Full Style

>

Hints to prevent eye strain during reading,చదువుకొనేటప్పుడు కళ్లు అలసిపోకుండా జాగ్రత్తలు



-Hints to prevent eye strain during reading,చదువుకొనేటప్పుడు కళ్లు అలసిపోకుండా జాగ్రత్తలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



చదువులూ, పోటీ పరీక్షలు అంటూ విద్యార్ధులు పుస్తకాలు ముందేసుకొని కూర్చుంటారు. మరి దీని వల్ల కళ్లు అలసిపోవడం, తలనొప్పి, కంటి సమస్యలు తలెత్తుతాయి. అలా జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

గదిలో లైటు కాంతి కాగితం మీద పడకుండా చూసుకోవాలి. దానికి కాస్త దూరంగానే కూర్చోవాలి.

పగటి పూట చదువుకొనేటప్పుడు కిటికీలకూ దూరంగా కూర్చోవాలి. కిటికీ అద్దాల వెలుతురు కళ్ల మీద పడకుండా చూసుకోవాలి. అది కళ్లకు హాని చేస్తుంది.
చదువుకొనేటప్పుడు తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి.

ఆరుబయట నడుస్తూ చదువుకొనే అలవాటు కొందరికి ఉంటుంది. కానీ సూర్యకిరణాల ప్రభావం వల్ల కళ్లు త్వరగా అలసిపోతాయి. దానికి బదులు నీడలో చదవడం మంచిది.

పడుకొని చదువుతుంటారు. దీని వల్ల కళ్లు లాగేస్తుంటాయి. అందుకే కుర్చీలో కూర్చుని, లేదా గోడకు ఆనుకొని చదువుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెడ కూడా నొప్పి కూడా రాదు. ఏకాగ్రత కుదురుతుంది.

చల్లటి నీళ్లూ, ఒక మెత్తటి వస్త్రం పక్కన పెట్టుకోవాలి. కళ్లు మంటగా అనిపించిన ప్రతిసారీ ఆ వస్త్రాన్ని నీళ్లలో ముంచి కళ్ల మీద పెట్టుకోవాలి. ఫలితంగా కళ్లు వాయకుండా ఉంటాయి. చల్లదనం వల్ల నరాలకు సాంత్వన కలుగుతుంది. అలసట దూరమవుతుంది.

రోజుకు పదహారు గంటలు చదివే వాళ్లు వైద్యుల సలహా మేరకు అద్దాలు వాడాలి. 

Post a Comment

0 Comments