వెన్నులో ఫెసెట్ జాయింట్స్ కీలకం-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
శాక్రమ్,కాక్షిక్స్ మినహాయిస్తే ఇరవైనాలుగు ఎముకలతో వెన్నెముక నిర్మాణం జరుగుతుంది. ఈ ఒక్కో చిన్నెముకని ‘వెర్టిబ్రే’ అంటారు. ఈ వెర్టిబ్రే ఒక దానిమీద ఒకటి ఉంటాయి. వెర్టిబ్రే కాలం నిర్మాణంలో రెండు చిన్న ఎముకల మధ్య రెండు ఫెసెట్ జాయింట్స్ ఉంటాయి. ఒక్కోటి ఒక్కో పక్క ఉంటుంది. ఒక మనిషి వెనకా ముందు వంగటానికి ఫెసెట్ జాయింట్స్ తోడ్పడతాయి. ఈ ఫెసెట్ జాయింట్స్ మీద కార్టిలేజ్ మూత ఉంటుంది. ఇది చాలా మెత్తగా రబ్బర్‌లా సాగేపదార్థం. దీని సాయంతో ఎముకల చివర్లు ఒకదాని వైపు ఒకటి మెత్తగా ఒత్తిడి లేకుండా కదలడానికి వీలుంటుంది. ఆర్థరైటిస్ వల్ల ఈ కార్టిలేజ్ పొర చినిగి పోతుంది. ప్రతి వెర్టిబ్రే తరువాత ముందు భాగానే డిస్క్ వెనుక ఈ ఫెసెట్ జాయింట్స్ ఉంటాయి.
=వెర్టిబ్రే అనే ఎముకలో గాని, జాయింట్స్‌లో గాని, డిస్క్‌లో గాని ఏ ఇబ్బంది ఉన్నా నరాల మీద ఒత్తిడి కలిగి నొప్పి ఆ ప్రాంతంలోనే కాకుండా వెన్ను పైభాగంలో నూ , వెన్ను కిందభాగంలో అయితే కాళ్ళల్లోకి పాకే ప్రమాదముంది. అలాగే ఈ ముడింట్లో వెన్ను పూస, డిస్క్, ఫెసెట్ జాయింట్స్‌లలో ఏది దెబ్బతిన్నా దాని ప్రభావం మిగిలిన రెండింటి మీద తప్పకుండా ఉంటుంది. డిస్క్ అరిగిపోయినా, జారిపోయినా రెండు వెన్నుపూసల మధ్య దూరం తగ్గిపోతుంది. దాంతో ఫెసెట్ జాయింట్స్ సన్నబడడం ప్రారంభి స్తాయి. ఈ అధిక ఒత్తిడికి శరీరం కూడా స్పందిస్తుంది. దాంతో కార్టిలేజ్ పొర దెబ్బతినవచ్చు. దాంతో జాయింట్ ఇన్‌ప్లేమ్ అయ్యి అక్కడ వాస్తుంది. నొప్పి ఉంటుంది. ఇదే ఆస్టియో ఆర్థరైటిస్.
ఆర్థరైటిస్ హఠాత్తుగా అభివృద్ధి చెందదు. క్రమక్రమంగా కలుగుతుంది. ఎక్కువ కదలికలు, బాగా మెలితిరడం వీపు కింద భాగంలో వెనుకకు కదలికలు ఎక్కువగా ఉండటం ఫెసెట్ జాయింట్స్ దెబ్బతినవచ్చు. వెంటనే లక్షణాలు కనిపిస్తాయి. ఫెసెట్ జాయింట్స్ ఆర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పి సధారణంగా నిద్రలేచిన తరువాత లేక, విశ్రాంతి తీసుకున్న తరువాత ఎక్కువగా ఉంటుంది. నడుం పక్కకి లేదా వెనక్కివంచడం వల్ల నొప్పి ఎక్కువవుతుంది. వెన్ను కింద భాగం మధ్య నొప్పి ఎక్కువై అది పిరుదుల్లోకి వ్యాపిస్తోంది. కొన్నిసార్లు ఆ నొప్పి తొడలు, మోకాలు వరకు కూడా వ్యాపించవచ్చు. నరాల మీద ఒత్తిడి పడటం వల్ల మొద్దుబారినట్లు అవడం. టింగ్‌లింగ్ సెన్సేషన్ కలగవచ్చు. ఫెసెట్ జాయింట్స్ ఆర్థరైటిస్ వల్ల ఇలాంటి నొప్పులు రావు.
