Radiology,రేడియాలజీ- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
రేడియాలజీ అనేది, శాస్త్రవేత్తలు మానవశరీరం లోపలి భాగాన్ని వివిధ కిరణాల నుండి చూడడానికి ఎక్స్-రేలను ఉపయోగించే విజ్ఞాన శాస్త్ర శాఖ. రేడియాలజిస్టులు వివిధ ఇమేజింగ్ టెక్నాలజీ (అల్ట్రాసౌండ్, కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT), న్యూక్లియర్ మెడిసిన్, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET) మరియు మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) వంటివి)లను ఉపయోగించి వ్యాధి నిర్ధారణ లేదా చికిత్స చేయడం జరుగుతుంది. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది (సామాన్యంగా చిన్న గాటు ద్వారా) ఇమేజింగ్ టెక్నాలజీల సాయంతో వైద్య ప్రక్రియలు నిర్వహించడం. మెడికల్ ఇమేజింగ్ పొందడం సామాన్యంగా రేడియోగ్రాఫర్ లేదా రేడియాలజిక్ టెక్నాలజిస్ట్ నిర్వహిస్తారు.
రేడియలాజికల్ చిత్రాల్ని పొందడం--ఈ క్రింది ఇమేజింగ్ పద్ధతులను రోగ నిర్ధారణ రేడియాలజీ రంగంలో ఉపయోగిస్తారు:
ప్రొజెక్షన్ (సమతల) రేడియోగ్రఫీ-- Projectional radiography
రేడియోగ్రాఫులు (లేదా రాంట్జెనోగ్రాఫులు, ఈ పేరు ఎక్స్-రేల ఆవిష్కర్త, విల్హేల్మ్ కాన్రాడ్ రాంట్జెన్ గౌరవార్థం పెట్టబడింది) అనేవి రోగి గుండా ఎక్స్-రేలను గ్రహణ ఉపకరణానికి ప్రసారం చేసి, అటుపై రోగనిర్ధారణ కొరకు దానిని చిత్రంగా మార్చడం జరుగుతుంది. అసలైనది మరియు నిశ్చలమైన సామాన్య ఇమేజింగ్, వెండి నిండిన ఫిలింలను ఉత్పన్నం చేస్తుంది. ఫిలిం-స్క్రీన్ రేడియోగ్రఫీలో, ఒక ఎక్స్-రే గొట్టం రోగికి గురిపెట్టి ఎక్స్-రేలను ఉత్పన్నం చేస్తుంది. రోగి గుండా ప్రసారమయ్యే ఎక్స్-రేలు పరిక్షేపాన్ని మరియు శబ్దాన్ని తగ్గించడానికి గాలనం చేయబడి, తరువాత డెవెలప్ కాని ఫిలింపై పడతాయి, ఈ ఫిలిం అనేది ఒక కాంతి-ప్రవేశించని కాసెట్ లో కాంతిని ప్రసరించే భాస్వరపు తెరకు గట్టిగా కట్టబడి ఉంటుంది. ఈ ఫిలింను అప్పుడు రసాయనికంగా డెవెలప్ చేయడం జరుగుతుంది మరియు ఫిలింపై చిత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం ఫిలిం-స్క్రీన్ రేడియోగ్రఫీకి బదులుగా డిజిటల్ రేడియోగ్రఫీ, DR, వాడడం పరిపాటి, ఇందులో ఎక్స్-రేలు సెన్సార్లు కలిగిన ఒక పళ్ళేన్ని తగులుతాయి, అప్పుడు ఉత్పన్నమైన సంకేతాలను డిజిటల్ సమాచారంగా మార్చి కంప్యూటర్ తెరపై చిత్రంగా చూపడం జరుగుతుంది. సమతల రేడియోగ్రఫీ అనేది రేడియాలజీ యొక్క మొదటి 50 ఏళ్ళలో అందుబాటులో ఉండిన ఏకైక ఇమేజింగ్ పద్ధతి. ఇప్పటికీ ఊపిరితిత్తులు, గుండె మరియు అస్థిపంజరం యొక్క పరిశీలనలో నిర్దేశించబడే మొదటి పరిశోధన, ఎందుకంటే అది ఎక్కువగా అందుబాటులో ఉండడం, వేగం మరియు పోల్చి చూసినపుడు తక్కువ ఖర్చు అవుతుంది ..
