ఛాతీమంట పంటికి నష్టము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ఛాతీమంట పంటికి నష్టము , Reflux Acidity bad to teeth
చాలాకాలంగా ఛాతీమంటతో బాధపడుతున్నవారి ఆహారనాళానికే కాదు. దంతాలకూ ముప్పు తేగలదు . గొంతులోకి పుల్లటి త్రేన్పులు ఎగదన్నుకు రావటంతో ఛాతీమంటకు కారణమయ్యే గ్యాస్ట్రోఈసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) మూలంగా పళ్లూ తీవ్రంగా దెబ్బతింటున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది . వీరిలో నోట్లోకి చేరుకునే యాసిడ్ వల్ల పళ్లు పలుచగా, వాడిగా అవటంతో పాటు వాటిపై చిన్న చిన్న రంధ్రాలూ పడుతున్నట్టు టెన్నెసీ హెల్త్ సైన్స్ సెంటర్ విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో బయటపడింది. రిఫ్లక్స్ డిసీజ్ గలవారిలో యాసిడ్‌తో పాటు జీర్ణాశయంలోని పదార్థాలు ఆహారనాళంలోకి ఎగదన్నుకు వస్తుంటాయి. చాలాసార్లు ఇవి నోట్లోకీ చేరుకుంటాయి. ఇందులోని యాసిడ్ దంతాల పైపొరపై దాడి చేయటం వల్ల పన్ను దెబ్బతినటానికి దారితీస్తోంది.
0 Comments