Full Style

>

Paralysis and physiotherapy importence-పక్షవాతం ఫిజియోథెరపీ ప్రాముఖ్యత



పక్షవాతం ఫిజియోథెరపీ ప్రాముఖ్యత- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


వైద్య రంగంలో ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ప్రస్తుత యాంత్రిక జీవనంలో ఎన్నో రకాల రుగ్మతలు మనిషి జీవిత కాలాన్ని నాణ్యతను నిర్ధేశించడమే కాకుండా మరణానికి కూడాకారణం అవుతున్నాయి. ఇలాంటి ముఖ్య కారణాలలో పక్షవాతం అనేది మూడవ ముఖ్య కారణంగా(మొదటి కారణం క్యాన్సర్‌, రెండో కారణం హార్ట్‌ ఎటాక్‌ ) నిలుస్తుంది. సరైన సమయంలో అత్యాధునికమైన వైద్య సదుపాయాలు అందజేయడం చేత పక్షవాతం వల్ల వచ్చే మృత్యువును చాలా వరకు అరికట్టవచ్చు. అయితే జీవిత కాలాన్ని పెంపొందించినప్పటికి శరీరంలో ఒక భాగం చచ్చుబడి పోవడంతో బాత్‌రూమ్‌కి వెళ్లడం, కూర్చుని తినడం, బట్టలు వేసుకోగలగడం వంటి కనీస అవసరాలు తీర్చుకోవడం కోసం కూడా ఇతరుల మీద ఆధారపడతారు. ఇలా మంచం మీదపడి ఇతరులతో సేవలు చేయించుకుంటున్నందున వీరు చాలామానసిక ఆవేదనకు గురిఅవుతారు.

పక్షవాతానికి నేడు ఎంతో ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. అయితే శరీరంలోని నరాలపై ప్రభావం చూపించే పక్షవాతానికి అందుబాటులోకి వచ్చిన వైద్యవిధానం, ఆధునిక చికిత్స చేయించడంతో పాటు కండరాల కదలికకోసం వ్యాయామం అనేది చాలా అవసరం. అయితే నిశ్చలంగా , నిరాశగా ఉన్న రోగులు తిరిగి లేచి ఎవరి మీద ఆధారపడకుండా వారి పనులు వాళ్లు స్వయంగా చేసుకొనేవిధంగా ఎలాంటి వ్యాయామం చేయాలన్న అవగాహన చాలా మందిలో ఉండదు. వీలైనంతవరకు అవిటితనాన్ని తగ్గించడానికి మళ్లి వారికి జీవనంలో నూతన ఉత్సాహం తీసుకురావడానికి ఫిజియోథెరపీ (వ్యాయమం) చికిత్స చేయించడం అత్యవసరం. ఫిజియోథెరపీ చికిత్స చేయించుకోవడం చేత డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు రోగులుఎవరి సహాయం లేకుండానే, ఎవ్వరిపై ఆధారపడకుండానే సొంతంగా లేక బ్రేసెస్‌ సహాయంతో నడవగలుతారు. పక్షవాతం బారిన పడినవారిలో యాభై నుంచి అరవై శాతం వరకు వాళ్లు రోజు  చేసుకునే పనులు స్వయంగా చేసుకోగలుగుతారు. పక్షవాతం వచ్చిన వారికి పూర్వస్థితి రావడానికి ఎంతో దోహదపడే ఫిజియోథెరపి గురించి వివరంగా తెలుసుకుంద్దాం...

ఫిజియెథెరపీ ఆశ్యకత...
ఫిజియోథెరపీ అనగా ఇది శారీరక చికిత్స అంటేగాని మందులతో కూడిన చికిత్స కాదు. ఫియోథెరపీలో నొప్పి నివారణకు విద్యుత్‌ పరికరాలతో పాటు కండరాలు, కీళ్లు నరాల సామర్థ్యం పెంపొందిచడానికి నిర్ధిష్టమైన వ్యాయామాలు కలిగి ఉంటాయి.
ఫిజియోథెరపీ ముఖ్య ఉద్దేశ్యం :
మందులలో రోగి ముఖ్య జీవిత కాలాన్ని పొడిగించితే, ఫిజియోథెరపీతో పొడిగించిన కాలానికి తిరిగి జీవితాన్ని పెంపొందించడం మరియు రోగికి (ఫంక్షనల్‌ ఇండిపెండెన్స్‌) స్వతంత్రంగా పనులు చేసుకునే వీలుగా (క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌) పెంపొందించుట.