ఫ్లోరోస్కోపీ-Fluoroscopy
ఫ్లోరోస్కోపీ మరియు ఆన్జియోగ్రఫీ అనేవి ఎక్స్-రే ఇమేజింగ్ యొక్క ప్రత్యేక ప్రయోగాలు, వీటిలో ఒక ప్రకాశవంతమైన తెర మరియు ఇమేజ్ ఇంటెన్సిఫైయర్ ట్యూబ్ లు, ఒక క్లోజ్డ్-సర్క్యూట్ టెలివిజన్ వ్యవస్థకు సంధానించబడి ఉంటాయి. ఇందువలన కదలికలో ఉండే లేదా ఒక రేడియోకాంట్రాస్ట్ పదార్ధం యొక్క స్వరూపాలను ప్రత్యక్షంగా ఇమేజింగ్ చేయవచ్చు. రేడియో-కాంట్రాస్ట్ పదార్థాలు ఇవ్వబడడం, తరచూ మ్రింగడం ద్వారా లేదా రోగి శరీరంలోనికి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది, దీని కారణంగా ప్రత్యుత్పత్తి-మూత్ర వ్యవస్థ లేదా జఠర-ఆంత్ర ప్రదేశంయొక్క నిర్మాణ వ్యవస్థ మరియు రక్త వాహకాల చర్య స్పష్టంగా తెలుస్తుంది. రెండు రేడియో-కాంట్రాస్ట్ లు ప్రస్తుతం వాడకంలో ఉన్నాయి. జఠర-ఆంత్ర ప్రదేశంయొక్క పరిశీలనకు, బేరియం (BaSO4 రూపంలో)ను నోటిద్వారా లేదా మలద్వారం గుండా ఇవ్వడం జరుగుతుంది. వివిధ స్వామ్య రూపాల్లో, అయోడిన్ ను, నోటి ద్వారా, మలద్వారం గుండా, ధమనులు లేదా సిరల మార్గాల గుండా ఇవ్వవచ్చు. ఈ రేడియో-కాంట్రాస్ట్ పదార్థాలు ఎక్స్-రే ప్రసారాన్ని తీవ్రంగా సంలీనం లేదా పరిక్షేపం చేస్తాయి, మరియు ప్రత్యక్ష ఇమేజింగ్ తోడుగా జీర్ణవ్యవస్థలోని ఆహారచలనక్రియ లేదా ధమనులు మరియు సిరల్లో రక్త ప్రసరణ వంటి గతిశీల ప్రక్రియలను ప్రదర్శించడం జరుగుతుంది. అయోడిన్-కాంట్రాస్ట్ కూడా సాధారణ టిష్యూలకన్నా అసాధారణ ప్రదేశాలలో కేంద్రీకృతం చేయడం ద్వారా అసాధారణతలను (కణితులు, తిత్తులు, వాపు) మరింత స్పష్టంగా చూపుతుంది. అదనంగా, ప్రత్యేక పరిస్థితులలో జఠర-ఆంత్ర వ్యవస్థకు గాలిని కాంట్రాస్ట్ పదార్థంగా మరియు సిరల వ్యవస్థకు బొగ్గుపులుసు వాయువును కాంట్రాస్ట్ పదార్థంగా వాడడం జరుగుతుంది; ఈ సందర్భాలలో, కాంట్రాస్ట్ పదార్ధం పరిసరాల్లో ఉన్న టిష్యూల కన్నా ఎక్స్-రే ప్రసారాల స్థిరత్వాన్ని బలహీనపరుస్తుంది.
ఇంటర్వెన్షనల్ రేడియాలజీ--(Main article) Interventional radiology
ఇంటర్వెన్షనల్ రేడియాలజీ (సంక్షిప్తంగా IR లేదా కొన్నిసార్లు VIR అంటే వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ , దీనినే సర్జికల్ రేడియాలజీ లేదా ఇమేజ్-గైడెడ్ సర్జరీ అంటారు) అనేది రేడియాలజీ యొక్క ఉప-ప్రత్యేకత, ఇందులో ఇమేజ్ గైడెన్స్ ద్వారా అతితక్కువ గాటు ప్రక్రియలు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియల్లో కొన్ని కేవలం రోగనిర్ధారణ ప్రయోజనాలకై ఉంటాయి (ఉదా., ఆంజియోగ్రాం), కాగా కొన్ని మాత్రం చికిత్స ప్రయోజనాలకై చేయడం జరుగుతుంది (ఉదా., ఆంజియోప్లాస్టీ).
ఇంటర్వెన్షనల్ రేడియాలజీ యొక్క ప్రాథమిక భావన ఏమిటంటే వ్యాధివిజ్ఞానశాస్త్రంలో రోగ నిర్ధారణ లేదా చికిత్సను వీలైనంత అతితక్కువ గాటు ప్రక్రియ ద్వారా చేయడం. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు వివిధ అస్వస్థతలను నిర్ధారించి చికిత్స చేయడం జరుగుతుంది, ఇవి పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, రీనల్ ఆర్టేరీ స్టెనోసిస్, ఇన్ఫీరియర్ వీనా కావా ఫిల్టర్ ప్లేస్-మెంట్, గాస్ట్రోస్టమీ ట్యూబ్ ప్లేస్-మెంట్స్, బైలియరీ స్టెన్ట్స్ మరియు హెపాటిక్ ఇంటర్వెన్షన్స్. చిత్రాల్ని మార్గనిర్దేశనం కొరకు వాడతారు మరియు ప్రక్రియలో ఉపయోగించే ప్రాథమిక సాధనాలు, కాతటర్లుగా పిలిచే, సూదులు మరియు చిన్న గొట్టాలు. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, సాధనాలని శరీరం గుండా వ్యాధి కలిగిన ప్రదేశాలకు తీసుకు వెళ్ళడానికి ఈ చిత్రాలు ఉపకరిస్తాయి. రోగికి శారీరక బాధను తగ్గించడం ద్వారా, పెరిఫెరల్ ఇంటర్వెన్షన్లు ఇన్ఫెక్షన్ అవకాశాల్ని మరియు కోలుకునే సమయాన్ని తగ్గిస్తాయి మరియు ఆసుపత్రిలో ఉండే సమయాన్ని తగ్గిస్తాయి. సంయుక్త రాష్ట్రాలలో ఒక శిక్షిత ఇంటర్వెన్షనలిస్టు కావడానికి, ఒక వ్యక్తి సాధారణంగా ఉన్నత పాఠశాల తరువాత పదిహేనేళ్ళు శిక్షణ పొందాలి, ఇందులో ఏడు సంవత్సరాలు రెసిడెన్సీలో గడపాలి.
