చర్మాన్ని తెల్లబరిచే క్రీములు (స్కిన్ లైటెనింగ్) మితిమీరి వాడితే హైపర్‌టెన్షన్‌ను పెంచుతాయనీ కాలక్రమంలో చర్మానికి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయనీ డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. వైటెనింగ్ క్రీముల తయారీలో వాడే కొన్ని రకాల స్టీరాయిడ్‌లు, మెర్క్యురీ వంటివి కాలక్రమంలో నరాల వ్యవస్థను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. హైడ్రోక్వినైన్ వంటి రసాయనాలున్న క్రీములను వైద్యుల పర్యవేక్షణలో వాడాలి తప్ప, ఇష్టం వచ్చినట్టు వాడితే అనేక రకాల శాశ్వత దుష్ఫలితాలు కలుగుతాయంటున్నారు. శరీరఛాయ తక్కువగా ఉండటం తప్పేమీ కాదనీ మానసికంగా దృఢంగా ఉండి ఎంచుకున్న రంగంలో విజయం సాధిస్తే రంగును ఎవరూ పట్టించుకోరనీ వారు చెబుతున్నారు.
0 Comments