Full Style

>

Pulmonary congestion,ఊపిరితిత్తుల శోధము(Cadmiosis),శ్వాసకోశాల శోధము(Airway inflammation),ఊపిరితిత్తుల నెమ్ము(Lung dampness).



Pulmonary congestion,ఊపిరితిత్తుల శోధము(Cadmiosis),శ్వాసకోశాల శోధము(Airway inflammation),ఊపిరితిత్తుల నెమ్ము(Lung dampness).- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఊపిరితిత్తుల శోధము ఊపిరితిత్తుల కు సోకే సాధారణమైన సంక్రమిత జబ్బులలో ఒకటి శ్వాసకోశాల (ఊపిరితిత్తుల చిట్టచివర సూక్ష్మ దర్శినిలో చూడగలిగిన సూక్ష్మమైన వాయు కోశగోణులు వుంటాయి. వీటిని వాయు కోశాలు అంటారు. ఇక్కడ ప్రాణవాయుమార్పిడి జరుగుతుంది. శ్వాసకోశాల తో ఈ వాయు కోశాలు ఒకభాగంలో లేక ఒకటి కన్నా ఎక్కువ భాగాలలో శోధమునకు గురై ద్రవాలు చేరుతాయి. దీనిని కంజెషన్ (ఊపిరితిత్తులలో రక్తము చలనము లేకుండా నిల్వవున్న పరిస్ధితి) శ్వాసకోశాల శోధములో కనబడే లక్షణాలలో ఇది ఒకటి ఈ ద్రవాల చేరిక మూలంగా శ్వాసకోశాల విధి నిర్వహణలో అంతరాయం కలుగుతుంది.

శ్వాసకోశాల శోధము ఒకటి లేక రెండు ఊపిరితిత్తులను ప్రభావితం చేయవచ్చు. దీనికి కారణములు సూక్ష్మజీవులు, వైరస్ లు, శీలీంధ్రాలు కావచ్చు.సూక్ష్మ క్రిమి సంహారక మందులు కనుగొనక ముందు శ్వాసకోశాల నెమ్ము సోకిన రోగులు ఈ శోధముతో మరణించేవారు.

గడిచిన కొద్ది కాలం నుంచి ప్రతి సంవత్సరము ప్రపంచంలో పసిపిల్లలు 5 సంవత్సరాల లోపే వివిధ కారణాల వల్ల సోకే శ్వాసకోశాల నెమ్ము తో చనిపోతున్నారు. భారతదేశంలో 5 సంవత్సరాల లోపు పిల్లలు జబ్బులతో చనిపోతున్నారు. వీరి సంఖ్య 4 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 2 లక్షల మంది న్యూమోకోకస్ అనే సూక్ష్మ క్రిమి శోధము మూలంగా జరుగుతున్నాయి.

ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల చావులు ఈ జబ్బులతో కావడం దరిదాపు మరచిపోతున్నారు. అయినా కూడా దీని మూలాన చావులు మలేరియా, తట్టు వలన కన్నా ఎక్కువగానే వున్నాయి.
సంవత్సరాలు గడిచే కొద్ది మందులకు లొంగని న్యూమోకోకస్ అనే సూక్ష్మ క్రిమి వల్ల వచ్చే శ్వాసకోశాల నెమ్ము ఎక్కువవుతున్నట్టు గమనించడం జరిగింది. ఇది కొద్దిగా జాగ్రత్త పడవలసిన విషయంగా భావించారు.
ఈ జబ్బుకు కారణమై బీజములు ( ఇవి సూక్ష్మ క్రిములు లేదా శిలీంధ్రాలు లేక రసాయనాలు లేదా చికాకు కలిగించే పదార్ధాలు కావచ్చును.) గాలిలో నుంచి శ్వాస ద్వారా శ్వాసకోశములోకి తద్వారా శ్వాసవాహిక చిట్టచివరనున్న వాయు కోశ గోణులలోనికి చేరుతాయి. ( ఇవి ద్రాక్ష పళ్ళ గుత్తుల వలె ఉంటాయి. ఈ వాయు కోశ గోణుల వద్దే ప్రాణ వాయువుల మార్పిడి జరుగుతుంది.
 