CT స్కానింగ్--X-ray computed tomography
CT ఇమేజింగ్ శరీరాన్ని చిత్రించడానికి ఎక్స్-రేలను కంప్యూటింగ్ అల్గారిథంలతో కలిపి ఉపయోగిస్తుంది. CTలో, ఒక ఎక్స్-రే డిటెక్టర్ (లేదా డిటెక్టర్లు)ఎదురుగా ఉన్న ఒక ఎక్స్-రే ప్రసారం చేసే గొట్టం వృత్తాకారంలో ఉన్న పరికరం రోగి చుట్టూ తిరుగుతూ, కంప్యూటర్ ద్వారా ఉత్పన్నమయ్యే అడ్డు-కోత చిత్రాన్ని (టోమోగ్రాం) అందిస్తుంది. CT అనేది అక్ష తలంలో లభిస్తుంది, కాగా కరోనల్ మరియు సాగిట్టల్ చిత్రాలు కంప్యూటర్ పునర్నిర్మాణం ద్వారా లభిస్తాయి. రేడియో-కాంట్రాస్ట్ పదార్థాలు తరచూ CTతో శరీర వ్యవస్థ యొక్క మెరుగైన చిత్రణ కొరకు వాడతారు. రేడియోగ్రాఫులు అధిక విస్తరణ స్పష్టతను అందించినప్పటికీ, CT ఎక్స్-రేలను బలహీనపరచడం ద్వారా మరింత వివరమైన పరిక్షేపాల్ని కనుగొనగలుగుతుంది. రోగిని రేడియోగ్రాఫ్ కన్నా CT మరింత అయానీకరణ ప్రసారానికి గురిచేస్తుంది.
స్పైరల్ మల్టి-డిటెక్టర్ CTలో, రోగి యొక్క నిరంతర కదలిక సమయంలో ప్రసార కిరణం ద్వారా 8, 16, 64 లేదా ఎక్కువ డిటెక్టర్లను ఉపయోగించి, తక్కువ పరీక్ష సమయంలో మరింత నిశితమైన చిత్రాల్ని పొందవచ్చు. CT స్కాన్ సమయంలో త్వరితంగా IV కాంట్రాస్ట్ ఇవ్వడం ద్వారా, ఈ నిశితమైన చిత్రాల నుండి కేరోటిడ్, సెరిబ్రల్ మరియు కరోనరీ ధమనులు, CTA, CT ఆంజియోగ్రఫీలలో 3D చిత్రాలను పునర్నిర్మించవచ్చు.
CT స్కానింగ్ కొన్ని అత్యవసర మరియు తీవ్ర పరిస్థితులైన సెరిబ్రల్ హేమరేజ్, పల్మనరీ ఎంబాలిజం (ఊపిరితిత్తుల ధమనులలో రక్తం గడ్డకట్టడం), అయోర్టిక్ డిసేక్షన్ (పుపుసధమని గోడ చీరుకుపోవడం), అపెండిసైటిస్, డైవర్టిక్యులైటిస్, మరియు అడ్డువచ్చే మూత్రపిండాల రాళ్ళ వంటి పరిస్థితులలో రోగ నిర్ధారణ కొరకు ఎంపిక చేసుకునే పరీక్షగా మారింది. CT టెక్నాలజీలో త్వరిత స్కానింగ్ సమయాలు మరియు మెరుగైన స్పష్టత వంటి నిరంతర అభివృద్ది కారణంగా CT స్కానింగ్ యొక్క నిర్దిష్టత మరియు ఉపయోగం గణనీయంగా పెరిగాయి మరియు ఫలితంగా వైద్య రోగానిర్దారణలో వాడకం పెరిగింది.
