సన్నబడేందుకు సూచనలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ఈ క్రింది సూచన్లు సన్నబడేందుకు సహకరిస్తాయి .
సన్నబడేందుకు ఆహారంలో చేసుకునే మార్పులతో పాటూ రకరకాల వ్యాయామ పద్ధతుల్నీ మనం ఎంచుకుంటాం. కానీ ఎప్పుడూ ఒకే తరహా వ్యాయామాలూ, యోగాసనాలూ అంటే విసుగు రావడం సహజం. అలాగని వాటిని చేయకుండా ఉండటమూ సబబు కాదు. అందుకే కొన్ని రోజులు డాన్స్ చేసి చూడండి. ఆనందంగానూ ఉంటుంది. వ్యాయామమూ అందుతుంది. చాలామంది మహిళలకు నడుమూ, పిరుదుల భాగాల్లో చేరిన కొవ్వు కరిగించడం ఓ సమస్యగా మారుతుంది. ఇలాంటి వారు నడుముని గుండ్రంగా తిప్పుతూ బెల్లీ డాన్స్ చేయడంతో సన్నబడొచ్చు. దీనివల్ల నడుము కింది భాగం తీరైన ఆకృతిలోకి వస్తుంది. రోజులో ఓ గంట బెల్లీ డాన్స్ చేయడం వల్ల 250 నుంచి 300 కెలొరీలు ఖర్చవుతాయి. ఒక్కరే డాన్స్ క్లాసుకి వెళ్లడం విసుగు అనుకునే వారు, జంటగా సల్సా చేయొచ్చు. దీనివల్ల సన్నబడటం ఒక్కటే కాదు... భార్యాభర్తల మధ్య అనుబంధమూ పెరుగుతుంది. గంటసేపు సల్సా చేస్తే చాలు.. దాదాపు ఐదొందల కెలొరీల ఖర్చవుతాయి. ఇక తక్కువ సమయంలోనే సన్నబడాలి అనుకునే వారు హిప్‌హాప్‌ని ఎన్నుకోవాలి. ఇది చేయడానికి కొద్దిగా శక్తి అవసరమే. కానీ ఏకాగ్రతగా గంటసేపు చేస్తే ఫలితం ఉంటుంది. అయితే ఏ డాన్స్‌ని ఎంచుకుని, ఎన్ని రోజులు శిక్షణ తరగతులకి వెళ్లాలి అనేది డాక్టర్ సలహా ప్రకారం చేయాలి.

0 Comments