-గర్భనిరోధక మాత్రలు , Contraceptive pills- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
20వ శతాబ్దంలో మానవజాతిని ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య హద్దూ పద్దూ లేకుండా పెరిగిపోతున్న జనాభా, ''దేవుడిచ్చిన బిడ్డలు' నారు పోసిన వాడు నీరు పోస్తాడు. అంటూ మతాలు అధిక జనాభాను అరికట్టడానికి ప్రయత్నించలేదు సరికదా, ఆ రకంగా జరిగేయత్నాలకు పాపం, దుర్మార్గంఅంటూ వక్రభాష్యాలు చెప్పి ఎన్నో అవరోధాలు కల్పించింది. జనాభా అపరిమితంగా పెరిగిపోతూ వుంటే దారిద్య్రం నిర్మూలన ఎలా చేయాలి? అందరికీ వృత్తి ఎలా కల్పించాలి ? విద్యను, విజ్ఞానాన్ని, వికాసాన్ని ఎలా పెంపొందించగలం అన్నది ఆలోచించే ప్రతివారినీ వేధించే ప్రధాన సమస్య, సైంటిస్టు దృష్టిని కూడా ఈ సమస్య ఆకర్షించింది. పరిమిత కుటుంబం ఆనందానికి సోపానం అని వారు గుర్తించారు. అవసరం లేనప్పుడు పిల్లలు కలగకుండా ఎలా చేయాలి అని శాస్త్రజ్ఞులు ఆలోచించడం మొదలుపెట్టారు. కాలం చెల్లిన పాత భావాలకు ప్రతీకగా ఉన్న మతస్తుల ఛాందస భావాలను లెక్కపెట్టకుండా శాస్త్రజ్ఞులు, డాక్టర్లు మూఢనమ్మకాలను అధిగమించి గర్భ నిరోధక మాత్రలు రూపొందించాలని, రూపొందించితే తేలికగా అధిక జనాభాను అరికట్టవచ్చునని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈ విధంగా గర్భ నిరోధం కొరకు నోట్లో వేసుకొనే మాత్రలను రూపొందించి మానవజాతికి మహోపకారం చేసిన గొప్ప పరిశోధకులు డాక్టర్ గ్రిగరీపింకస్. ఆయన కనుగొన్న మాత్రలు సెక్స్ సంబంధాలలో ప్రపంచ వ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి- స్త్రీ-పురుష సంబంధాలలో సమానత్వ సాధనకు మార్గం సుగమం చేశాయి.
గ్రిగరీ పింకస్ 1903లో అమెరికాలో జన్మించాడు. కార్నేల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ప్రఖ్యాత హార్వర్డ్‌యూనివర్సిటీ నుండి డాక్టర్ ఆఫ్ సైన్సు డిగ్రీని పొందాడు. అమెరికాలోనూ, ఇంగ్లాండులోను, గొప్ప పరిశోధనలు జరిపాడు. ఎక్స్‌పెరిమెంటల్ జువాలజీలో ప్రొఫెసర్ అయి అందులో నిష్ణాతుడయ్యాడు. కుటుంబ నియంత్రణ గురించి ముందు జంతువులపై పరిశోధన చేశాడు. తరువాత మనుషులు గర్భ నిరోధక మాత్రలు నోటి ద్వారా తీసుకొనే విధంగా విప్లవాత్మకమైన కృషి చేసిన వ్యక్తి పింకస్. ఆధునిక యుగంలో ఏ పరిశోధన జరిగినా, అవి అన్నీ సమిష్టి కృషి ద్వారా సాధ్యమవుతున్నాయి. ఎందరో వీరుల త్యాగ ఫలితంగా గత శతాబ్దంలో దేశాలకు స్వాతంత్య్రం ఒక ప్రక్క లభిస్తే, మరోప్రక్క స్త్రీజాతి విముక్తికి గర్భనిరోధక మాత్రలు మార్గం సుగమం చేశాయి. 1937 లో ప్రొజెస్టరోన్ ఇంజక్షన్‌ను రూపొందించాడు.దాని ద్వారా జంతువులకు