మొట్టమొదటి వ్యాపారపరంగా సాధ్యమైన CT స్కానర్ ను సర్ గాడ్ఫ్రే హౌంస్ఫీల్డ్, EMI సెంట్రల్ రిసెర్చ్ లాబ్స్, గ్రేట్ బ్రిటన్లో 1972లో కనుగొన్నాడు. ది బీటిల్స్ మ్యూజిక్ కు సరఫరా హక్కులను EMI కలిగి ఉండేది మరియు వారి పరిశోధనలకు నిధులు వారి లాభాల కారణంగా సమకూరేవి . సర్ హౌంస్ఫీల్డ్ మరియు అలన్ మెక్ లియోడ్ మెక్ కార్మిక్ కలిసి CT స్కానింగ్ ఆవిష్కరణకు గాను 1979లో వైద్యరంగంలో నోబెల్ పురస్కారం పొందారు. ఉత్తర అమెరికాలో మొట్టమొదటి CT స్కానర్, రోచెస్టర్, MN లోని మాయో క్లినిక్ లో 1972లో ప్రారంభించబడింది.
అల్ట్రాసౌండ్- Ultrasound
మెడికల్ అల్ట్రాసోనోగ్రఫీలో శరీరంలోని మెత్తటి టిష్యూ స్వరూపాల్ని ప్రత్యక్షంగా పరిశీలించడానికి అల్ట్రాసౌండ్ (అధిక పౌనఃపున్యం కలిగిన శబ్ద తరంగాలు) ఉపయోగిస్తారు. ఎలాంటి అయానీకరణ ప్రసారం ఉండదు, కానీ అల్ట్రాసౌండ్ ఉపయోగించి రాబట్టిన చిత్రం యొక్క నాణ్యత చాలావరకూ పరీక్ష చేసే వ్యక్తి (అల్ట్రాసోనోగ్రాఫర్) నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాక అల్ట్రాసౌండ్, గాలి (ఊపిరితిత్తులు, ప్రేవుల మెలికలు) లేదా ఎముక గుండా చిత్రం అందించే సామర్థ్యం లేకపోవడం అనే పరిమితి కలిగి ఉంటుంది. మెడికల్ ఇమేజింగ్ లో అల్ట్రాసౌండ్ ఉపయోగం చాలావరకూ క్రితం 30 ఏళ్ళలోనే అభివృద్ది చెందింది. మొట్టమొదటి అల్ట్రాసౌండ్ చిత్రాలు నిశ్చలమైనవి మరియు రెండు పరిమాణాలు కలిగినవి (2D), కానీ ఆధునిక అల్ట్రాసోనోగ్రఫీ 3D పునర్నిర్మాణాలను ప్రత్యక్షంగా చూడవచ్చు; ఇవి ప్రయోజనపరంగా 4D. అల్ట్రాసౌండ్ లో అయానీకరణ ప్రసారం ఉపయోగించకపోవడం వలన, రేడియోగ్రఫీ, CT స్కాన్స్, మరియు న్యూక్లియర్ మెడిసిన్ ఇమేజింగ్ పద్ధతుల లాగా కాకుండా, ఇది సాధారణంగా క్షేమకరంగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా, ఈ పద్ధతి ప్రసవ సంబంధ ఇమేజింగ్ లో ముఖ్య పాత్ర వహిస్తుంది. పిండం శరీర వ్యవస్థ అభివృద్ధిని నిశితంగా పరిశీలించే అవకాశం ఉన్నందువలన ఇందులో ఎన్నో పిండంలోని లోపాలను ప్రారంభంలోనే గుర్తించవచ్చు. సమయానుకూలంగా పెరుగుదలను నిర్ధారించవచ్చు, ముఖ్యంగా క్రానిక్ వ్యాధి లేదా గర్భధారణ-ఫలితా వ్యాధి కలిగిన వ్యక్తులలో, మరియు బహుళ గర్భధారణలలో (ఇద్దరు, ముగ్గురు కవలలు వగైరా.). కలర్-ఫ్లో డాప్లర్ అల్ట్రాసౌండ్ ద్వారా పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ తీవ్రతను కొలవవచ్చు మరియు దీనిని హృద్రోగ శాస్త్రంలో గుండె, గుండెలోని నాళాలు మరియు ప్రధాన రక్తనాడులను చురుకుగా పరిశీలించడానికి వాడతారు. కేరోటిడ్ ధమనుల స్టెనోసిస్ కారణంగా మెదడుకు రక్తప్రసరణ దెబ్బతినవచ్చు (స్ట్రోక్స్). కాళ్ళలో DVTను అల్ట్రాసౌండ్ ద్వారం అది స్థానభ్రంశం పొంది మరియు ఊపిరితిత్తులకు ప్రయాణించక ముందే (పల్మనరీ ఎంబాలిజం) గమనించవచ్చు, దీనిని చికిత్స చేయకుండా వదలివేస్తే ప్రాణాపాయం కలగవచ్చు. అల్ట్రాసౌండ్ అనేది జీవాణువుల పరీక్షలు మరియు డ్రైనేజీలు థోరాసేన్టేసిస్ వంటివి) చిత్ర-మార్గనిర్దేశన ఇంటర్వెన్షన్లలో ఉపయోగకరం. చిన్న రవాణా అల్ట్రాసౌండ్ సాధనాలు ప్రస్తుతం పెరిటోనియల్ లవాజ్ ను, తీవ్రగాయాల బాధితుల చికిత్సలో ప్రత్యక్షంగా పెరిటోనియంలో ఏదైనా రక్తస్రావం ఉన్న విషయం పరీక్షించడానికి మరియు ప్రధాన ఉదరభాగాలు అయిన కాలేయం, క్లోమం మరియు మూత్రపిండాల సంపూర్ణత్వాన్ని పరిశీలించడానికి భర్తీ చేస్తున్నాయి. విస్తృత హెమోపెరిటోనియం (శరీర అంగం లోపల రక్తస్రావం) లేదా ప్రధానాంగాలకు గాయం తగిలినప్పుడు అత్యవసర శస్త్ర పరీక్ష మరియు చికిత్స అవసరమవుతాయి.
