Full Style

>

కీళ్లలో రాయి...గౌట్ నివారణ , Stone in Joint-gout treatment


కీళ్లలో రాయి...గౌట్ నివారణ , Stone in Joint-gout treatment- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

----

బొటనవేలు బిగుసుకుపోయినట్లు కావడం, కీళ్ల మధ్య రాయిలా మారడంతో కనిపించే వ్యాధి గౌట్. గతంలో మాంసాహారం తీసుకునే సంపన్న వర్గాల్లో కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు మారిన ఆహార అలవాట్ల వల్ల చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కీళ్లనొప్పులు, ఆ వ్యాధికి కారణాలు, నివారణ వంటి అనేక అంశాలపై అవగాహన పెంచుకుందాం.

మాంసాహారం, మద్యంలో పూరిన్స్ అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని పోషకాల్లాగానే ఇవి కూడా శారీరక కార్యకలాపాల్లో పాలుపంచుకుని కణంలోకి పూర్తిగా శిథిలమైపోవాలి. ఆ ప్రక్రియ సరిగ్గా జరగకపోతే రక్తంలోకి కొన్ని వ్యర్థాలు విడుదల అవుతాయి. అందులో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. కొందరిలో యూరిక్ యాసిడ్ కీళ్ల మధ్యన చేరి రాయి (క్రిస్టల్) లా గట్టిగా మారిపోయి కీలును దెబ్బతీస్తుంది. దాంతో విపరీతమైన నొప్పి వస్తుంది. అలా కీళ్లలో తీవ్రమైన బాధ కలిగిస్తుంది ఈ గౌట్.

Post a Comment

0 Comments