గర్భ నిరోధం సులభ సాధ్యం అయింది. అయితే ఆ ఇంజక్షన్ ఇప్పుడు చాలా ఖరీదైనది. అమెరికాలో స్త్రీ స్వేచ్ఛ, సంక్షేమం కొరకు మూఢనమ్మకాలపై తిరుగుబాటు చేసిన ధీర వనతి మార్గెరెట్‌సాంగర్. ఆమె స్త్రీ స్వేచ్ఛకు గర్భనిరోధక ప్రక్రియలు అవసరమని ప్రచారం చేసి, డాక్టర్ పింకస్‌ను ఈ రంగంలో పరిశోధన చేయమని మరింతగా ప్రోత్సహించింది. కొద్ది విరాళాలతో సహకారంతో ప్రారంభమైన పరిశోధన ఎంతోమందిని ఆకర్షించి, ప్రజల నుంచి లక్షలాది డాలర్ల విరాళాలు వచ్చాయి. గర్భనిరోధక మాత్రలు స్త్రీలకు అందుబాటులో ఉండాలి. ఆరోగ్యంపై ఏ ప్రభావం ఉండకూడదు. పింకస్ ఈ లక్ష్యంతో తదేక దీక్షతో దశాబ్దాలపాటు నిర్విరామ పరిశోధన కొనసాగించారు. జంతువులపై వేలాది ప్రయోగాలుచేశారు. డాక్టర్ జాన్‌రాక్ సహకారంతో ప్రొజెస్టరోన్ మాత్రను రూపొందించారు. అది 85% మాత్రమే గర్భం నిరోధించగలిగింది. స్త్రీలు తీసుకోవలసిన డోస్ కూడా అధికంగా ఉండేది. అమెరికాలో కెమికల్ కంపెనీలు ఉత్పత్తి చేసే ప్రోస్టేజన్ మందులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి దానితో మిష్ట్రనాల్ కూడా కలిపి వాడితే సత్ఫలితాలు వస్తాయని పింకస్ ఊహించాడు. 1955లో పింకస్ తాను రూపొందించిన గర్భ నిరోధక మాత్రలను అమెరికాలో భాగమైన పోర్టోరి కాలో పట్టణంలో 265 మంది స్త్రీలకు యిచ్చి సత్ఫలితాలు సాధించాడు. ఈ ఎనోవిడ్ మాత్రను వివిధ ప్రాంతాలలో స్త్రీలకు యిచ్చి 1960మేలో ఈ గర్భనిరోధక మాత్రను అమెరికా అంతా అందుబాటులోకి తెచ్చాడు. ఇది కుటుంబ నియంత్రణ చరిత్రలో చాలా గొప్ప పరిణామం. ఎంతోమంది సహకరించినప్పటికీ ఈ గర్భ నిరోధక మాత్ర రూపకల్పన డాక్టర్ పింకస్ ప్రయత్న ఫలితమే. అహోరాత్రులు కృషి చేసి విజయం సాధించాడు. గర్భ నిరోధక మాత్ర కనుగొనడానికి ఎన్నో వ్యతిరేకతలను సామాజికంగా, మతపరంగా సాంస్కృతికంగా ఎదుర్కోవలసి వచ్చింది. మత గురువులు అగ్గిగుగ్గిలమయ్యారు. ఛాందసవాదులు ఇక నీతి నియమాలు మంటకలుస్తాయన్నారు. అయినా పింకస్ జంకలేదు. సైన్సులో, మానవాభివృద్ధిలో, దారిద్య్ర నిర్మూలనలో,స్త్రీజాతి విముక్తి సాధించడంలో పింకస్ విజయం అద్వితీయమైనది. అయితే ఛాందస్సులు, మతవాదుల వ్యతిరేకత వల్ల పింకస్‌కు నోబెల్ ప్రైజ్ యివ్వలేదు. ఆయన చేసిన పరిశోధన చరిత్రగతినే మార్చివేసిందని ఇప్పుడు చాలామంది గుర్తిస్తున్నారు. ఎవరీ గ్రిగరీ పింకస్ అని చూస్తే 1903లోరష్యా నుంచి అమెరికా వలస వచ్చిన తల్లిదండ్రుల కుటుంబంలో జన్మించారు. మానవజాతికి, అందులో ముఖ్యంగా స్త్రీలకు విముక్తి ప్రదాత అయిన పింకస్ 1967లో బోస్టన్‌లో
మరణించినా,ఆయన సాధించిన విజయం మూఢనమ్మకాలపై కొరడా ఝుళిపించింది. సైన్సు, శాస్త్రీయ దృష్టికి అది ప్రతీక.
