Full Style

>

Dreams,కలలు ,స్వప్నాలు

Dreams,కలలు ,స్వప్నాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మగ అయినా , ఆడ అయినా మనిషి జీవితం లో మనసు , శరీరము అనే రెండు భాగాలు ఉంటాయి. మనిషి సమాజము తో ముడిపడి ఉంటాడు . మనసుని శరీరాన్ని విడదీయలేము .భూమిపైన కోటానుకోట్ల జీవరాశుల్లో మనిషిగా పుట్టడం ఒక వరం . కర్మ చేయడమే కాదు ... అది ఆరంభించడానికి ముందు ఆలోచించి తెలివిగా చేసే అవకాశము మనిషికే ఉంది . మిగతా జీవరాశులు తమ తమ ప్రకృతి ధర్మాలను బట్టి పని చేసుకుపోతూ ఉంటాయి. పంచావసరాలైన 1.గాలి , 2.నీరు , 3.ఆహారము , 4. నిద్ర , 5.మైధునము -- ఈ ఐదూ అన్ని జీవరాశులకు సమానము . తన చుట్టూ ఉన్న సమాజములో పూర్వపరాలు బేరీజు వేసుకుని ముందుకు సాగుతారు మానవులే ... ఆ ప్రక్రియలో కొన్ని కోరికలు తీరుతాయి , కొన్ని కోరికలు తీరవు . కర్మ అంటే పని . అందుకోసము ఐదు కర్మంద్రియాలు , ఐదు జ్ఞానేంద్రియాలు నిరంతరమూ తపన పడుతూ ఉంటాయి .

కర్మేంద్రియాలు : పంచకం : 1.వాక్కు(నోరు), 2.పాణి(చేయి), 3.పాదం(కాలు), 4.పాయువు(గుదము), 5.పునరుపత్తి అవయవాలు.

జ్ఞానేంద్రియ పంచకం : త్వక్కు = చర్మం, చక్షువు = కన్ను, రసన = నాలుక, శ్రోతం = చెవి, ఘ్రాణం = ముక్కు,

వీటి సహాయ సహకారాలతో మనిషి ఆశయాలు, భావాలు, లక్ష్యాలు, నెరవేరని పక్షాన -- స్వప్నాలు గా ఏర్పడుతుంటాయి. మనస్సు ఆలోచనలను పూయిస్తుంది. కళ్ళను కలలతో నింపుతుంది. పగటి ఆలోచనలే రాత్రి వేళ కలలుగా మారుతుంటాయి.

నిద్రకి చెందిన కొన్ని స్థితులలో అసంకల్పితంగా మనసులో మెదిలే భావాల, భావావేశాల, ఐంద్రియ సంవేదనల సందోహాలను స్వప్నాలు లేదా కలలు (Dream) అంటారు. కలల యొక్క అంతరార్థం ఏమిటో, వాటి ప్రయోజనం ఏమిటో ఇప్పటికీ మనకి పూర్తిగా అర్థం కాదు. కాని కలల గురించి ఎంతో ఊహాగానం, అనిర్ధారిత చింతన మనకి చరిత్రలో కనిపిస్తుంది. కలల యొక్క శాస్త్రీయ అధ్యయనాన్ని ఓనేరాలజీ (Oneirology) అంటారు. కలలు ఎంతో స్ఫూర్తి దాయకం కావడమే కాక, చాలా అనిర్ధారిత నమ్మకాలకి తావు ఇవ్వడం, కలల సుదీర్ఘమైన చరిత్ర లో మనకి కనిపిస్తుంది. కలలలో ఏదో అంతరార్థం ఉందన్న నమ్మకం, కలల సహాయంతో భవిష్యత్తుని తెలుసుకోవచ్చన్న నమ్మకం ఎన్నో సమాజాలలో అనాదిగా చలామణిలో ఉంది. కలలకు ఆధారం మనస్సులో ముద్రితమైన సునిశిత ఆలోచనలే! కొన్ని సందర్భాల్లో కొందరికి తీరని వాంఛలు కలల్లో తీరుతుంటాయన్నది నిజం.

