Full Style

>

క్లోమ గ్రంథి వ్యాధి,పేంక్రియాటిక్‌ గ్రంథి వాపు,ప్యాంక్రియాటైటిస్‌,Pancreatitis



Pancreatitis-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


క్లోమ గ్రంథికి వచ్చే వ్యాధుల్లో ఎక్యూట్‌ ప్యాంక్రియాటైటిస్‌ ఒకటి. వ్యాధిలో పేంక్రియాస్‌ తనలోని ఎంజైమ్‌తోనే జీర్ణించబడుతుంది. కానీ చాలా కేసుల్లో తర్వాత పేంక్రియాస్‌ మాములు పరిస్థితిలోకి వచ్చేస్తుంది. ఈ వ్యాధి ఎందు కొస్తుంది, కారణాలు, లక్షణాలు, నివారణ, చికిత్స గురించి తెలుసుకుందాం..

కారణాలు
పేంక్రియాటిక్‌ గ్రంథి వాపుతో సమస్య మొదలవుతుంది. కొన్ని కేసులలో ఈ గ్రంధి క్షీణించి రక్తస్రావంతో కూడుకొని వుంటుంది.
పిత్తాశయంలో రాళ్లు.
అతిగా మద్యం తాగడం.
కడుపుకు దెబ్బతగలడం వల్ల.
ఆపరేషన్‌ జరిగిన తర్వాత.
ట్రైగ్లిసరైడ్సు ఎక్కువవడంవల్ల.
కాల్షియం ఎక్కువ వుండడం వల్ల.
కిడ్నిఫెయిల్యూర్‌.
వంశ పారంపర్యంగా కొందరిలో.
ఇన్‌ఫెక్షన్లవల్ల .
పేగులలో పాములవల్ల.
కొన్ని మందులవల్ల. సంతాన నిరోధక బిళ్ళల వల్ల. సల్ఫా మందులు వాడడం వల్ల. .
పెప్టిక్‌ అల్సర్‌ పేంక్రియాస్‌లో చొచ్చుకుపోవడంవల్ల కలుగుతుంది.

లక్షణాలు
కడుపులో తీవ్రమైన భరించలేని నొప్పి. వెల్లెకిలా పడుకొన్నప్పుడు నొప్పి ఎక్కువవడం. మద్యం సేవించిన 12 గంటలలోపే నొప్పిరావడం. కడుపునిండా భోంచేసిన తర్వాత వాంతులు. కడుపు ఉబ్బరించడం. విపరీతంగా చెమటలు పోయడం. రోగి షాక్‌లో వెళ్ళడం. పచ్చకామెర్లు కనిపించడం. కడుపునొక్కితే విపరీతమైన నొప్పి, కడుపు గట్టిగా వుండడం. చేతితో పరీక్షచేస్తే కడుపు వుండకట్టినట్టు తెలియడం. బొడ్డుచుట్టూ లేత నీలంరంగు కన్పించడం.

నిర్ధారణ
సీరం అమైలేజ్‌ మామూలు కన్నమూడురెట్లు ఎక్కు వగా వుంటుంది. తెల్లరక్త కణాల సంఖ్య పెరగడం. రక్తంలో గ్లూకోజ్‌ ఎక్కువగా వుంటుంది. సాధారణ కడుపు ఎక్సరే. సిటీ స్కానింగ్‌. ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌. బేరియం ఎక్సరే లో ఈ వ్యాధిని నిర్ధారించొచ్చు.

నివారణ
పూర్తి విశ్రాంతి అవసరం.. జీర్ణాశయంలోని ద్రవాలను నాసల్‌ ట్యూబ్‌ ద్వారా బయటికి లాగాలి. ఇంజెక్షన్‌ పెథిడిన్‌ 100 మిల్లీ గ్రాములు అవసరాన్ని బట్టి ఇవ్వాలి. తాగడానికి, తినడానికి ఏమి ఇవ్వకూడదు. నరానికి గ్లూకోజ్‌ పెట్టాలి. షాక్‌కు తగిన చికిత్స చేయాలి. కాల్షియం 'ప్రోజన్‌ ప్లాస్మా' 'రక్తం' ఎక్కించాలి. రక్తంలో షుగర్‌ ఎక్కువుంటే ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ ఇవ్వాలి. 'సిమిటెడిన్‌', లేదా 'రానిటడిన్‌' ఇవ్వాలి. ఇన్‌ఫెక్షన్‌కు యాంటి బయాటిక్స్‌ వాడాలి. నాలుగు నుండి ఆరు రోజుల తర్వాత పేషెంట్‌ పరిస్థితి చూసి ద్రవపదార్థాలు ఇవ్వాలి. కొవ్వు పదార్థాలు తగ్గించాలి. పిత్తాశయంలో రాళ్లు వుంటే పాపిల్లాటమి ద్వారా తీసెయ్యాలి. మద్యపానం పూర్తిగా మానాలి.

ఇతర సమస్యలు
షాక్‌, పేగుల కదలిక లేకపోవడం గుండె ఊపిరి తిత్తుల సమస్యలు రావడం, డియోడినమ్‌ పసరతిత్తి నాళంలో అవరోధం ఏర్పడుతుంది. జీర్ణాశయంలో రక్తస్రావమవుతుంది. క్లోమగ్రంథిలో చీము చేరుతుంది. ఉదరంలో, ఊపిరితిత్తుల పొరలలో నీరు చేరుతుంది. అవసరాన్ని బట్టి ఆక్సిజన్‌ ఇవ్వాలి. స్టేరాయిడ్స్‌ అవసరమైతే వాడాలి. 100 రోజుల తర్వాత సిటీస్కాన్‌, ఆల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేసి పాంక్రియాటైటిస్‌ ఎంత తగ్గిందో తెలుసుకోవాలి. ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా తగ్గేవరకు విశ్రాంతి అవసరం. యాంటిబయోటిక్స్‌ వాడాలి. మాంసకృత్తుల ఆహారం ఎక్కువగా ఇవ్వాలి. పాంక్రియాటిక్‌ వాపు నొప్పి తగ్గకుంటే లాప రాటమి ఆపరేషన్‌ తప్పక చేయాలి.

Post a Comment

0 Comments