Full Style

>

డుప్యూట్రెన్స్‌ వ్యాధి ,Dupuytren's disease

డుప్యూట్రెన్స్‌ వ్యాధి (Dupuytren's disease)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


అరచేయి కింద ఉండే చర్మం కింద ఉండే కణజాలం అసాధారణ స్థాయిలో మందంగా మారడాన్ని వైద్య పరిభాషలో డుప్యూట్రెన్స్‌ వ్యాధి అని వ్యవహరిస్తారు. ఇది సాధారణంగా అరచేతిలో ఒకచోట స్థిరంగా ఉండే కంతులు మాదిరిగా ఆరంభమవుతుంది. కొన్ని సందర్భాల్లో అరచేతినుంచి వేళ్లలోకి స్థిరమైన గట్టి పోగులుగా మొదలువుతుంది. ఈ పోగుల కారణంగా వేళ్లు క్రమేపీ అరచేతిలోకి ఒంగిపోతాయి. దీనిలో చర్మ ప్రమేయం ఉంటుంది. అయితే చర్మం కిందుగా ఉండే టెండాన్స్‌ వంటి నిర్మాణాల ప్రమేయం మాత్రం ఉండదు. కొన్నిసార్లు ఈ వ్యాధి వేళ్ల కణుపుల పైభాగంలో చర్మం మందంగా తయారయ్యేలా చేస్తుంది. దీనిని నకిల్‌ పాడ్స్‌ అంటారు. లేదా పాదం అడుగుభాగంలో కంతుల వంటి నిర్మాణాలు లేదా గట్టి పోగులు ఏర్పడుతాయి. వీటిని ప్లాంటార్‌ పైబ్రోమాటోసిస్‌ అంటారు.

కారణాలు
డుప్యూట్రెన్స్‌ వ్యాధి సోకడానికిగల కారణాల గురించి ఇతమిత్థమైన సమాచారమేదీ అందుబాటులో లేదు. కానీ, అరచేతి చర్మం కింద ఉండే కణజాలంలో సంభవించే కొన్ని జీవ రసాయన అంశాల్లో మార్పులు దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ వ్యాధి ఎక్కువగా పురుషుల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన పురుషుల్లో దీని ఉనికి ఎక్కువ. చేతికి గాయాలు కావడం, కొన్ని ప్రత్యేక వృత్తుల్లోని వారికి ఈ సమస్య ఉత్పన్నమవుతుందన డానికి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవు.

లక్షణాలు
అరచేతిలో గుంటలుగా ఉన్న భాగాల్లో కంతుల వంటి బుడిపెలు ఏర్పడుతాయి. అంతగా నొప్పి ఉండదు. సమతలంగా ఉండే టేబుళ్లవంటి వాటిపై అరచేతిని ఆన్చలేకపోవడం తదితర అంశాలతో ఈ వ్యాధిని

ముందుగా గుర్తించడం జరుగుతుంది. ఈ వ్యాధిలో ఏర్పడిన బుడిపెలు స్థిరంగా ఒకచోటే చర్మానికి అతుక్కుని ఉంటాయి. క్రమేపీ గట్టిగా ఉండే పోగుల వంటివి ఏర్పడుతాయి. అవి అరచేతినుంచి వేళ్లలోకి పాకుతాయి. ఇవి ఒక వేలుకు కాని, ఎక్కువ వేళ్లకు కాని పాకవచ్చు. సాధారణంగా ఉంగరం వేలు, చిటికెన వేళ్లకు ఈ పోగులు పాకుతాయి. ఈ రకమైన పోగులను టెండాన్లని భ్రమించే అవకాశాలున్నాయి. అయితే ఇవి చర్మానికి, టెండాన్లకు మధ్యలో ఏర్పడుతాయి. సాధారణంగా రెండు చేతుల్లోనూ ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. అయితే వాటి తీవ్రతలో తేడాలు ఉండవచ్చు.తొలిదశలో ఏర్పడే బుడిపెలు దైనందిన కార్యకలాపాలను నిర్వహించడానికి కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. అయితే ఆ ఇబ్బంది కొద్దికాలం తరువాత తగ్గిపోతుంది.

వేళ్లు అరచేతిలోకి ముడుచుకుపోవడం ఈ వ్యాధిలో కనిపించే మరొక లక్షణం. ఈ కారణంగా చేతితో దేనినైనా కొలవడం కష్టతరంగా మారుతుంది. అలాగే బట్టలు ఉతకడం, షేక్‌హ్యాండ్స్‌ ఇవ్వడం, గ్లౌవ్స్‌ తొడుక్కోవడం, జేబులో చేతులు పెట్టుకో వడం మొదలైన అంశాలు ఇబ్బందికరంగా మారుతాయి. ఈ వ్యాధి ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందనే విషయం చెప్పడం కష్టం. కొంతమందిలో బుడిపెలు చిన్నగా మిగిలి పోవచ్చు. మరి కొందరిలో చర్మం అడుగున ఏర్పడే పోగులు బాగా పెరిగి వేళ్లు ముడు చుకు పోవచ్చు.

చికిత్స
ఈ వ్యాధిలో కలిగే బుడిపెలు, పోగుల కారణంగా వేళ్లు ముడుచుకుని పోని దశలో ఉన్న కొన్ని కేసుల్లో కేవలం రోగిని పరిశీలనలో ఉంచితే సరిపోతుంది. వేళ్లు ముడుచుకునిపోయిన దశలో ఉండే కేసులకు శస్త్ర చికిత్స అవసరమవుతుంది. చేతి వేళ్ల భంగిమలను సరి చేయడానికి పలు రకాలైన శస్త్ర చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఏ రకమైన విధానాన్ని అమలు చేయవచ్చుననే విషయాన్ని శస్త్ర చికిత్స చేయబోయే వైద్యులు రోగితో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

Post a Comment

0 Comments