సాధారణంగా ఫిజియెథెరపీ చికిత్స ఎప్పుడు మొదలుపెడతారు?
వైద్యపరీక్షల ద్వారా పక్షవాతం అని తెలియగానే , ఆసుప్రతిలో పక్షపాతం అని నిర్దారిచగానే ఐయుసిలో నుంచే ఫిజియోథెరపీ చికిత్స దిశల వారిగా మొదలవుతుంది.
ప్రారంభ దశ : రోగి కదలలేని పరిస్థితి లో ఉన్నప్పుడు స్వాధీనం తప్పిన కండరాలను, నరాలను తిరిగి పూర్వస్థితికి తీసుకువచ్చేలా ఫిజియోథెరపి అవసరం అవుతుంది. అత్యవసరం చికిత్స నుంచి సాధారణ వార్డుకు మార్చిన తరువాత ఎక్కువ సార్లు ఫిజియోథెరపీ వ్యాయామం చేయబడుతుంది.
రెండవదశ : ఆసుపత్రిలో డాక్టర్‌ సలహామేరకు ఫిజియోథెరపీ చేసిన తరువాత , వైద్యచికిత్స విధానాలతో పాటుగా కొన్ని రోజుల పాటు వ్యాయామం చేయాల్సి వుంటుంది.
ఐస్‌క్యూట్‌ స్ట్రోకింగ్‌ : మెదడు నుంచి నరాలకు, కండరాలకు సంకేతాలు పెంపొందించుటకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
గెయిట్‌ ట్రెయినింగ్‌ ఇన్‌ ప్యారెలల్‌ బ్యార్‌ విత్‌ మిర్రర్‌ : రోగి నడకలో వచ్చిన మార్పులు, నడిచే సమ యంలో సంభవించే ఇబ్బం దులు అధిగమించి సరియైన పోస్చర్‌లో నడవడానికి దోహద పడు తుంది.
వెయిట్‌ బెయిరింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు : నడిచే క్రమంలో మోకాళ్లు, తుంటి ( జాయింట్స్‌), కీళ్లలో సంభవించే పటుత్వం కోల్పోవడాన్ని అధిగమించి, ప్రాప్రియేసెప్షన్‌ మరి యు జాయింట్‌ పొసిషన్‌సెన్స్‌ ను పెంపొందించుటకు ఇవి చాలా ఉపయోగకరమైనవి.
న్యూరో డెవలప్‌మెంటల్‌ ట్రెయినింగ్‌, కో ఆర్డనేషన్‌ ఎక్సర్‌సైజ్‌లు : ఇది అన్ని రకాల వ్యాయామాలలో చాలా ముఖ్య మైన అతి క్లిష్టమైన చాలా సమయం, ఓపికతో కూ డిన ఎక్స ర్‌సైజ్‌ టెక్ని క్‌. ఇందు లో రెండు ప్రాంతాలు చేయి, కాలు వ్యాయా మాలు విడివి డిగా చేయించ బడతాయి.

చేతికి సంబంధించి :--మొత్తం చేయి పనిచే యడానికి పెగ్‌బోర్డుని ఉపయోగిస్తారు. తిందు లోచెక్కతో వివిధ రకాల ఆకారాలతో తయారు చేయ బడిన వస్తువులు తీస్తూ తిరిగి యథాస్థానికి చేర్చాలి. ఇది రోగి స్వంతగా తన చేత్తో భోజనం చేయడానికి, గ్లాసుపట్టుకుని నీళ్లు తాగడానికి, ఇతర కార్య క్రమాలు సులభతనం చేస్తుంది. ఇందులో సన్నని ఇనుప ముక్కలు నిలువుగా జత చేసి ఉంచబడతాయి. అందులో వాటిని రెండు వెళ్లతో పైకి లాగి తిరిగి యథాస్థితికి చేర్చాలి. ఇది చొక్కా బొత్తలు పెట్టు కోవడా నికి దోహ దపడుతుంది.