ఆరోగ్యవంతంగా తల్లి, శిశువు ఉండాలంటే ఫ్యామిలి ప్లానింగ్ తప్పనిసరి. కాన్పు,కాన్పుకు కనీసం రెండు సంవత్సరాల గ్యాప్ ఉంటేనే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా క్షేమంగా ఉంటారు. ఈ నేపథ్యంలో గర్భని రోధానికి నేడు వివిధ మాత్రలు లభిస్తున్నాయి. వీటిని డాక్టర్ సలహా మేరకు వాడాలి. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా గర్భనిరోధానికి ఇవి ఎంతో ఉపయోగ కరం గా ఉంటాయి.గర్భనిరోధానికి రెండు రకాల పద్ధతులున్నాయి. ఇవి పర్మనెంట్, టెంపరరీ పద్ధతులుగా చెప్పుకోవచ్చు. టెంపరరీ పద్ధతిలో గర్భనిరోధక మాత్రలతో పా టు కండోమ్స్ వాడకం, ఇంట్రాయిన్ లూప్ కాంట్రసెప్ట్ డివైజ్‌లను ఉపయో గిస్తారు. వీటితో పాటు హార్మోన్ ఇంజెక్షన్లను కూడా వాడతారు. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ హార్మోన్ మాత్రలనే గర్భనిరోధక మాత్రలుగా పేర్కొంటారు. ఇవి మహిళల్లో అండం తయారుకాకుండా నిరోధిస్తాయి. దీంతో వారిలో ప్రెగ్నెన్సీ రాదు. ప్రస్తుతం తక్కువ మోతాదులోని గర్భనిరోధక మాత్రలు అందుబా టులో ఉన్నాయి. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి.
ఎవరు తీసుకోవాలి...
గర్భనిరోధక మాత్రలను 18 నుంచి 40 సంవత్సరాలున్న మహిళలందరూ తీసుకోవచ్చు. వీటిని మూడు నుంచి ఐదు సంవత్సరాలు వాడడం మంచిది. అంతకుమించి వాడాలనుకుంటే డాక్టర్ల సలహాను తీసుకోవాలి. గర్భనిరోధక మాత్రలను ఉపయోగించే ముందు డాక్టర్లను తప్పనిసరిగా సంప్రదించాలి. వారు సూచించిన మేరకు తమకు అనువైన మాత్రలను వేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం.
వివిధ రకాలుగా...
