఈ ప్రక్రియలో ఎలాంటి నొప్పి లేకుండానే లోపల ఉన్నదంతా కడిగేసుకుపోతున్న అనుభూతి ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇది కేవలం మనకు కలిగే భౌతికమైన, బాహ్య అనుభూతి మాత్రమే. ఇక లోపల కలిగే ప్రయోజనా లెన్నో. ఉదాహరణకు... మలబద్ధకంతో బాధపడుతూ ఎంతో ముక్కుతూ, మూల్గూతూ మల విసర్జన చేసే వారు ఈ చికిత్స ప్రక్రియతో లోపల ఉన్నదంతా బయటకు వెళ్లడం వల్ల చాలా హాయిని పొందుతారు. కొలోన్ హైడ్రోథెరపీ ప్రక్రియ తర్వాత అంతా శుభ్రపడి, పెద్దపేగు (కొలోన్)లో ఒక మాలిన్యాలూ, విషపదార్థాలూ ఏవీ ఉండవు కాబట్టి చాలా పరిశుభ్రమైన రక్తం శరీరమంతటికీ సరఫరా అవుతుంది.
కొన్ని సందేహాలూ, సమాధానాలు
కొలోన్ హైడ్రోథెరపీ ప్రజల్లో కొన్ని సందేహాలూ, అపోహలు ఉన్నాయి. వాటి గురించి సంక్షిప్తంగా...
పెద్దపేగుల్లోని మలాన్ని తొలగించడం కోసం కొలోన్ హైడ్రోథెరపీని మొదట అనుసరించడం వల్ల అదే అలవాటైపోయి... ఆ తర్వాత స్వాభావికంగా విరేచనం కాదన్న అపొహ చాలా మందిలో ఉంటుంది. నిజానికి ఈ ప్రక్రియ ద్వారా మొదట అక్కడ గడ్డలు గడ్డలుగా చేరే మలం గట్టిపడి, ముందుకు జారకుండా మలబద్ధకం ఏర్పడుతుంది. అయితే ఒకటి రెండుసార్లు కొలోన్ హైడ్రోథెరపీ ద్వారా శుభ్రపరచే ప్రక్రియ తర్వాత ఇక అక్కడ మలం పోగయ్యే పరిస్థితి తప్పిపోతుంది. దాంతో స్వాభావికంగా విరేచనం కావడం సులభమవుతుంది. అంటే చాలా మంది అనుకున్నట్లుగా ఇది అలవాటుగా మారకపోవడం అటుంచి, మంచి శానిటరీ హ్యాబిట్‌ను పెంపొందిస్తుంది.
ఒకవైపు నుంచి నీళ్లను లోపలికి ప్రవేశపెట్టడం వల్ల అవి లోనికివెళ్లాయి.
అలా బయటకు వెచ్చేస్తాయి... మరి శుభ్రపరిచే ప్రక్రియెలా జరుగుతుంది... అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. బయటి నుంచి నీటిని మలద్వారం గుండా లోపలికి ప్రవేశపెట్టగానే ఆ నీరు లోపల పెద్దపేగుల పెరిస్టాలిటిక్ చలనపు స్పందనలకు అనుగుణంగా కదులుతుంది. దీనివల్ల ఆ నీటి సాయంతో పేగుల లోపల మూలమూలకూ కడిగినట్లుగా అయి మాలిన్యాలన్నీ బయటకు వచ్చేస్తాయి.లోపలికి పైప్‌ను ప్రవేశపెట్టేటప్పుడు నొప్పిగా ఉంటుందా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. కానీ చాలా మృదువైన పైప్‌ల కారణంగా ఇది ఎంతమాత్రమూ బాధాకరంగా ఉండదు. కాకపోతే కొందరిలో కాస్తంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. ప్రధానంగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్), క్యాండిడా వంటి రుగ్మతలతో బాధపడేవారు ఈ ఇబ్బందిని కాస్తంత ఎక్కువగా ఎదుర్కొంటారు. అయితే నీరు లోపలికి ప్రవేశించే వేగాన్ని నియంత్రించుకునే సౌకర్యం ఉంటుంది కాబట్టి మీ సమస్యను అధిగమించడాఇకి అవసరమైనంత వేగంగానే నీటి విడుదలను అనుమతించుకుంటూ ఈ సమస్యను అధిగమించవచ్చు.
ఎప్పటికప్పుడు మాలిన్యాలు కడుక్కుపోతూ ఉండటం వల్ల బరువు తగ్గడం కూడా జరుగుతుంది.
ఎవరెవరికి సిఫార్సు చేయలేం?ఇన్ని ప్రయోజనాలిచ్చే ఈ కొలోన్ హైడ్రోథెరపీని కొందరికి సిఫార్సు చేయలేరు. వాళ్లు... గర్భవతులు, పెద్దపేగు, మలద్వారం క్యాన్సర్‌తో బాధపడేవారు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ రోగులు, అల్సరేటివ్ కొలైటిస్ బాధితులు, పైల్స్‌తో బాధపడేవారు.
ప్రస్తుతం ఎక్కడ లభ్యమవుతుంది?

0 Comments