ప్రాధమికంగా శ్వాసకోశ నెమ్ము ఆరోగ్యంగా ఉన్న ఊపిరితిత్తులకు సంక్రమిస్తుంది. ఈ సంక్రమణకు కారణం జీవులు తో కూడుకొని వున్న బిందువులను శ్వాసద్వారా పీల్చు కొనడమే.
ఇవి జబ్బులతో భాద పడుతున్న వారు దగ్గినపుడు బిందువుల వలె బయటకు వస్తాయి. ఈ బిందువులు ఎదుట వ్యక్తి శ్వాసద్వారా లోనికి పీల్చినపుడు సంక్రమిస్తుంది.  సాధారణంగా  ఎక్కువ మంది ఒకే చోట నివసించే చోట ఇటువంటి జబ్బులు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశాలు  ఎక్కువ వుంటాయి. చలి కాలం వ్యాధి వ్యాపించడానికి ఎక్కువ అవకాశం వుంటుంది.

ఏదైనా అన్యమైన వస్తువు శ్వాసద్వారా శ్వాసకోశములోని తద్వారా వాయు కోశ గోణులలోనికి చేరుతాయి. అన్యమైన వస్తువు యొక్క ఉనికి సహజమైన ప్రతి ఘటన శక్తిని ప్రేరేపిస్తుంది. దీని ఫలితంగా శ్వాసకోశాలలో ద్రవ పదార్ధాలు, సూక్ష్మ క్రిములతో పాటు చేరడం జరుగుతుంది. వీటిలో తెల్ల రక్తకణాలు కూడా వుంటాయి. వీటి పర్యవసానంగా శ్వాసకోశాల వాపు, రక్తం నిల్వ వుండి పోవడం జరుగుతుంది. దీనినే న్యూమోనియా లేక శ్వాసకోశాల లేక ఊపిరితిత్తుల నెమ్ము అంటారు.

శ్వాసకోశాల నెమ్ము సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి సోకుతుంది. మీ శ్వాసకోశ వ్యవస్ధ సమక్రమితం లేక ఇతర వ్యవస్ధల యొక్క సంక్రమితం ముఖ్యంగా శరీరం యొక్క రక్షణ వ్యవస్ధలో కొరత వున్నప్పుడు ఇది న్యూమోనియా పరిణమిస్తుంది. నోటిలో, గొంతులో, ముక్కులో,  సాధారణంగా ఉండే సూక్ష్మ క్రిములు, వైరస్ లు వ్యాధి నిరోధక శక్తి క్షీణించినపుడు పై చేయి తీసుకొని శ్వాసకోశ వ్యవస్ధలోనికి ప్రయాణించి వ్యాధి సంక్రమింప చేస్తాయి. నిద్రలో వున్నపుడు నోటిలో గోందుతా, ముక్కులో వున్న గ్రంధ జనిత స్రావాలు గొంతు నుంచి ఊపిరితిత్తులలోకి వెళతాయి.

సహజంగా శరీరం యొక్క ప్రతి ఘటన శక్తి, వ్యాధి నిరోధక వ్యవస్ధ ఈ విధంగా బిడ్డ క్రిములను బయటకు తోయడానికి ప్రయత్నిస్తాయి. కాని వ్యక్తి ఇతర జబ్బుల కారణంగా బలహీనంగా వున్నప్పడు, న్యూమోనియా తీవ్ర రూపం దాల్చే అవకాశం వుంటుంది. గత కొద్ది కాలంగా వైరస్ వ్యాధులు సోకిన వారికి వేరే శ్వాసకోశ వ్యాదులువున్నవారు, గుండె జబ్బుల వారు, మింగడంలో సమస్యలు వున్నవారు, మధ్యపానం చేసేవారు, వేరే మందులు వాడే వారు, పక్షవాతం, ఫిట్స్ జబ్బు వున్న వారిలో శ్వాసకోశ నెమ్ము సాధారణ జనాభా కంటే ఎక్కువగా  వచ్చే అవకాశం వుంటుంది.

