ఎక్కువ కాలిన యెడల వెంటనే ఆస్పత్రికి తరలించవలెను. ఆలోగా నోటికి ఎట్టి ద్రవపదార్థమును ఇవ్వకూడదు. ఎందుకనగా ఆస్పత్రిలో అతనికి మత్తుమందు ఇవ్వలసియుండును. నాలుగు గంటల వరకు వైద్య సదుపాయం దొరకదని తెలిసిన ఎడల ఒక గ్లాసెడు నీళ్ళలో టీ స్పూనులో 4వ వంతు ఉప్పు కలిపి ఇవ్వవచ్చును. వంటసోడా దొరికితే దానిని నీటిలో కలిపి ఇవ్వవచ్చును.
కొద్దిగా కాలిన ఎడల వేడి ద్రవము నియ్యవచ్చును. పలుచని టీలో కొంత చక్కెర యివ్వవచ్చును.
0 Comments