నేడు గర్భనిరోధక మాత్రలు సాధారణంగా రెండు రకాలు లభిస్తున్నాయి. వీటిలో 21 టాబ్లెట్లతో కూడిన స్ట్రిప్ ఒకటైతే రెండవది 28 టాబ్లెట్లతో కూడిన స్ట్రిప్ మరొకటి. 21 టాబ్లెట్లతో కూడిన స్ట్రిప్ ను మెన్సెస్ వచ్చిన ఐదవ రోజు నుంచి 25 వ రోజు వరకు వేసుకోవాలి. ప్రతి రోజు రా త్రి పడుకునే ముందు ఈ మాత్రలను తీసు కోవాలి. ఏదైనా రాత్రి మరచిపోతే మరుస టి ఉదయం వేసుకొని రాత్రి ఎప్పటిలాగే మ ళ్లీ మరొక మాత్ర వేసుకోవాలి. 21 టాబ్లెట్లు పూర్తయిన తర్వాత 2,3 రోజుల్లో మెన్సెస్ వస్తాయి ఆ తర్వాత అయిదు రోజుల గ్యాప్ తో మళ్లీ ఈ మాత్రలను తీసుకోవాలి. 28 టాబ్లెట్ల స్ట్రిప్‌ను ఉపయోగిస్తే ప్రతిరోజు ఒక మాత్రను వేసుకోవాలి. గర్భనిరోధక మాత్ర లను డాక్టర్‌చేత చెకప్ చేయించుకొని వేసు కోవాలి. వీటిని వేసుకోవడం ప్రారంభించే ముందు బరువు, బిపి చెక్ చేస్తారు. యుటి రస్ పరీక్ష కూడా నిర్వహిస్తారు. ఇటీవల కొత్తగా గర్భనిరోధక మాత్రలు వచ్చాయి. వీటిని వారానికి రెండు సార్లు మూడు నెలల పాటు వాడిన అనంతరం వారానికి ఒకటి వాడితే సరిపోతుంది. ఇవి గర్భనిరోధానికి ఎమర్జెన్సీ పిల్‌గా కూడా పనిచేస్తాయి.
కాన్పు తర్వాత...
శిశువుకు పాలిస్తున్న తల్లి ఆరు నెలల తర్వాత గర్భనిరోధక మాత్రలను వాడడం శ్రేయస్కరం. పాలివ్వని తల్లి మూడు నెలల తర్వాత వీటిని వాడవచ్చు. ఈ మాత్ర లతో తల్లిలో పాలు తగ్గే అవకాశం ఉంది.గర్భనిరోధ మాత్రలను వాడుతున్న ప్పుడు మధ్యమధ్యలో డాక్టర్ చేత చెకప్ చేయించుకోవాలి. డాక్టర్ బ్రెస్ట్ ఎగ్జామి నేషన్, యుటిరస్ టెస్ట్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం గర్భ నిరోధక మాత్రలను ప్రభుత్వం రూరల్ హెల్త్ కేర్ సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రు ద్వారా ఉచితంగా సరఫరాచేస్తోంది.
ఉపయోగాలు...
గర్భనిరోధక మాత్రల వల్ల ఇష్టంలేనప్పుడు గర్భం ధరించకుండా ఉండవచ్చు. ఫ్యా మిలీ ప్లానింగ్‌కు ఎంతో దోహదపడతాయి ఈ మాత్రలు. ప్రెగ్నెన్నీ ప్లానింగ్‌తో తల్లి, పుట్టే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటారు.గర్భనిరోధక మాత్రల సక్సెస్ రేట్ ఎంతో ఎక్కువ. ఫెయిల్యూర్ రేట్ కేవలం 0.4 శాతమే. కొంతమంది స్త్రీలలో పీరి యడ్స్‌లో బ్లీడింగ్ వస్తుంటుంది. గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల ఈ బ్లీ డింగ్ తగ్గుతుంది. బహిష్టు సమయంలో కొందరు కడుపునొప్పితో బాధపడుతుం టారు. అటువంటి వారికి ఈ మాత్రలు ఉపశమనంగా ఉంటాయి. ఈ మాత్రల వి నియోగంతో గర్భాశయం ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.హెక్టోపిక్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉం టుంది. రుమాయిటెడ్, ఆర్థరైటిస్ ఉన్న వాళ్లకి ఈ టాబ్లెట్లు ఉపశమనంగా ఉంటా యి. ఓవరీస్‌లో సిస్ట్‌లు ఉండే వారికి ఈ మాత్రలు ట్రీట్‌మెంట్‌గా పనిచేస్తాయి. బ్లీడింగ్ ఎక్కువ ఉన్నవారికి ఈ మాత్రల వాడకంతో చాలా వరకు తగ్గుతుంది.
