మానవ శరీరము ఒక అద్బుతం . ఇది నిరరంరం పనిచేసే వ్యవస్థ . ఇందులో మెదడు కీలకపాత్ర వహిస్తుంది . నిరంతర అలసటతో బాధపడేవారు మెదడు ను నియంత్రించే చికిత్సతో తిరిగి కొత్తశక్తిని పొంది రెట్టింపు వుత్సాహము తో పనిచేయగలుగుతారు . అలసట అందరికీ కలిగే అనుభవమే . ఆటలు ఆడిన పిల్లలు అలసిపోయి ఇంటికి వస్తారు . సాయంత్రం 3 గంటలు చదివిన పిల్లలు అలసి పోతారు . ఆఫీసుపనితో మగవారు , ఇంటిపనితో ఆడవారు అలసిపోవడం సహజము . అలసిపోగానే నీరసం వస్తుంది . ఆకలి వేస్తుంది .. నిద్రవస్తుంది . ఇలాంటి సాధారణ అలసట నుండి సులభముగానే బయట పడతాం కాస్త నిద్రపోతే ఇట్టే పోతుంది . కాని దీనికి భిన్నమైన అలసట తో ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు . ఈ అలసట అందరకూ ఉండదు . ఉదయం పక్కమీదనుండి లేవలేనంత నీరసం వారిని వేధిస్తుంది . లేచి అడుగులు వేయడానికి ఎలాంటి ఉత్సాహము ఉండదు . కాసేపు పనిచేసేసరికి ఇట్టే అలసిపోతారు . పనిచేయాలనిపించదు . జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది . ఏపని చేయాలన్నా అలసటగా ఉందంటారు . కారణం లేకుండా కలిగే అలసటను వైద్యశాస్త్రం లో " క్రానికల్ ఫెటిగ్ సిండ్రోం " అంటారు .
ఇప్పుడు పలుచోట్ల ఏనోట విన్నా ఒకటేమాట. అలసిపోవటం, మెట్లక్కితే ఆయాసం, బస్ కోసం కాస్త దూరం నడిస్తే ఒగుర్పు, ఇంట్లో వాషింగ్ మెషిన్ వున్నా, బట్టలు ఉతికించడానికి ఓపికలేక పోవటం, అంతెందుకు టీవీలో సిరియల్ తర్వాత లైట్ స్విచ్ 'ఆఫ్' చేయడానికి బద్దకం. కొందరి ఇళ్లల్లో ట్రెడ్‌మిల్స్ బట్ట లు ఆరేసుకోవటానికే.
'కులాసా'నా అంటే, ఏదో మీ దయ!
కాస్తంత అలసట చోటు చేసుకోవటం మామూలే. అయితే అశ్రద్ధ చేయరాదు. ఎవరైనా కనిపిస్తే ముందుగా అడిగే 'కులాసా'నా? అంటే ఏదో వున్నానులే! మీ దయ అంటూ ఆవులిస్తూ సమాధాన మిస్తారు. కొందరు అలసిపోతే ఏ పనీ చేయ లేరు. మరికొందరు బరువు పెగుతాయని, లావైపోతామని తినడం బాగా తగ్గిస్తారు. దీనితోనీరసం, అనీమియాకు దారి తీస్తుంది. రోజు వ్యాయామం లేకపోతే ఊబకాయం దాపురిస్తుంది. క్రమేణా గుండె జబ్బులు చోటు చేసుకుంటాయి.
ఆఫీసునుంచి వచ్చి, కాస్త చపాతీనో, అల్పాహారం తీసుకున్న తర్వాత పుస్తకం తీసుకొని నడుం వాలిస్తే నిద్రదేవి ఒడిలో జోగు తారు. ఇక ఆదివారం వస్తే షాపింగ్‌కి కూడా వెళ్ల బుద్ధి కాదు. బైట ఎగ్జిబిషన్లు, షోలు ఎన్ని జరిగినా ఆదివారం అంటే ఇంట్లో 'రెస్ట్' తీసుకోవాల్సిందే. పిల్లల తల్లులు, వారిని స్కూలుకి పంపి పనిమనిషి చేత పనులు చేయించినా ఓపిక ఉండటంలేదు.
ఎందుకు వస్తుంది .