ఒకసారి ఈ క్రిములు ఊపిరితిత్తులలోకి చేరాక గాలితిత్తులలో స్ధిరపడి అతి వేగంగా సంఖ్యాకంగా పెరగడం మొదలుపెడతాయి. శరీరం వీటికి విరుద్దంగా పోరాడడం మొదలు పెట్టే సరికి ఊపిరితిత్తులలో చీము, నెత్తురు (తెల్ల రక్తకణాలు) నిలువ వుండడం మొదలైపోతుంది. దీనినే ఊపిరితిత్తుల నెమ్ము అంటారు.
శ్వాసకోశ నెమ్ము రెండు రకాలు. దీనిని ఊపిరితిత్తుల ఆరోగ్య పరిస్ధితిని బట్టి విభజిస్తారు. ప్రాధమికంగా శ్వాసకోశ నెమ్ము ఆరోగ్యంగా ఉన్న ఊపిరితిత్తులకు వస్తుంది. ద్వితీయ శ్వాసకోశా నెమ్ము ముందుగానే పాడయిన శ్వాసకోశాలకు వస్తుంది. వ్యాధి సోకిన, ముందు గానే వున్న సంక్రమితం వల్ల చెడిపోయిన ఊపిరితిత్తులలో లేక పుట్టుకతో వున్న వైకల్యాలు వున్నప్పుడు వాటి మీద వచ్చే అవకాశం వుంటుంది.

గమనం లేకుండా పరాయి పదార్ధాల ఊపిరితిత్తులలోనికి పీల్చడం వల్ల వచ్చిన శ్వాసకోశాల నెమ్ము సాధారణంగా కండరాలు సంవరణి కండరాలు నోటి నుంచి ఊపిరితిత్తులలోనికి పదార్ధాలు  పోకుండా అడ్డుకుంటాయి. కాని ఇవి బలహీన పడినపుడు పదార్ధం ఊపిరితిత్తులలోనికి పీల్చబడతాయి. దీనినే పీల్చబడ్డ శ్వాసకోశాల నెమ్ము అంటారు. జీర్ణాశయంలోని పదార్ధాలు జీర్ణాశయ సంవరణి బలహీనంగా వుండడం మూలంగా వెనక్కు వచ్చి (సాధారణంగా ఒకసారి ఆహార పదార్ధాలు అన్నాశయంలోకి చేరాక సంవరణి మళ్ళీ తెరచుకోదు) ఊపిరితిత్తులలోనికి పీల్చబడతాయి.
ఎవరెవరిని ప్రభావితం చేస్తుంది.?
    2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు.పసి పిల్లలు, ముసలి వారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలలో సర్వ సాధారణంగా మరియు  పోషకాహారం లోపము వున్న పిల్లలలో ప్రమాదకరంగా వస్తుంది. గర్భిణీ స్త్రీలలో మధుపానం చేసే వారిలో కూడా కనబడుతుంది.