MRI (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ )--Main article: Magnetic resonance imaging
MRIలో బలమైన అయస్కాంత క్షేత్రాలను, శరీరంలోని టిష్యూలలో అణు కేంద్రకాలు సమరేఖలో (సామాన్యంగా ఉదజని ప్రోటాన్లు) తీసుకురావడానికి ఉపయోగిస్తారు, అప్పుడు ఈ కేంద్రకాల భ్రమణ అక్షాన్ని చెదరగొట్టడానికి రేడియో సంకేతం ఉపయోగిస్తారు, మరియు కేంద్రకాలు మరియు అన్ని పరిసర ప్రాంతాల్లోని కేంద్రకాలు యథాస్థితికి వచ్చేప్పుడు ఉత్పన్నమయ్యే రేడియో పౌనఃపున్యం సంకేతాన్ని పరిశీలిస్తారు. ఈ రేడియో సంకేతాలు కాయిల్స్ గా పిలువబడే చిన్న ఆంటెనాల ద్వారా సేకరించబడతాయి, వీటిని కావలసిన ప్రదేశం వద్ద ఉంచుతారు. MRI యొక్క ఒక లాభమేమిటంటే అక్ష, కరోనల్, సాగిట్టల్ మరియు బహుళ వక్ర తలాల్లోని చిత్రాల్ని సునాయాసంగా అందించే సామర్థ్యం. MRI స్కాన్లు అన్ని ఇమేజింగ్ పద్ధతులలోనూ అత్యుత్తమ సాఫ్ట్ టిష్యూ కాంట్రాస్ట్ అందిస్తాయి. స్కానింగ్ వేగం మరియు చిత్రాల స్పష్టత అభివృద్ది చెందేకొద్దీ, మరియు కంప్యూటర్ 3D అల్గారిథంలు మరియు హార్డ్ వేర్ అభివృద్ది కారణంగా, MRI అనేది మస్కులోస్కెలిటల్ రేడియాలజీ మరియు న్యూరోరేడియాలజీలో సాధనంగా మారింది.
ఒక్క లోపమేమిటంటే ఇమేజింగ్ జరిగేటప్పుడు, రోగి ఎక్కువ సమయం పాటు నిశ్చలంగా చాలా శబ్దం కలిగిన, ఇరుకైన ప్రదేశంలో ఉండాల్సి వస్తుంది. క్లాస్ట్రోఫోబియా (ఇరుకైన ప్రదేశాలంటే తీవ్రమైన భయం) కారణంగా MRI పరీక్ష చేయలేని సందర్భాలు సుమారు 5% రోగుల్లో కనిపిస్తుంటాయి. అయస్కాంత రూపకల్పనలో బలమైన అయస్కాంత క్షేత్రాలు (3 టెస్లాలు), తక్కువ పరీక్షా సమయాలు, వెడల్పైన, చిన్నవైన అయస్కాంత రంధ్రాలు మరియు మరింత తెరచిన అయస్కాంత రూపకల్పనల వంటి ఇటీవలి అభివృద్ది వలన క్లాస్ట్రోఫోబిక్ రోగులకు కాస్త నిశ్చింత కలిగించాయి. కానీ, సమాన క్షేత్ర బలం కలిగిన అయస్కాంతాలలో, తరచూ చిత్ర నాణ్యత మరియు తెరచి ఉంచిన రూపకల్పనల మధ్య రాజీ పడాల్సి వస్తుంది. MRIలో మెదడు, వెన్ను, మరియు మస్కులో-స్కెలిటల్ వ్యవస్థలను ఇమేజింగ్ చేయడంలో గొప్ప లాభాలున్నాయి. ఈ పద్ధతిని ప్రస్తుతం పేస్ మేకర్లు, కాక్లియర్ ఇమ్ప్లాంట్లు, కొన్ని శరీరం లోపలి వైద్యసంబంధ పంపులు, కొన్ని రకాల సెరిబ్రల్ ఎన్యూరిజం క్లిప్పులు, కళ్ళలో లోహపు మూకలు మరియు కొన్ని లోహపు భాగాలు కలిగిన రోగులకు నిషిద్ధం, ఎందుకంటే శరీరం శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలకు మరియు బలమైన చలించే రేడియో సంకేతాలకు గురవుతుంది. అభివృద్ది అవకాశం కలిగిన రంగాలు ఫంక్షనల్ ఇమేజింగ్, కార్డియో-వాస్కులార్ MRI, ఇంకా MR ఇమేజ్ గైడెడ్ థెరపీ.