మనిషి శరీరానికి ఏర్పడే పలురకాల ఇబ్బందులను సరిదిద్దే వ్యవస్థ అంతర్గతం గా ఉంటుంది . అయితె మనుషులు తమ అలవాట్లతో ఆ వ్యవస్థను తమకు తాముగా దెబ్బతీస్తున్నారు . శరీరానికి అవసరమైన శక్తిని సక్రమముగా అందించకపోవడం తొలి పొరపాటు . ఈ కింద కొన్ని పొరపాట్లు అలసటకు దారితీస్తుంది .
వేళకు భోజనం చేయకపోవడం ,
వేళకాని వేళలో భోజనం చేయడం ,
పోషక పదార్ధాలు అందించకపోవడం ,
చీటికి మాటికీ వైద్యసలహా లేకుండా మందులు మింగడం ,
తగినంత నిద్ర పోకపోవడం ,
మత్తుపానీయాలు అతిగా సేవించడం ,
సరిగా వ్యాయామము చేయకఫోవడం ,
‘అబ్బ ఎంత అలిసిపోయాను. ఎంత పని చేశాను. కానీ శారీర కంగా బాగానే వున్నా ను’ అని అనుకున్న రోజులు దాదాపుగా వుండవు. 30 నిమిషాల్లో తేల్చవలసిన బ్యాలెన్స్ షీటును చక్క బెట్టడానికి కనీసం ఓ గంట సేపు పడుతున్న సందర్భాలు ఎదుర వుతాయి. అప్పుడప్పుడు సులువైన పనులే పెద్ద బ్రహ్మాండాలై కూర్చుంటుంటాయి..! ఇదే గనుకే అస్తమానం రిపీట్ అయితే ‘క్రానీక్ ఫెటీగ్ సిన్డ్రోమ్’ అనే మానసిక వ్యాధికి దారి తీస్తాయని ముంబై కి చెందిన మనోరోగ నిపుణురాలు పారుల్ అగర్వాల్ అంటున్నారు. ఆదరాబాదరా హడావిడి జీవితం పుణ్యమా... అని చాలా మంది అలసట వల్ల ప్రభావితులవుతున్నారు. పోటీ వల్ల కష్టపడి పనిచేస్తున్నారు, ఫలితంగా అలసిపోయి రోజువారీ పనులే ఎంతో భారం అనిపిస్తాయి అని వివరిస్తోంది.
అలసట లక్షణాలు... :
త్వరగా సులువుగా పూర్తిచేసే పనులు చేయడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తారు. తరచూ మానసికంగా తలుపులు మూసుకుపోతాయి. ప్రతిదీ ఒక పని అనిపిస్తుంది. ఏదీ ఆహ్లాదాన్నివ్వదు.మరిచిపోతుంటారు, మనసు దిగులుగా విషాదంగా ఉంటుంది, ఎప్పుడూ కీళ్ళ నొప్పులు ఒంటినొప్పి నిద్రలేనితనం ఉంటాయి, ఉదయాన్నే నిద్రలేచి మీపనులు మీరు చేసుకోలే పోతారు, థైరాయిడ్‌లోపం గానీ ,విటమిన్ బి12 కొరవడడం వల్ల కూడా అలసట తలెత్తుతుంది. ఏవైనా లోపాలుంటే పసిగట్టడం కోసం సమగ్ర ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం మంచిది.
ఎదుర్కొనే మార్గాలు... :
అలసటను ఎదుర్కొనే వ్యూహాలను అల వరుచుకుని ప్రతి సందర్భాన్నీ వాస్తవ దృష్టితో పరిశీలించాలి. అందు లో హేతుబద్ధంగా కూడా ఆలోచించాలి అని అగర్వాల్ సలహా ఇస్తున్నా రు. సానుకూలంగా ఆలోచించడం ప్రారంభిస్తే దీర్ఘకాలికంగా పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కొంటారు. తాత్కాలికం అని భావిస్తే ఈ పరిస్థితిని అలక్ష్యం చేయరాదు. అలా చేసినట్లయితే పరిస్థితి చేయిదాటిపోయి మానసిక, శారీరక సమస్యలకు దారితీయవచ్చు అని డా.ఆహుజా అంటున్నారు. కోల్పోయిన జవసత్వాలను తిరిగి పొందడానికి ఆమె జీవన శైలిలో తీసుకురావలసిన కొన్ని మార్పులను సూచిస్తున్నారు.