ఎవరు వాడకూడదు...
గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు గర్భనిరోధక మాత్రలను వాడకూడదు. బి పి ఎక్కువగా ఉన్నవాళ్లు, షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు వీటిని వేసుకోకూడదు. కాలే యం సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్లు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ఉన్నవాళ్లు ఈ మాత్రలను ఉపయోగించకూడదు. 40 సంవ త్సరాలు పైబడిన వాళ్లు, స్మోక్ చేసేవాళ్లు కూడా వీటిని వాడకూడదు.
సైడ్ ఎఫెక్ట్స్...
గర్భనిరోధక మాత్రలను వాడడం వల్ల కొందరు మహిళల్లో కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది. వాంతి వచ్చినట్టు, గ్యాస్ ప్రాబ్లమ్‌తో వారు ఇబ్బం ది పడుతుంటారు. పొట్ట ఉబ్బి నట్టు కూడా వారికి అనిపి స్తుంది. కొందరికి నెలమధ్యలో బ్లీడింగ్ అవుతుంది. కొందరికి వెజెనల్ ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. లివర్ సమస్య కూడా రావచ్చు. టిబి ఉన్న వారు వీటిని వేసు కుంటే ఇబ్బందులు ఎదురవు తాయి. కొంత మందికి తలనొ ప్పి రావచ్చు. బరువు పెరుగుతా రు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టు కుపోతుంది. ఇటువంటి సమ స్యలు ఎదురై నప్పుడే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
గర్భనిరోధక మాత్రలతో జ్ఞాపకశక్తికి దెబ్బ! --తాజా అధ్యయనాల వెల్లడి :
గర్భనిరోధక మాత్రలు జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తాయని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందుకే, మహిళలూ! కాస్త భద్రంగా ఉండాలి అని సూచిస్తున్నారు. గర్భనిరోధక మాత్రలు వాడేవారిని...అసలే వాడని వారినీ ఎంపిక చేసుకుని నిర్వహించిన అధ్యయనం ఈ విషయాన్ని సుస్పష్టం చేస్తోందని వారు పేర్కొన్నారు. మాత్రలు వాడే వారిలో పలు అంశాలను గుర్తుంచుకునే సామర్థ్యం బాగా తగ్గినట్లు తేలింది. ఈ హార్మోన్ ఆధారిత గర్భనిరోధక మాత్రలు జ్ఞాపకశక్తి తీరును మారుస్తాయని పరిశోధనలను నిర్వహించిన షాన్ నీల్‌సన్ వెల్లడించారు. ఈ మాత్రలు జ్ఞాపకశక్తిని పూర్తిగా దెబ్బతీస్తాయని చెప్పలేం...అయితే, కచ్చితంగా వారు గుర్తుంచుకునే సమాచారం తీరుతెన్నులనే మార్చేస్తాయని నీల్‌సన్ తెలిపారు. అదే ఈ తరహా మాత్రలు వాడని వారిలో పరిస్థితి వేరేగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లమందికి పైగా మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడుతున్నట్లు అంచనా.
ఋతుచక్రం ఆరంభమైన 3-4 రోజులలో వేసుకుంటే మాత్ర ప్రభావం వుంటుంది. అయితే మాత్ర ప్రభావం బాగా కనిపించాలంటే వారం తర్వాత వేసుకోవాలి. అందువల్ల తొలిరోజుల్లో గర్భనిరోధానికి ఇతర మార్గాలను అనుసరించాలి.మాత్ర వేసుకునే సమయానికి స్త్రీ గర్భం ధరించి వుండకూడదు. 5వ రోజు వేసుకున్నవారికి ఇది మరీ వర్తించే విషయం.

0 Comments