Full Style

>

తల తిరుగుట, డిజ్జినెస్‌ ,Diziness

డిజ్జినెస్‌ ,Diziness- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


-కొంతమంది తమకు తల తిరుగుతున్నట్లుందని అంటారు. ఇంకొందరు కళ్లు తిరుగుతున్నా యని, మరికొందరు చుట్టూ ఉన్న వస్తువులన్నీ గిర్రున తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయనీ అంటూ ఉంటారు. తమను ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించిం దనీ, శరీరం తేలిపోతున్నదనీ అంటూంటారు. ఇలా అనేకమంది ఒకే సమస్యను అనేక రకా లుగా వివరిస్తారు.

కొందరు ఈసమస్యను వర్టిగో (గదిలో సామా న్లన్నీ గుండ్రంగా తిరుగుతున్నట్లు అనిపించడం) అని భావిస్తుంటారు.వాస్తవానికి ఇలాంటి స్థితిని వైద్యపరిభాషలో డిజ్జినెస్‌ అని వ్యవహరిస్తారు. ఈ పదానికి ఖచ్చితమైన నిర్వచనం చెప్పడం కొంచెం కష్టమే. డిజ్జినెస్‌ అనే సమస్య మెదడుకు రక్త సర ఫరా తగ్గడం వల్ల సంభవిస్తుంది. వర్టిగో అనేది లోపలి చెవిలోని బాలెన్స్‌ కేంద్రానికి, మెదడుకు మధ్య ఉండే సమతౌల్యంలో లోపాల కారణంగా సంభవిస్తుంది.
డిజ్జినెస్‌ వంటి సమస్యకు గురైన వ్యక్తికి చికిత్స చేయడానికి రోగి తన బాధలను, తాను అనుభవిస్తున్న వ్యాధి లక్షణాలను స్పష్టంగా వైద్యులకు చెప్పగలగాలి. అప్పుడే ఈ వ్యాధిని అనుమానించి తగిన పరీక్షలు చేయించి, వ్యాధి నిర్ధారణ, చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది.

కారణాలు
డిజ్జినెస్‌ సమస్య ఉత్పన్నం కావడానికి అనేక అంశాలు దోహదం చేస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.
లో-బిపి
అల్ప రక్తపోటు లేదా లో-బిపితో బాధపడే వారిలో తల తిరుగుతున్నట్లు ఉండటం, కళ్లు తిరుగుతున్నట్లు ఉండటం అనేవి సాధారణంగా కనిపించే లక్షణాలు. రక్తపోటు మరీ తక్కువగా ఉంటే మెదడుకు ఆక్సిజన్‌తో కూడిన రక్తం అవసరమైన స్థాయిలో ఉందదు. ఫలితంగా మెదడు పనితీరు దెబ్బ తింటుంది. ఇటువంటి వారిలో కళ్లు తిరుగుతున్నట్లు ఉండ టమే కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. అవి -
- చెమటలు పట్టడం,
- వికారం, వాంతులు కావడం
- హ్రస్వ శ్వాస
- ఛాతీలో నొప్పి
శరీరంలోని మరొక వ్యాధి కారణంగా అల్ప రక్తపోటు సమస్య ఉత్పన్నమవుతుంది. అల్ప రక్తపోటుకు కారణమయ్యే కొన్ని అంశాలు ఈ కింద పొందుపరచడం జరిగింది.
- రక్తహీనత (రక్తంలో ఎర్ర రక్త కణాలు తగ్గి పోవడం)

- రక్తస్రావం
- నిర్జలీకరణ స్థితి (డీహైడ్రేషన్‌ లేదా శరీరంలో నీటి పరిమాణం గణనీయంగా తగ్గిపోవడం). ఇది సాధారణంగా వాంతులు లేదా విరేచనాల కారణంగా సంభవిస్తుంది. జ్వరం వల్ల కూడా కొన్నిసార్లు ఈ స్థితి ఏర్పడు తుంది. జ్వరం వచ్చినప్పుడు శరీర క్రియలు వేగవంతం కావడం, చెమటలు పట్టడం వంటి కారణాల వల్ల ఈ స్థితి సంభవిస్తుంది.