కలలని కేవలం భౌతికంగా, జీవ శాస్త్ర దృక్పథంతో చూస్తే అవి నిద్రావస్థలో నాడీ సంకేతాల చలనాలకి ఫలితాలుగా చెప్పుకోవచ్చు.

మనస్తత్వ శాస్త్రం దృష్ట్యా చూస్తే అవి ఉపచేతనలో జరిగే చలనాలకి ప్రతిబింబాలుగా చెప్పుకోవచ్చు.
అధ్యాత్మికంగా చూస్తే దివ్య సందేశాలు గానో, భవిష్యత్తుని తెలిపే దూతలు గానో చెప్పుకోవచ్చు.

ఎన్నో సంస్కృతులలో స్వప్న సంపోషణ అనే ఆచారం ఉన్నట్టు తెలుస్తోంది. స్వప్న సంపోషణ అంటే భవిష్యత్తుని సూచించే, దైవం నుండి వచ్చే కలలని, జాగ్రత్తగా పోషించుకోవడం, కాపాడుకుని పెంచుకోవడం అన్నమాట.

పీడ కలలు :
భావోద్వేగాలు, సంఘర్షణ, ఆందోళనల కారణంగానే పీడకలలు సంభవిస్తాయి. మనిషి మేల్కొనే సమయంపై ఇవి ఎలాంటి ప్రభావాన్ని చూపవు. ప్రతి పదిమందిలో ఒకరిని భయోత్పాతంతో కూడిన కలలు వెంటాడుతున్నాయి. నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తున్నారు. మెట్లపై/మేడపై నుంచి పడిపోయినట్లు, ఎవరో వెంటాడుతున్నట్లు, పక్షవాతం సోకినట్లు, వాహనం/రైలు ఆలస్యమైనట్లు, ఆత్మీయుల్లో ఎవరో చనిపోయినట్లు, జుట్టు, పళ్లు రాలిపోవడం, బట్టతల, పరీక్షల భయం పీడిస్తూ అధికంగా పీడకలలు వస్తాయి.

దైన సంహితలో స్వప్నశాస్త్రం ఒకటి -ఈ శాస్త్రంలో స్వప్న దశలో కనిపించే విషయాలని ఆధారం చేసుకుని వివరాలు చెప్పడం జరుగుతుంది. స్వప్నాలు మానసిక భావాలని ఎలా ప్రతిబింబిస్తాయనేది ఈ శాస్త్రంలో తెలస్తుంది.

కలలకు ఆలోచనలు ఊతంగా, ఆలంబనగా వుంటాయి. కలలు కూడ మనసు చేసే గారడీయే! మంచి పనులు చేస్తూ, మంచి నడవడిక కలిగి వుండేవారికి మంచి కలలే వస్తాయి.

జనానికి ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తి. గుళ్ళు గోపురాలు దర్శించడం, ఆలయాల్లో పూజలు చేయించడం, ఇంటివద్ద పూజగదిలో గంటల కొద్దీ దేవతార్చన చేయడం ఆమె నిత్యకృత్యాలు. ఆమెకు వచ్చే కలలు కూడ వైవిధ్యంగానే వుండేవి. నిజజీవితంలో సాధ్యంకాని తీర్థయాత్రల దర్శనం ఆమె స్వప్నావస్థలో చేసుకొనేది. అయితే తీర్థాలలోని పరిసరాలు, ప్రకృతి యధాతధంగా చూచిన అనుభూతి ఆమెకు కలుగుతుండేది.

