Diabetes with pesticides,పురుగుమందులతో మధుమేహం?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
పురుగుమందుల ప్రభావంతో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నది తెలిసిందే. అయితే వీటితో మధుమేహం కూడా వస్తుందా? ఆహారం, గాలి, నీరులోని నిరంతర సేంద్రీయ కాలుష్యకారకాలకూ (పర్‌సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్-సీఓపీ) పెద్దవారిలో మధుమేహానికీ సంబంధం ఉంటున్నట్టు స్పెయిన్‌లో చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. డీడీటీ పురుగుమందులో ఉండే డీడీఈ అనే రసాయనం ఎక్కువ మోతాదులో గలవారికి మధుమేహం వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. వయసు, లింగభేదం, శరీర బరువు ఎత్తుల నిష్పత్తి వంటి వాటి ప్రమేయం లేకుండానే ఇది కనబడుతుండటం గమనార్హం. మన శరీరంలోని కొవ్వులో ఈ కాలుష్య కారకాలు పోగుపడతాయి. అందువల్ల మిగతావారితో పోలిస్తే ఊబకాయుల్లో సీవోపీ స్థాయులు కూడా చాలా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. వీరికి మధుమేహం ముప్పు అధికంగా ఉండటానికి ఇదీ ఒక కారణం కావొచ్చని భావిస్తున్నారు. ''మన శరీరంలోని కొవ్వు శక్తిని నిల్వ చేస్తుంది. జీవక్రియల్లో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఈ కొవ్వు సీఓపీల వంటి హానికారకాలనూ నిల్వ చేసుకుంటుంది'' అని జువాన్ పెడ్రో అరెబోలా పేర్కొన్నారు. పురుగుమందులు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, గృహనిర్మాణానికి వినియోగించే పదార్థాల్లో సీవోపీలు ఉంటాయి. ఈ రసాయనాలు ఆహారం ద్వారానే కాదు.. చర్మం, పీల్చే గాలి ద్వారానూ శరీరంలోకి ప్రవేశిస్తాయి.

0 Comments