    క్రింద చూపిన పిల్లలలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
    గ్రామీణ ప్రాంతాలలో ముక్కలోపల నూనెలు పోస్తారు. వారు అజ్ఞానంతో ముక్కులు శుభ్రం చేస్తున్నామనుకుంటారు.
    - పాలు సరియైన పద్దతిలో పట్టక పోవడం
    - అనుకోకుండా గడ్డినూనె పీల్చడం (విషం)
    వృద్దులలో క్రింది కారణాల వల్ల కావచ్చును.
    - తగ్గు ముఖం పట్టిన రోగనిరోధక శక్తి
    - దీర్ఘకాలిక వ్యాధులు ( చక్కెర వ్యాధి)
    - కండరాల బలహీనత, పార్కిన్ సొనికుమ (ఇది ఒక కండరాల జబ్బు)
    - ఎయిడ్స్ వ్యాధి బారిన పడినవారు ఎయిడ్స్ వ్యాధిలో రోగనిరోధక శక్తి నశించి పోవడం మూలంగా సాధారణ వ్యక్తులలో హాని కలిగించలేని క్రిములు కూడా వీరిలో విజృంభిస్తాయి.
లక్షణాలు మరియు సంకేతాలు
    - ఇవి రోగి యొక్క వయసు తీవ్రత, వ్యాధి రోగనిరోధక శక్తి మీద ఆధారపడి వుంటాయి.
    - పిల్లలలో కనబడే లక్షణాలు సంకేతాలు
    - పిల్లలలో ప్రాధమిక దశలో  ఎక్కువ లక్షణాలు కనబడవు కాని జ్వరం, సుస్తీగా కనబడడం , నిరాసక్తతగా వుండడం వంటివి కనబడతాయి.కొంత తీవ్రత పెరిగాక శ్వాస తీసుకుంటున్నపుడు ఛాతీ లోపలకు గుంజుతున్నట్టు కనబడడం, శ్వాస వేగంగా, త్వరత్వరగా తీసుకుంటున్నట్టు వుండడం, చర్మం నీలంగా మారడం మొదట జలుబు చేసి తరువాత తీవ్రమైన జ్వరం రావడం దగ్గితే తెమడ పడడం ఈ తెమడ రంగు గోధుమ రంగులో(తుప్పు) లేదా రక్తంతో కూడి వుండవచ్చు.
    పెద్దవారిలో లక్షణాలు :
    శ్వాసకోశాల నెమ్ము సోకగానే ముందు జలుబు తరువాత తీవ్ర జ్వరం (104 కంటే ఎక్కువ)
    చలితో వణకడం
    తెమడ తో కూడిన దగ్గు తుప్పు రంగు లేదా రక్తంతో కూడిన తెమడ రావడం
    ఊపిరి పట్టనట్టుగా త్వరత్వరగా తీసుకోవడం
    ఛాతీ నొప్పి – ఊపిరితిత్తులను కప్పివున్న పొరలో సంక్రమితం ప్రాకినప్పుడు ఈ నొప్పి దీర్ఘంగా ఊపిరిలోనికి పీల్చినపుడు తీవ్రతరమవుతుంది. దీనినే శ్వాసకోశ తిత్తి నొప్పి అంటారు.
    రోగి పిల్లలైనప్పుడు వారిని గమనిస్తూ వుండాలి. పసి పిల్లలలో నెమ్ము లక్షణాలు కనబడితే నిర్లక్ష్యం చేయరాదు. చాలా త్వరగా ప్రమాద పరిస్ధితికి చేరుకుంటారు. నెమ్ముకు దారి తీసే ప్రమాదాల నుంచి పిల్లలను దూరంగా వుంచాలి.
నివారణ
        వ్యాధి గ్రస్తులైన వారికి దూరంగా వుండడం
        తల్లులకు పిల్లలకు పాలు పట్టే విధానం అవగాహన కలిగించాలి.
        నెమ్మును నివారించే టీకాలు ముఖ్యంగా వ్యాధి రోగనిరోధక శక్తి తక్కువగా లేక మార్పు చెంది వున్న పిల్లలకు  వేయించాలి. (పోలిలేలెంట్ న్యూమోకోకల్ వ్యాక్సిన్)
        కొంత మందిలో లక్షణాలు మెల్లమెల్లగా బయట పడుతూ పోతాయి.
        దగ్గు ఎక్కువవుతూ పోవడం తలనొప్పి, కండరాల నొప్పులు మాత్రం కనబడవచ్చు.
        కొంత మందిలో దగ్గు పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే సంక్రమితం ఊపిరితిత్తుల పెద్ద గాలి మార్గాలలో ఉండకపోవచ్చు.
        కొంత మందిలో చర్మం నీలంగా గోధుమ రంగుకు మారవచ్చు. దీనికి కారణం రక్తంలో  ప్రాణ వాయు శాతం తగ్గడమే
తీసుకోవలసిన జాగ్రతలు
    మొదటగా      
వ్యక్తిగత పరి శుభ్రత
నోటి మీద గుడ్డ (ముఖ్యంగా దగ్గు వచ్చినపుడు) కప్పుకోవాలి. దీని వల్ల వ్యాధి ఎదుట వారికి వ్యాపించ కుండా వుంటుంది.
తగినంత పోషకాహారం, గాలి ( పరిశుభ్రమైన) అవసరము .

Post a Comment

0 Comments