స్పెషల్‌స్టోరీ గుండారావుది కాసుల కోసం కత్తుకలు కత్తిరించే మనస్తత్వం. చెయిన్‌ స్నాచింగ్‌, రైళ్లు బస్సులో సూటు కేసులు, బ్యాగుల అపహరణ, పిక్‌పాకెటింగ్‌ ఇత్యాదివి అతని వ్యాపకాలు. అతనికి వచ్చే కలలు తన వ్యాపకంలో లబ్ధికుదిరి లాభించిన సందర్భాలుగానే వుండేవి.

మనం ఆదిత్యుని ఆరాధిస్తాం! శశాంకుని పండువెన్నెలను ఆస్వాదించి ఆనందించని వారు బహుశ ఎవరూ వుండరు. అమావాస్య రాత్రుల్లో కూడ నక్షత్రాల ఉనికివల్ల ప్రకృతి కటిక చీకటిమయం కాకుండా వుంటుంది. ఇవన్నీ కలలో కనిపిస్తే శుభంగా పరిగణిస్తారు. దేవీ దేవతలు కలలో కనిపిస్తే కూడ చాల శుభం కలుగుతుంది. లక్ష్మీ అమ్మవారిదర్శనం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. అయితే అమ్మ వారివాహనమైన గుడ్లగూబ దర్శనం మంచిదిగా చెప్పబడలేదు. అగ్నిహోత్రుల దర్శనం స్వప్నంలో ప్రాప్తిస్తే శుభంగా చెప్ప బడింది.

నిద్రావస్థలో స్వప్నం వచ్చేస్థితిని ఆంగ్లంలో - రాపిడ్‌ ఐ మూవ్‌ మెంట్‌ గా వ్యవహరిస్తారు. కనుగ్రుడ్లు ఈ అవస్థలో వేగంగా కదులుతూ వుండం వలన దానికాపేరు వచ్చింది. ఈ దశలోనే మనిషి కలలు కనడం జరుగుతుంది. సాధారణంగా తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయంటారు. అసలు మనకు కలలు ఎక్కువగా వచ్చేది తెల్లవారు జామునే! నిద్రావస్థ చరమ దశ తెల్లవారుజాము కాబట్టి ప్రయత్నిస్తే ఆ సమయంలోని కలలను గుర్తు పెట్టుకొన గలిగే అవకాశం వుంది. కొందరికి అర్థరాత్రి 2-3 గంటల సమయంలో మెలకువ వస్తే ఇంక నిద్ర పట్టదు. అయినా కళ్లు మూసుకొని పడుకొనటం వల్ల మెదడు, కళ్లు సేద దీరుతాయి. మెలకువ వున్నప్పటికీ కళ్లు మూసుకొని పడుకొంటే మెదడు చేతనావస్థలో వుండి కూడ నిద్రా ఫలితం కొంతమేర దక్కుతుంది. నిద్రపట్టలేదు, మెలకువ గానే ఉన్నామను కొన్నప్పటికీ ఆ సమయంలో కూడ చిట్టి పొట్టి కలలు వచ్చినట్లు గమనించ వీలవు తుంది.

సాధారణంగా కలల్లో ఆవేశం, భయం, సంతోషం లాంటి అనుకూల, అననుకూల భావాలు ప్రస్ఫుట మౌతాయి. యువకులు, యువతుల్లో వచ్చే కలలు సాధారణంగా ప్రేమ పరమయినవిగా వుంటాయనీ, ఆ సమయంలో వారు ఉద్వేగాన్ని అనుభవిస్తారనీ తేలింది. ఆడవారిలో డెబ్భయి శాతం, మగవారిలో 65 శాతం ఒకే రీతికి చెందిన స్వప్నాలు పదేపదే అనుభూతించడం జరుగుతుందని తెలుస్తుంది. చాలా భాగం కలలు నలుపు-తెలుపు రంగుల్లోనే అనుభూతికి వస్తాయి. మనస్తత్వ శాస్రవేత్తలైన సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌, కార్ల్‌జంగ్‌ కలలు చేతన అంతశ్చేతనా వస్థల్లోని మధ్య సమయంలో కనటం జరుగుతుందని చెప్పడం జరిగింది. తన జీవితంలో నిరాదరింపబడిన తిరస్కరింపబడిన, అణచివేతకు గురయిన అనుభవాలను మనిషి కలల్లో సానుకూలం గా మలచుకుంటాడని ఫిట్స్‌ పెరల్‌ అనే శాస్త్రజ్ఞుడు చెప్పటం జరి గింది. వైద్య పరంగా చూస్తే నరాలు, నాడీమండల వ్యవస్థకు అనుగుణంగా కలలు వుంటాయని తేలింది. వ్యతిరేక ఆలోచనా దృక్పథం కలిగి ఉన్న వారికి, నిరాశావాదులకు భయానక స్వప్నాలు వస్తా యట!