ఫిగర్‌ ఆఫ్‌ ఎయిట్‌ '8' స్ట్రెయిట్‌ లైన్‌ ఎక్సర్‌సైజ్‌లు : --ఇందులో నెంబర్‌ 8పై నడవడం, రెండు సరళ రేఖల మధ్య నడవడం వల్ల్ల దశల వానిగా ఫిజియోథెరపీ చికిత్స దీనిని న్యూరో రిహా బిలిటేషన్‌ అని కూడా పిలుస్తారు.

మొదటి దశ ఫిజియో థెరపీ/ న్యూరో రిహాబిలిటేషన్‌ చికిత్సప్యాసివ్‌ జాయింట్‌ రేంజ్‌ ఆఫ్‌ మోషన్‌ ఎక్సర్‌సైజ్‌ మరియు అసిస్టెడ్‌ జాయింట్‌ రేంజ్‌ ఆఫ్‌ మోషన్‌ ఎక్సర్‌సైజ్‌లు: --కీళ్లు బిగుతుగా మార కుండా కదలిక యథావిధిగా ఉండేలా కండరాలు బిగుతుగా మారకుండా క్షీణించకుండా, రక్త ప్రసరణ యథావిధిగా జరిగేలా, ఉంచడానికి దోహదపడతాయి.


బ్రిడ్జింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు : --నడుము భాగాన్నిసులువుగా పైకి ఎత్తడానికి మల, మూత్ర విసర్జనకు ఇబ్బందికరంగా ఉండకుండా సులువుగా బెడ్‌ ప్యాన్‌ యూరినల్‌ క్యాన్‌ని చొప్పించడానికి, వ్యక్తిగత శుభ్రత పెంపొందించడానికి ఉపయోగపడతాయి.

పిసిషన్‌ చేంజింగ్‌, బెడ్‌రోలింగ్‌ ఎక్సర్‌ సైజ్‌లు : మంచంపైన ఒకే స్థితిలో పడుకోకుండా, అత్యధిక వత్తిడి (పీడనం) కలిగిన ప్రాంతాలపై పుండ్లు/అల్సర్‌ (ప్రెస్సర్‌ సోర్స్‌) పెరగకుండా ఉండడానికి.

కాక్‌ అప్‌ మరియు ఫుట్‌ డ్రాప్‌ స్పింట్స్‌ :-- కండరాలు బలహీనత కారణంగా మణికట్టు మరియు పాదము భూమ్యాకర్షణ శక్తివైపు ఆకర్షించకుండా ఉండడానికి, కండర క్షీణత పెరగకుండా ఉండడానికి

ఎలక్రికల్‌ మజిల్స్‌ అండ్‌ నెర్వ్‌ స్టిమ్యులేషన్‌ : --మెదడు నుంచి సంకేతాలు కోల్పొయిన కండరాలకు, నరాలకు తిరిగి సంకేతాలను పెంపొందించుటకు, అంతేకాకుండా పరిసరాల మార్పునకు, పరిసరాల అవగాహనకు దోహదపడతాయి.నడకలో నిలకడ మరియు నిధానము పెరుగుతాయి.ఇంతే కాకుండా ఫింగర్‌ నోస్‌ ఫింగర్‌ మాత్‌ ఫింగర్‌ హీల్‌ టుషిన్‌ బోన్‌ టెస్టులు లాంటి ఎన్నో రకాల వ్యాయామాలు చేయించబడడం జరుగుతుంది.

ఫిజియోథెరపీ చికిత్సతో కుటుంబ సభ్యుల ప్రాముఖ్యత ఎంతగానో అవసరమైన, ముఖ్యమైన అంశం, ఫిజియోథెరపిస్టు చేయించిన వ్యాయా మాలు అన్ని కాకున్నా వీలైనవి కనీసం రెండు పూటలు ఒక రోజుకు చొప్పున చేయించడం వల్ల ఫలితం ఇంకా త్వరగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.

Post a Comment

0 Comments