న్యూక్లియర్ మెడిసిన్--Main article: Nuclear medicine
న్యూక్లియర్ మెడిసిన్ ఇమేజింగ్ లో రోగి శరీరంలోనికి రేడియో-ధార్మిక ట్రేసర్ కలిగిన కొన్ని శరీర టిష్యూలకు ఆకర్షణ కలిగిన పదార్థాలు ఉండే రేడియోఫార్మాస్యూటికల్స్ పంపబడతాయి. ఎంతో సాధారణంగా ఉపయోగించబడే ట్రేసర్లు టెక్నీషియం-99m, అయోడిన్-123, అయోడిన్-131, గాలియం-67 మరియు థాలియం-201. ఈ పద్ధతులను ఉపయోగించి గుండె, ఊపిరితిత్తులు, థైరాయిడ్, కాలేయం, గాల్ బ్లాడర్, మరియు ఎముకలను సాధారణంగా ప్రత్యేక స్థితుల కొరకు పరిశీలించడం జరుగుతుంది. ఈ పరిశోధనలలో శరీరవ్యవస్థ వివరాలు పరిమితమైనప్పటికీ, న్యూక్లియర్ మెడిసిన్ అనేది దేహధర్మ కార్యకలాపాలను చూపేందుకు ఉపకరిస్తుంది. మూత్రపిండాల విసర్జన చర్య, థైరాయిడ్ యొక్క అయోడిన్ గాఢత, గుండె కండరాలకు రక్త ప్రసరణ వగైరా కొలవవచ్చు. ప్రధానమైన ఇమేజింగ్ పరికరం గామా కెమెరా, ఇది శరీరంలోని ట్రేసర్ ఉత్పన్నం చేసే ప్రసారాన్ని గ్రహించి దానిని చిత్రంగా చూపుతుంది. కంప్యూటర్ ప్రాసెసింగ్ తో, ఈ సమాచారాన్ని అక్ష, కరోనల్ మరియు సాగిట్టల్ చిత్రాలుగా చూపవచ్చు (SPECT చిత్రాలు, సింగిల్-ఫోటాన్ ఎమిషన్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ). అత్యంతాధునిక పరికరాల్లో, న్యూక్లియర్ మెడిసిన్ చిత్రాలను CT స్కాన్ తో పోల్చి-సంధానం చేసి, రోగనిర్ధారణ ఖచ్చితత్వం మెరుగు పరచడం కొరకు దేహధర్మ సమాచారాన్ని శరీర వ్యవస్థ స్వరూపాలతో కలిపి లేదా నమోదు చేసి చూడవచ్చు.
పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET), స్కానింగ్ కూడా "న్యూక్లియర్ మెడిసిన్" విభాగం క్రిందికే వస్తుంది. PET స్కానింగ్ లో, ఒక రేడియో-ధార్మిక, జీవశాస్త్రపరంగా చురుకైన పదార్ధం, ఎంతో తరచుగా ఫ్లుడేయాక్సీగ్లూకోస్(18F), రోగికి ఇంజెక్ట్ చేయబడుతుంది మరియు రోగి ద్వారా ప్రసారం చేయబడిన వికిరణాన్ని కనుగొని శరీరం యొక్క బహుళ-తల చిత్రాల్ని ఉత్పన్నం చేయడం జరుగుతుంది. శరీరచర్యలలో మరింత చురుకైన కాన్సర్ వంటి టిష్యూలు, సాధారణ టిష్యూల కన్నా ఎక్కువగా చురుకైన పదార్థాన్ని కేంద్రీకృతం చేస్తాయి. PET చిత్రాల్ని ఒక శరీర ధర్మ ఇమేజింగ్ పరిశోధన (ప్రస్తుతం సాధారణంగా CT చిత్రాలు)లతో కలపవచ్చు (లేదా "మిశ్రమం చేయవచ్చు"), దీని ద్వారా మరింత ఖచ్చితంగా PET ఫలితాలను తెలుసుకోవడం తద్వారా రోగనిర్ధారణ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం చేయవచ్చు.
టెలిరేడియాలజీ
టెలిరేడియాలజీ అనేది రేడియోగ్రాఫిక్ చిత్రాల్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రేడియాలజిస్ట్ పరిశీలనకై పంపడం. దీనిని తరచుగా గంటల కొద్దీ జరిగిన సామాన్య శస్త్రచికిత్స తరువాత, రాత్రులు మరియు వారాంతాలలో అత్యవసర గది, ICU మరియు ఇతర అత్యవసర పరీక్షల త్వరిత పరిశీలన కొరకు వాడతారు. ఈ సందర్భాలలో చిత్రాల్ని తరచూ టైం జోన్ ల గుండా పంపించడం జరుగుతుంది (అంటే స్పెయిన్, ఆస్ట్రేలియా, భారత దేశాలకు), దీనివలన అందుకునే రేడియాలజిస్ట్ అతడి సాధారణ పగటి సమయంలోనే పనిచేయడం సాధ్యమవుతుంది. టెలిరేడియాలజీని ఒక సమస్యాత్మక లేదా కఠిన సందర్భంలో, ఒక నిపుణుడు లేదా సబ్-స్పెషలిస్ట్ సంప్రదింపులకు కూడా ఉపయోగించవచ్చు.
