Full Style

>

అధిక బరువు వాస్తవాలు అలవాట్లు ,అధిక బరువు, ఊబకాయం, ఒబెసిటి, స్థూలకాయం, Over weight and Diet habits -2


---------పాలు తాగితే బరువు తగ్గుతా0 :
పాలు తాగితే బలం వస్తుందని తెలుసు కానీ.. బరువు తగ్గుతామని తెల్సా...? అవును అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ వారు రెండేళ్ల పాటు పాలు తాగిన వారిపై జరిపిన పరిశోధనలో ఈ నిజాలు వెల్లడించారు.

ఇజ్రాయిల్‌లోని బెన్-గురియాన్ కళాశాలకు చెందిన డానిత్ షహార్ నేతృత్వంలో నిర్వహించిన ఓ పరిశోధనలో ప్రతిరోజు రెండు గ్లాసుల పాలు తాగిన వారు ఆరు నెలల వ్యవధిలో అధిక మోతాదులో డి-విటమిన్‌ను పొందగలిగినట్లు గుర్తించారు.

ఈ పరిశోధనలో భాగంగా 40 నుంచి 65 ఏళ్ల వయస్సు గల 300లకు పైగా స్త్రీ, పురుషులపై రండేళ్ల పాటు జరిపిన పరిశోధనలో ఈ విషయాలను వెల్లడించారు. ప్రతి రోజు పాలు తాగే వారు, పాలు తాగని వారితో పోలిస్తే సగటున ఆరు కిలోల బరువు తగ్గినట్లు వారు తెలిపారు.


పాల పదార్థాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. ప్రతి రోజు అధిక కాల్షియం ఉండే డైరీ పదార్థాలను తీసుకున్న వారు రెండేళ్ల తర్వాత సగటున ఆరు కిలోల బరువు తగ్గగా.. తక్కువ కాల్షియం ఉండే డైరీ పదార్థాలను తీసుకున్న వారు రెండేళ్ల తర్వాత సగటున 3.5 కిలో బరువు తగ్గినట్లు వారు గుర్తించారు.

సాధారణంగా రోజుకు రెండు గ్లాసుల పాలను తీసుకోవడం వల్ల శరీరానికి 583 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుంది. కాల్షియం వల్ల శరీరానికి విటమిన్-డి అందుతుంది. అంతేకాకుండా శరీరంలో విటమిన్-డి స్థాయి స్వతంత్రంగా బరువు తగ్గడానికి ఉపయయోగపడుతుంది.

పాలు, పాల ఉత్పత్తులు విటమిన్-డిను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తమ పరిశోధనలో వెల్లడైందని వారు తెలిపారు. సాధారణంగా ఒక రోజులో శరీరానికి 400 అంతర్జాతీయ యూనిట్స్(ఐయూ) విటమిన్-డి అవసరం అవుతుంది. అంటే దాదాపు నాలుగు గ్లాసుల "లో-ఫ్యాట్ మిల్క్" అన్నమాట.

కాబట్టి బరువు తగ్గడానికి బరువైన పనులు(ఎక్సర్‌ సైజులు)చేయడం మాని, ఎంచక్కా రెండు గ్లాసులు పాలు తాగితే చాలని వారు సూచిస్తున్నారు.

అధిక బరువు చాలామందిని వేధించే సమస్య. 'అలాంటివారు ఈ ఎనిమిది సూత్రాలూ పాటించండి, శ్రమలేకుండానే బరువు తగ్గిపోతారు' అంటున్నారు బ్రిటిష్‌ పోషకాహార నిపుణులు. (source : Dr. Ramakanth - Nutritionist , Vizag)

* బరువు తగ్గాలనుకునేవారు వారానికి ఒకరోజు అన్నిపూటలూ భోజనానికి బదులుగా కూరగాయలూ ఆకుకూరల సలాడ్‌ తీసుకుంటే ఫలితం ఉంటుంది. అంతేకాదు, ఆ పోషకాలూ విటమిన్లతో చర్మానికి నిగారింపూ పెరుగుతుంది.
* తగిన చోటు, సమయం చూసుకొని కూర్చొనే భోంచేయాలి. దాంతో ఆహారాన్ని బాగా నములుతారు. ఫలితంగా త్వరగా జీర్ణమవుతుంది.
* సాధ్యమైనంత చిన్నసైజు ప్లేటులో భోంచేస్తే మీకు తెలియకుండానే పూటకు కనీసం 250 క్యాలరీలైనా తగ్గించి తింటారు.
* నిద్రలేచిన గంటలోపే బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తిచేయడం మంచిది. ఆలస్యంగా తినడంవల్ల రెండు భోజనాల మధ్య సమయం తగ్గి కొవ్వు పెరుగుతుంది.
* రోజూ పాల ఉత్పత్తులు ఎంతోకొంత పరిమాణంలో తీసుకోవాలి. వీటిలోని కాల్షియం కొవ్వుని కొంతమేరకు తగ్గించగలదు.
* వ్యాయామం చేసిన తర్వాత 30-60 నిమిషాల లోపు భోంచేయడం మేలు. కొత్తగా చేరే క్యాలరీలను శరీరం అలసిపోయినపుడు వెంటనే ఉపయోగించుకుంటుంది.
* భోజనానికి ముందు నారింజలాంటి నిమ్మజాతి పండు సగం తింటే బరువు తగ్గుతారని ఓ పరిశోధన.
* వారంలో మూడు రోజులు గుడ్లు, ఒకపూట చేప తినడం కూడా బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
అధిక బరువును తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నా.. అవగాహనాలేమితో చేసే పొరబాట్లతో మరింత బరువు పెరుగుతాం. వాస్తవాలు తెలుసుకుని సరైన నియమాలు పాటించగలగాలి.