తమకు వచ్చిన స్వప్నాలను గుర్తుంచుకొని తిరిగి బయటికి చెప్పగల శక్తి మగవారి కంటే ఆడవారిలోనే అధికమని గుర్తింపబడింది. సానుకూల దృక్పథం కల వారికి మంచికలలే వస్తాయి.

సిగ్మండ్ ఫ్రాయిడ్ (Sigmund Freud) జననం మే- 06 -1856, మరణం సెప్టెంబరు 23 1939. ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన మానసిక శాస్త్రవేత్త. ఇతను మానసిక శాస్త్ర పాఠశాలను స్థాపించాడు. ఫ్రాయిడ్ తన ప్రఖ్యాత పుస్తకం అన్‌కాన్షియస్ మైండ్ మరియు డిఫెన్స్ మెకానిజం ఆఫ్ రెప్రెషన్. మానసిక శరీరవైద్యశాస్త్రము మానసిక శాస్త్రవేత్త-రోగి మధ్య వార్తాలాపం ద్వారా మానసిక విశ్లేషణ (Psychoanalysis) చేసి రుగ్మతలను దూరం చేయుట కొరకు ప్రసిద్ధి గాంచాడు. ఫ్రాయిడ్ తన సిద్ధాంతం సెక్షువల్ డిజైర్ ద్వారా మానవ జీవిత ఉత్ప్రేరక శక్తిని వెలికి తీసే వివరణలు, చికిత్సలో మెళకువలు, ఫ్రే అసోషియేషన్ వాడుక, చికిత్స సంబంధిత ట్రాన్స్ఫరెన్స్ సిద్ధాంతము మరియు స్వప్నాలు నిగూఢ వాంఛలను అర్థం చేసుకోవటానికి సోపానాలు అని ప్రతిపాదించి ప్రసిద్ధి గాంచాడు.

Read more about Dreams at - > Dream.

కల-నిజం
నిద్రలో కలలు రావడం సాధారణమైన విషయం, అంత మాత్రాన నిద్ర సరిగ్గా పట్టడంలేదని ఆందోళన చెందనవసరం లేదు. సృజనాత్మకత ఎక్కువగా ఉన్నవారికి సహజంగా కలలు ఎక్కువగా వస్తాయి.
భయం పుట్టే కలలు వచ్చినపుడు మాత్రం గుండె కొట్టుకునే, వూపిరి పీల్చే వేగం పెరుగుతాయి. అలాంటప్పుడు మెలకువ రావొచ్చు.
సాధారణంగా తెల్లవారు జామున మనం ముందు రోజు చేసిన పనులూ ఆలోచనల చుట్టూ కలలు వస్తాయి. కల ఎప్పుడో యాదృచ్ఛికంగా నిజం కావొచ్చు తప్ప వేకువన వచ్చే కలలు నిజమవుతాయనేది అపోహ మాత్రమే. కలలు ఎక్కువగా వేధిస్తున్నపుడు పగటిపూట సంతోషకరమైన అంశాలపైన దృష్టి పెట్టాలి. కలలకు అంత ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతర విషయాలపైకి దృష్టి మరల్చాలి.

Post a Comment

0 Comments