టెలిరేడియాలజీకి ఒక పంపే కేంద్రం, అధిక వేగం కలిగిన ఇంటర్నెట్ కనెక్షన్ మరియు ఉన్నత నాణ్యతగల అందుకునే కేంద్రం అవసరం. ప్రసార కేంద్రంలో, ప్లెయిన్ రేడియోగ్రాఫులు ప్రసారానికి మునుపు ఒక డిజిటైజింగ్ యంత్రం గుండా పంపించడం జరుగుతుంది, కాగా CT స్కాన్లు, MRIలు, అల్ట్రాసౌండ్లు మరియు న్యూక్లియర్ మెడిసిన్ స్కాన్లు అప్పటికే డిజిటల్ సమాచారం కావడం వలన నేరుగా పంపవచ్చు. అందుకునే ప్రదేశంలో కంప్యూటర్, వైద్య ప్రయోజనాలకు పరీక్షింపబడి మరియు అనుమతింపబడిన ఉన్నత-నాణ్యత ప్రదర్శన తెర కలిగి ఉండడం అవసరం. పరిశీలించే రేడియాలజిస్ట్ అప్పుడు రేడియాలజీ నివేదికను అభ్యర్థించిన వైద్యుడికి ఫాక్స్ లేదా ఇ-మెయిల్ ద్వారా పంపడం జరుగుతుంది.
టెలిరేడియాలజీ యొక్క ప్రధాన లాభమేమిటంటే వివిధ టైం జోన్లను ఉపయోగించి ప్రత్యక్షంగా అత్యవసర రేడియాలజీ సేవలను ఎల్లవేళలా అందించడం. ఇందులోని నష్టాలేమిటంటే అధిక ఖర్చులు, అభ్యర్థించే వైద్యుడు మరియు రేడియాలజిస్ట్ మధ్య పరిమిత సంబంధం, మరియు స్థానిక రేడియాలజిస్ట్ కొరకు కావలసిన ప్రక్రియలకు సమర్థత లేకపోవడం వంటివి. వివిధ రాష్ట్రాల్లో టెలిరేడియాలజీకి సంబంధించిన చట్టాలు మరియు నియమాలు మారుతుంటాయి, కొన్ని రాష్ట్రాలలో రేడియలాజికల్ పరీక్ష పంపే రాష్ట్రంలో రాష్ట్రంలో వైద్యం చేసే అనుమతి పొంది ఉండడం అవసరం. కొన్ని రాష్ట్రాలలో టెలిరేడియాలజీ నివేదికను ప్రాథమికంగా పరిగణించి, అధికారిక నివేదికను ఆసుపత్రి సిబ్బంది రేడియాలజిస్ట్ జారీ చేయడం అవసరం.
రేడియాలజిస్ట్ శిక్షణ--అమెరికా సంయుక్త రాష్ట్రాలు
రేడియాలజీ అనేది వైద్యశాస్త్రంలో పోటీరంగం మరియు విజయవంతమైన అభ్యర్థులు తరచూ వారి వైద్య విద్యాలయ తరగతుల్లో, అత్యధిక శాతం మార్కులు సాధించిన వారి ఉంటారు. ఈ రంగం ఆధునిక ఇమేజింగ్ కు సంబంధించిన కంప్యూటర్ టెక్నాలజీలో అభివృద్ది కారణంగా త్వరితంగా విస్తారమవుతోంది. రోగానిర్ధారక రేడియాలజిస్టులు కనీసం 13 ఏళ్ళ ఉన్నత-పాఠశాల-తరువాతి విద్యతో పాటుగా, మునుపే అవసరమైన 4 సంవత్సరాల అండర్-గ్రాడ్యుయేట్ శిక్షణ, వైద్య కళాశాల లో 4 సంవత్సరాలు మరియు 5 సంవత్సరాల పోస్ట్-గ్రాడ్యుయేట్ శిక్షణ పొందాల్సి ఉంటుంది. మొదటి పోస్ట్-గ్రాడ్యుయేట్ సంవత్సరం సామాన్యంగా వివిధ భ్రమణాల మార్పు సంవత్సరం, కానీ కొన్నిసార్లు మెడిసిన్ లేదా సర్జరీలలో ప్రాథమిక శిక్షణ. తరువాత నాలుగేళ్ల రోగనిర్ధారణ రేడియాలజీ రెసిడెన్సీ ఉంటుంది. ఈ రేడియాలజీ రెసిడెంట్ కు, ఒక వైద్య భౌతికశాస్త్రం బోర్డ్ పరీక్షలో ఉత్తీర్ణత అవసరం, ఇందులో అల్ట్రాసౌండ్ యొక విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతికత, CTలు, ఎక్స్-రేలు, న్యూక్లియర్ మెడిసిన్ మరియు MRI ఉంటాయి. రేడియాలజిస్ట్ యొక్క ప్రాథమిక జ్ఞానంలో జీవ కణాలపై అయానీకరణ ప్రసారం ద్వారా కలిగే ప్రభావాల పరిశీలనకు చెందిన రేడియో-బయాలజీ ఉంటుంది. రెసిడెన్సీ పూర్తికావచ్చే సమయంలో, శిక్షణ పొందే రేడియాలజిస్ట్, అమెరికన్ బోర్డ్ అఫ్ రేడియాలజీ (ABR) నిర్వహించే వ్రాత మరియు మౌఖిక బోర్డ్ పరీక్షలకు అర్హుడు. 2010నుండీ, ABR యొక్క బోర్డ్ పరీక్ష స్వరూపం మారనుంది, ఇందులో రెండు కంప్యూటర్-ఆధారిత పరీక్షలు ఉంటాయి, ఒకటి రెసిడెన్సీ శిక్షణలోని మూడవ సంవత్సరంలో, మరియు రెండవది మొదటి దాని తరువాత 18 నెలలకు ఉంటాయి.