మెకానిక్ పేయిన్స్ రావచ్చు. అంటే అతిగా కదలికల వల్ల వెన్నులో ఈ నొప్పి కలుగుతుంది. ఫెసెట్ ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పితో పాటు కొన్నిసార్లు నరాల ఒత్తిడి వల్ల కలిగే లక్షణాలు కనిపించవచ్చు. వెన్నుపాములోంచి నరాలు బయటికి వెళ్ళే ప్రదేశంలో ఆర్థరైటిస్ వల్ల ఎముకలు కొసైతే ఇలాంటి నొప్పిరావచ్చు. వెన్నుపూసలోంచి నరాలు అటు ఇటూ వెళ్ళటానికి ఉన్న ద్వారాన్ని పొరామిన్ అంటారు. ఈ పొరామిన్ ప్రాంతంలో ఎముక కొనగా ఏర్పడితే అది నరాల మీద గీసుకొని నరాలు ఇరిటెట్ అవుతాయి. ఈ నరం ఎక్కడి దాకా వ్యాపిస్తే ఈ ఇరిటేటేషన్ అక్కడి దాకా ఉండవచ్చు. ఇరిటేషన్ వల్ల కలిగే లక్షణాలు మొద్దుబారటం, టింగ్‌లింగ్ ప్రతిస్పందన ఎక్కువవడం, కండరాలు నీరసపడడం జరుగుతుంది.
అరిగిన ఫెసెట్ జాయింట్స్‌లో దగ్గరగా ఉన్న వెన్నుపూసలు ఎలా ఉన్నాయో ఎక్స్‌రే ద్వారా తెలుసుకుం టారు. అవసరమైతే ఎమ్‌ఆర్‌ఐ కూడా చేయిస్తారు. దీనివల్ల ఫెసెట్ జాయింట్స్ వాచాయో, పెద్దవి అయ్యాయో తెలుసుకోవచ్చు. సీటీ స్కాన్ కూడా చేయవచ్చు. బోన్‌టిష్యూ తెలుసుకోవడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. పెసెట్ జాయింట్స పైన ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఒక్కసారి అనారోగ్య నిర్ధారణకు వచ్చిన తరువాత... పరిపూర్ణ రోగ నిర్ధారణ జరిగిన తరువాతే చికిత్స చేస్తారు. పెసెట్ జాయింట్స్ ఆర్థరైటిస్‌ని ప్రారంభదశలో గమనిస్తే శస్తచ్రికిత్స లేకుండా తగ్గించవచ్చు. ఇన్‌ఫ్లమేషన్, నొప్పి తగ్గటానికి వైద్యులు ఒకటి రెండు రోజుల విశ్రాంతి తీసుకోవాలి . గట్టిబల్లలాంటి దానిమీద పడుకోవాలి . ఇలాంటి భంగిమలతో కొంతవరకు ఒత్తిడిని నివారించవచ్చు.
అవసరమైతే మందులతో పాటు ఫిజియోథెరపీ సూచిస్తారు. మందులతో, ఫిజియోథెరపీలతో నొప్పి తగ్గనప్పుడు ఆ జాయింట్‌లో ఇంజక్షన్ ఇస్తారు. ఫెసెట్ జాయింట్స్ నుంచి వచ్చే నొప్పిని తగ్గించడానికి ఈ మత్తును కలిగించే మందు ఉపయోగపడుతుంది. ఈ ఫెసెట్ జాయింట్స ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి అరుదుగా శస్తచ్రికిత్సతో నొప్పిని కలిగించే నర్వ్‌ను కట్ చేస్తారు. పెసెట్ జాయింట్స్‌కి సరఫరా అయ్యే చిన్న చిన్న నర్వ్‌ని ఫెసెట్ రైజోటమి అనే శస్తచ్రికిత్సతో తొలగిస్తారు. రెండు లేక మూడు వెన్నుపూసల్లో జాయింట్స్ దెబ్బతింటే ప్యూజన్ శస్తచ్రికిత్స చేస్తారు. దీని వల్ల ఆర్థరైటిస్ వచ్చిన ఫెసెట్ జాయింట్స్ కదలకుండా ఉంటాయి, నొప్పి తగ్గుతుంది.
0 Comments