ఇలా చేయొచ్చు... :
రోజువారీ పనీబాటను పక్కన పెట్టాలి. భౌతికమయిన కార్యకలాపాలు చేపట్టాలి. టెలివిజన్ చూడడం, ఇంటర్నెట్ బ్రౌసింగ్, చదవడం కాసేపు మర్చిపోవాలి. కాస్త దూరం నడవడం, ఈత కొట్టడం, లేదా ఓపిక వుంటే పరిగెత్తడం వంటివి చేయాలి. తాజా గాలి, సూర్యకాంతి అద్భుతంగా పనిచేస్తాయి. ఉత్సాహానిస్తాయి.సత్వరం శక్తినిస్తాయి.
ఏదో ఒక వ్యాపకం... :
ప్రతివారం ఇష్టమైన పనుల కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. వంటచేయడం, ఫోటోగ్రఫీ శిల్పకళ వంటివి ఇంతకు పూర్వం చేయనివి చేస్తే కాస్త కొత్తగా వుంటుంది. ఆసక్తి కూడా కలుగుతుంది.రోజువారీ జీవితం నుంచి విముక్తి లభిస్తుంది, మనసుకు ఆనందోల్లాసాలు కలుగుతాయి.
ఆదమరిచి నిద్రపోవాలి... :
నిద్రలేమి మతిమరుపుకు దారితీస్తుంది. ఆందోళనను తీవ్రం చేస్తుంది. కనుక కంప్యూటర్, ఫోన్, టెలివిజన్ అన్నీ కట్టేసి నిద్రలోకి జారుకోవాలి. సువాసన కలిగించే మల్లె తైలం స్నానాల తొట్టిలో వేసుకుని స్నానం చేస్తే ఎంతో సాంత్వన లభించినట్లు వుంటుంది. లేదా తైలాన్ని కణతలకు గానీ పాదాలకుగానీ రాసుకున్నా ఎంతో హాయిగా వుంటుంది.
సెలవులు దినాల్లో... :
తీవ్రమైన అలసటకు సెలవు దినాల్లో ఆనందంగా గడపటం అన్నిటి కంటే మంచి చికిత్స. సంవత్సరాని కొకసారి సెలవులు తీసుకుని ఆనందంగా గడపటం. ఇలా చేయడం వల్ల మనసు, శరీరానికి కొత్త శక్తి లభిస్తుంది. మీ స్నేహితులు, కుటుం బసభ్యులు లేక భాగస్వామితో కలిసి వెళ్ళి కొత్త ప్రదేశాన్ని సందర్శించినా బాగుంటుంది. వారాంతపు పిక్నిక్కులు కూడా అలసట నుంచి ఊరటనిస్తాయి.
మరికొన్ని చిట్కాలు... :
దిగులుతో కూడుకున్నదైతే తప్ప అలసటకు మందులు వాడవలసిన అవసరం లేదు. కొంత సమయం కేటాయించి ఇష్టమైనవి చేయడంలో గడిపితే సరిపోతుంది. నూతనోత్సాహం ఉరకలువేస్తుంది.
కొన్ని అంతర్గత వ్యాధుల వల్ల కూడా అలసట రావచ్చును . తగిన జాగ్రత్తలు తీసుకున్నా వేధిస్తున్న అలసట ఉంటే వైద్యసలహా ... వైద్య తనికీలు చేసుకోవాలి .
Chronic fatigue, which is fatigue of six months or more duration, is a symptom of a large number of different diseases or conditions. Some major categories of diseases that feature fatigue include:
* Autoimmune diseases such as celiac disease, multiple sclerosis, and spondyloarthropathy
* Blood disorders such as anemia and hemochromatosis
* Cancer
* Chronic fatigue syndrome (CFS)
* Drug abuse
* Depression and other mental disorders that feature depressed mood
* Eating disorders, which can produce fatigue due to inadequate nutrition
* Endocrine disease like diabetes mellitus and hypothyroidism
* Fibromyalgia
* Heart disease
* Infectious diseases such as infectious mononucleosis and influenza
* Leukemia or lymphoma
* Neurological disorders such as Parkinson's disease and post-concussion syndrome
* Physical trauma and other pain-causing conditions, such as arthritis
* Sleep deprivation or sleep disorders
* Uremia
* Hepatic failure
causes for Fatigue or Exhaustion ,అలసటకు కారణాలు
ఉన్నట్టుండి అలసిపోతున్నారా? అయితే అలా జరగడంలో ఈ కారణాలు ఉన్నాయేమో పరిశీలించుకోండి.