ది వేన్ స్టేట్ యూనివర్సిటీ స్కూల్ అఫ్ మెడిసిన్ మరియు ది యూనివర్సిటీ అఫ్ సౌత్ కరోలినా స్కూల్ అఫ్ మెడిసిన్ రెండూ, ఒక సమగ్ర రేడియాలజీ శిక్షణను వారి సంబంధిత MD కార్యక్రమాల్లో, అడ్వాన్స్డ్ డయాగ్నస్టిక్ అల్ట్రాసౌండ్ ఇన్ మైక్రోగ్రావిటీ పరిశోధకుల నేతృత్వంలో GE మెడికల్ అనుసంధానం ద్వారా అందిస్తారు.
రెసిడెన్సీ శిక్షణ పూర్తయిన తరువాత, రేడియాలజిస్టులు వారి ప్రాక్తీసును ప్రారంభిస్తారు లేదా ఫెలోషిప్ లుగా పిలువబడే సబ్-స్పెషాలిటీ శిక్షణ కార్యక్రమాల్లో ప్రవేశిస్తారు. రేడియాలజీలోని సబ్-స్పెషాలిటీ శిక్షణకు ఉదాహరణలు అబ్డామినల్ ఇమేజింగ్, తోరాసిక్ ఇమేజింగ్, CT/అల్ట్రాసౌండ్, MRI, మస్కులోస్కేలిటల్ ఇమేజింగ్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, న్యూరోరేడియాలజీ, ఇంటర్వెన్షనల్ న్యూరోరేడియాలజీ, పీడియాట్రిక్ రేడియాలజీ, మమ్మోగ్రఫీ మరియు విమెన్స్ ఇమేజింగ్. రేడియాలజీలో ఫెలోషిప్ శిక్షణ కార్యక్రమాలు సామాన్యంగా 1 లేదా 2 సంవత్సరాలు ఉంటాయి.
రేడియోగ్రాఫిక్ పరీక్షలు సామాన్యంగా సంయుక్త రాష్ట్రాలలో 2-ఏళ్ళ అసోసియేట్స్ డిగ్రీ మరియు UKలో 3 ఏళ్ళ ఆనర్స్ డిగ్రీ కలిగిన రేడియాలజిక్ టెక్నాలజిస్టులు, (వీరినే డయాగ్నస్టిక్ రేడియోగ్రాఫర్లు అని కూడా అంటారు) చేస్తారు.
వెటరినరీ రేడియాలజిస్టులు అంటే ఎక్స్-రేలు, అల్ట్రాసౌండ్, MRI మరియు డయాగ్నస్టిక్ ఇమేజింగ్ లేదా జంతువులలో వ్యాధి చికిత్స కొరకు న్యూక్లియర్ మెడిసిన్ లో నైపుణ్యం కలిగిన జంతువైద్యుడు. వారు అమెరికన్ కాలేజీ అఫ్ వెటరినరీ రేడియాలజీ ద్వారా డయాగ్నస్టిక్ రేడియాలజీ లేదా రేడియేషన్ ఆంకాలజీలో యోగ్యతాపత్రం పొంది ఉంటారు.
జర్మనీ
వైద్య అనుమతి పొందిన తరువాత, జర్మన్ రేడియాలజిస్టులు 5-ఏళ్ళ రెసిడెన్సీని పూర్తీ చేయాలి, ఇందులో చివరగా ఒక బోర్డ్ పరీక్ష ఉంటుంది (దీనిని ఫచర్జ్టాస్బిల్డుంగ్ అంటారు).
ఇటలీ-2008 వరకూ, ఒక రేడియాలజీ శిక్షణ కార్యక్రమం నాలుగేళ్ల కాలంగా ఉండేది. ప్రస్తుతం, ఒక రేడియాలజీ శిక్షణ కార్యక్రమం అయిదేళ్ళ పాటు ఉంటుంది. రేడియో-థెరపీ లేదా న్యూక్లియర్ మెడిసిన్ లలో నైపుణ్యం కొరకు మరింత శిక్షణ అవసరం.
0 Comments