అల్పాహారం మానేస్తే సన్నగా మారిపోవడం చాలా సులువనుకుంటారు కొందరు. కానీ ప్రతిరోజూ అల్పాహారం తీసుకునేవారు త్వరగా చిక్కుతారని చెబుతోందో అధ్యయనం. అల్పాహారం తీసుకోవడం వల్ల మిగిలిన రోజులో ఆకలి తక్కువ కలుగుతుంది. దాంతో ఆహారాన్ని మితంగా తీసుకుంటాం. రోజంతా చురుగ్గానూ ఉండటం వల్ల శరీరానికీ వ్యాయామం అందుతుంది. జీవక్రియ ఆరోగ్యంగా మారుతుంది. ఇవన్నీ సన్నగా మారేలా చేస్తాయి. అయితే పోషకమిళితమైన పదార్థాలను ఎంచుకుంటేనే ఆ లాభాల్ని పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు.

బరువు పెరగడమనేది కుటుంబచరిత్రలోనే ఉందని తేలిగ్గా తీసుకుంటారు కొందరు. కానీ మనసు పెడితే సన్నగా మారడం మీ చేతుల్లోనే ఉందని గ్రహించాలి. తీసుకునే కెలొరీలను గమనించుకుంటూ.. వాటిని ఖర్చుచేసేందుకు సరైన వ్యాయామం చేయాలి. శరీరానికి శక్తినందిస్తూ.. అదేసమయంలో తక్కువ కెలొరీలనిచ్చే పదార్థాలను తీసుకోవడం కూడా సులువుగా బరువు తగ్గగలుగుతాం.

అతి ఎప్పుడూ అనర్థమే అవుతుంది. సన్నగా మారే క్రమంలో మితిమీరి పాటించే కొన్ని నియమాల వల్ల లాభం కన్నా ఇతర సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సమతులాహారానికి ప్రాధాన్యం ఇస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. అతిగా వ్యాయామం చేయడం కూడా సరికాదు. రోజులో ఓ గంటన్నరకు మించి వ్యాయామం చేయకూడదు.

కొన్ని రకాల ప్రత్యేకమైన పదార్థాలు బరువును తగ్గించేలా చేస్తాయి. మిల్క్‌షేక్‌లు, చాక్లెట్లు, శరీరంలో కొవ్వును పెంచే సూప్‌లకు బదులుగా క్యాబేజీ సూప్‌డైట్‌, గ్రేప్‌ ఫ్రూట్‌డైట్‌ వంటి వాటిని ఎంచుకోవచ్చు. కానీ ఇలాంటి వాటిని ఎక్కువకాలం కొనసాగించలేం. ఖరీదెక్కువ కావడం, కోరుకున్న రుచినివ్వకపోవడం వంటి కారణాలతో ఇతర పదార్థాలనూ తీసుకోవడం మొదలుపెడతాం. అందుకే శరీరారనికి అవసరమైన పోషకాలందించే ఆహారాన్ని తీసుకుంటూనే మెరుపుతీగలా మారాలి.



బరువు తగ్గాలనుకునేవారు ముందుగా వేళపట్టున భోంచేయాలి. ప్రతి రెండుగంటలకోసారి కొద్దికొద్దిగా తినాలి. వేళపట్టున నిద్రపోవడం వల్ల కూడా స్థూలకాయం బాధించదని ఓ అధ్యయనం పేర్కొంటోంది. కాబట్టి రాత్రిళ్లు త్వరగా భోంచేసి రెండు గంటల తరవాత నిద్రపోవడాన్ని ఓ అలవాటుగా మార్చుకోవాలి.

ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తినడం ఆరోగ్యానికి మంచిది. త్వరగా జీర్ణమవుతాయి. అధిక కొవ్వు నిల్వలు పేరుకోవు. బాగా నమిలి తినడం, మంచినీళ్లు ఎక్కువగా తాగడం, మిఠాయిలను మితంగా తినడం వంటి జాగ్రత్తలను పాటించడం ఎంతయినా మంచిది.



Post a Comment

0 Comments