*ఎక్కువ సేపున నీళ్లు తీసుకోకపోతే డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. దానివల్ల ఏకాగ్రత తగ్గి.. అలసటగా అనిపిస్తుంది. కాబట్టి అలాంటప్పుడు ఒకటి రెండు గ్లాసుల మంచినీళ్లు తాగమని చెబుతున్నారు నిపుణులు.
*సెల్‌ఫోన్లు కూడా అలసటకు కారణమే అని అధ్యయనాలు చెబుతున్నాయి. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ పోల్ ప్రకారం ఇరవై శాతం మంది ఫోను, ఎస్సెమ్మెస్‌వల్ల నిద్రలేస్తారు. సెల్ పక్కన ఉండటం వల్ల అది నిద్రపై ప్రభావం చూపుతుంది. స్లీప్ హార్మోన్‌గా పరిగణించే మెలటోనిన్‌పై ప్రభావం చూపుతుంది. దాంతో నిద్రసరిగ్గా పట్టక మర్నాడు అలసటగా అనిపిస్తుంది. అందుకే పడుకునేప్పుడు దానిని పక్కన ఉంచకపోవడమే మంచిది.
* వ్యాయామం వల్ల ఒత్తిడి హార్మోను కార్టిజాల్ అదుపులో ఉంటుందనేది వాస్తవమే. అయితే అవసరానికి మించి వ్యాయామం వేగంగా చేయడం వల్ల అది మళ్లీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వ్యాయామం చేస్తున్నప్పుడూ విరామం ఉండాలి.
* ఇనుము లోపం వల్ల త్వరగా అలసట వస్తుంది. రోజుకు మోతాదు ప్రకారం ఇనుము అందకపోతే అది రక్తహీనతకు దారితీస్తుంది. క్రమంగా అలసట ఎదురవుతుంది. అందుకే ఇనుము ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి
అలసటకు కారణం...హార్మోన్ల లోపమా?
మనకి శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలన్నీ అరోగ్యానికి చెందినవి కాకపోవచ్చు. శరీరంలో కొన్ని లోపాలని మనకు తెలియజేయాలి అన్నట్లు కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాలు అకారణంగా ఉన్నా, చాలాకాలంగా బాధిస్తున్నా, వీటితోపాటు ఇతరత్రా ఆరోగ్య సమస్యలు బాధిస్తున్నా, ఈ లక్షణాలవల్ల దైనందిన జీవితం కష్టమవుతున్నా వెంటనే వైద్యుల సలహా తీసుకోవలసిన అవసరం ఉంది. ఉదాహరణకి అలసట అనేది ఎక్కువగా పనిచేస్తే రావచ్చు. ఒత్తిడివల్ల రావచ్చు. ఈ లక్షణాలు తగ్గకుండా ఉంటే మనం తప్పకుండా వైద్యుడికి చూపించుకోవాలి. కొన్ని మనకి సాధారణ లక్షణాలుగా కనిపిస్తాయి గానీ వాటికి, ‘ఎండ్రోక్రైన్’ వ్యవస్థకి సంబంధించిన కారణాలకి సంబంధం ఉండవచ్చు.
అలసట-శక్తిహీనత: మనందరికీ ఒక రోజు కాకపోతే మరొక రోజు అలసట, నిస్సత్తువ లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇవి కారణం లేకుండా కనిపిస్తే వాటికి ఎండోక్రైన్ వ్యవస్థలోపం కారణం కావచ్చు. హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం కావచ్చు, హైపర్ కాల్షిమియా అదుపులో లేని డయాబెటిస్, హైపోగొనడిజం, హైపోపిట్యూటిజం, హైపోఎడ్రినలిజం. కుషింగ్స్ సిండ్రోమ్, విటమిన్-డి లోపం లాంటివి కారణాలుకావచ్చు. హైపర్ థైరాయిడిజం, ఫ్రియోక్రోమోసైటోమా లాంటి హార్మోన్ సమస్యల వలన కలిగే ఇబ్బందులవల్ల ఆదుర్దా, చెమటలు పట్టడం, పొట్టలో నొప్పి, తలనొప్పి, బరువు తగ్గడం, గుండెదడ లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

0 Comments