- నిర్జలీకరణకు కారణమయ్యే ఉష్ణ సంబంధ సమస్యలు. ఉదాహరణకు శరీరంనుంచి వేడి పోవడం, వడదెబ్బ మొదలైనవి.
- కొన్ని రకాల మందుల వల్ల అల్పరక్తపోటు ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా రక్తపోటు, గుండె రేటు నియంత్రణకు వాడే మందులు ఈ సమస్యకు కారణమవుతాయి. ఉదాహరణకు బీటాబ్లాకర్స్‌. ఇవి గుండెలోని అడ్రినలిన్‌ రిసెప్టార్స్‌ను అడ్డుకోవడం ద్వారా గుండె కొట్టుకునే తీరు పెరగకుండా చూస్తాయి. అలాగే నైట్రోగ్లిజరిన్‌, ఐసోసార్బైడ్‌ మోనోనైట్రేట్‌ వంటి మందులు గుండెలోని రక్తనాళాలనే కాకుండా, శరీరంలోని ఇతర రక్తనాళాలను కూడా వ్యాకోచింపజేస్తాయి. ఫలితంగా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది.
- మూత్రాన్ని జారీ చేసే ఔషధాలైన డయూ రిటిక్స్‌ వల్ల డీహైడ్రేషన్‌ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
- గుండె కొట్టుకునే రేటును మందగింపజేసే ఎసిఇ ఇన్హిబిటర్స్‌, పురుషుల్లో అంగస్థంభన సమస్య కోసం వాడే మందులు రక్తనాళాలను వ్యాకోచింపజేస్తాయి.
- మద్యపానం
- గర్భధారణ మొదలైనవి అల్పరక్తపోటుకు కారణమవుతాయి.

పాశ్చురల్‌ హైపోటెన్షన్‌
పాశ్చురల్‌ హైపోటెన్షన్‌తో బాధపడుతున్న వారు పడుకున్న భంగిమనుంచి కూర్చున్న ప్పుడు కాని, లేచి నిలబడినప్పుడు కాని కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంది.

డీహైడ్రేషన్‌కు గురైన వారిలో కాని, అనీమి యాతో బాధపడుతున్న వారిలో కాని, వారు పడుకుని ఉన్న సమయంలో రక్తపోటును నమోదు చేసినప్పుడు అది నార్మల్‌గానే ఉండ వచ్చు. కానీ వారు హఠాత్తుగా లేచి నిలబడి నప్పుడు శరీరంలో తక్కువగా ఉన్న ద్రవాంశం ప్రభావం కనిపిస్తుంది.

మెదడుకు రక్త సరఫరా తగ్గడం వల్ల కళ్లు తిరిగినట్లు, లేదా తల తిరుగుతున్నట్లు అనిపి స్తుంది. అయితే శరీరం ఈ స్థితికి అలవాటు పడగానే కొద్ధి క్షణాల్లోనే సమస్య తగ్గిపోతుంది. అయితే డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న వారిలోకాని, పైన పేర్కొన్న కొన్నిరకాల మందు లను వాడుతున్న వారిలో కాని ఈ సమస్య అలాగే కొనసాగుతుంది. ఈ సమస్య కారణంగా బాధితులు స్పృహ తప్పి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి.

కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తుల్లో కళ్లు తిరుగుతున్నట్లు, శరీరం తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. ఉదాహరణకు మధుమేహం, అడిషన్స్‌ డిసీజ్‌, పార్కిన్‌సన్స్‌ డిసీజ్‌ మొదలైన వ్యాధులతో బాధపడుతున్న వారు పడుకున్న స్థితినుంచి కూర్చోవడానికి కాని, లేచి నిలబడ టానికి కాని ప్రయత్నించినప్పుడు కళ్లు తిరిగి నట్లు అనిపిస్తుంది.
అలాగే అత్యంత అరుదుగా సోకే నాడీ మండల వ్యాధి షై-డ్రేగర్‌ సిండ్రోమ్‌లో కూడా ఈ పాశ్చురల్‌ హైపోటెన్షన్‌ సమస్య ఉంటుంది.

అధిక రక్తపోటు
వాస్తవానికి అధిక రక్తపోటుతో బాధపడు తున్న వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే దీనిని నిశ్శబ్ద హంతకి అంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అధిక రక్తపోటు బాధితుల్లో తలనొప్పి, వికారం, కళ్లు తిరిగినట్లు అనిపించడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను అధిక రక్తపోటుకు ఖచ్చితంగా అన్వయించాల్సిన అవసరం లేనప్పటికీ, ఇటు వంటి లక్షణాలు కనిపిస్తుంటే వారికి తక్షణ వైద్య సహాయం అవసరమవుతుంది.

వినాళ గ్రంథుల సమస్యలు కూడా కళ్లు తిరిగి నట్లు అనిపించడానికి కారణమవుతాయి. ఉదా హరణకు థైరాయిడ్‌ గ్రంథి పని తీరు సక్రమంగా లేకపోతే డిజ్జినెస్‌ సమస్య ఉత్పన్నమవుతుంది. అడ్రినల్‌ గ్రంథులు తగిన పరిమాణంలో కార్టిసాల్‌ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు సంభవించే అడిషన్స్‌ డిసీజ్‌లో కూడా డిజ్జినెస్‌ కనిపిస్తుంది. ఇదేవిధంగా డిజ్జినెస్‌ సంభవించ డానికి ఇతర కారణాలు అనేకం ఉన్నాయి.

Post a Comment

0 Comments