Stretch marks , స్ట్రెచ్ మార్క్స్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
లావెక్కే క్రమంలో చర్మం తన ఎలాస్టిసిటీ కోల్పోయినప్పుడు చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ పడతాయి. (ముఖ్యంగా గర్భవతుల ... అయితే ఒకసారి చర్మంపై పడ్డ స్ట్రెచ్ మార్క్స్ పూర్తిగా తగ్గిండము కష్టము ..ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే స్ట్రెచ్ మార్క్స్... మొదటి దశలో పర్పుల్, పింక్ కలర్‌లో కన్పిస్తాయి.చివరకు తెల్లగా మారుతాయి. నిర్లక్ష్యం చేస్తే మరింతగా ఇబ్బందిపెడతాయి. సహజంగా ప్రెగ్నెన్సీ సమయంలో.. పొట్ట తొడలు, ఛాతీభాగాలలో ఈ మచ్చలు ఏర్పడతాయి.సాగిన గుర్తులు చర్మంపై ఏ ప్రదేశంలోనైనా ఏర్పడవచ్చు, అయితే అవి ఎక్కువగా కొవ్వు నిల్వ అధికంగా ఉండే భాగాలలో కనిపిస్తాయి. ఉదరం (ప్రత్యేకించి నాభి సమీపంలోని ప్రాంతం), రొమ్ములు, భుజముల పైన, భుజాల క్రింద, వీపు, తొడలు (లోపలి మరియు బయటి ప్రాంతాలు రెండూ), తొంటి, మరియు పిరుదులు అత్యంత సాధారణంగా వ్యాపించే ప్రదేశాలు. వాటి కారణంగా లేదా వాటితో ఆరోగ్యానికి ఏ విధమైన హాని ఉండదు, మరియు సాధారణంగా పనిచేసి, బాగుచేసుకొనే శరీర సామర్ధ్యానికి హాని కలిగించవు
మాతృత్వం.. ప్రతి మహిళ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది.. తన కడుపున జన్మించే బిడ్డ కోసం దేన్నైనా వదులుకోడానికి తల్లి సిద్ధపడుతుంది. అయితే చాల మంది మహిళలు తమ తొలి కాన్పుతోనే మునపటి వన్నెను కోల్పొయామాని చింతిస్తుంటారు. అయితే పలు సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలను పాటించటం వల్ల స్వల్ప వ్యవధిలోనే అమ్మలు వారి టినేజి యువ్వనాన్ని తిరిగి సంపాదించుకోవచ్చంటున్నారు
బ్యూటీషియన్లు.
కారణాలు
చర్మంపై సాగినగుర్తులు కనబడటానికి అనేక కారణాలు ఉన్నాయి: ప్రసవించిన వెంటనే 324 మంది స్త్రీలపై జరిపిన అధ్యయనం, చిన్న వయసులో తల్లి కావడం, అధిక శరీర బరువు సూచిక, 15 కిలోగ్రాములు (31 పౌండ్ల) కంటే ఎక్కువ బరువు పెరగడం మరియు నవజాత శిశువు యొక్క బరువు అధికంగా ఉండటం గుర్తులు ఏర్పడటానికి విభిన్న స్వతంత్ర కారణాలుగా ఉన్నాయని సూచించింది. కౌమారదశలో ఉన్నవారు తీవ్రమైన గుర్తులు ఏర్పడే హానిని ఎక్కువగా కలిగిఉన్నారు.
వేగంగా పెరిగే చర్మాన్ని నియంత్రణలో ఉంచడానికి అవసరమైన కొలాజెన్ మరియు ఎలాస్టిన్ తంతువులను ఏర్పరచకుండా సాగిన గుర్తులు పెరగడానికి కారణమయ్యే గ్లూకోకోర్టికాయిడ్ హార్మోన్లు చర్మం పైపొరను ప్రభావితం చేస్తాయి. చర్మం సాగుదలతో, ఇది అనుకూల పదార్ధ లేమిని సృష్టించి, దానితో అంతర మరియు బహిశ్చర్మ చిరుగుదలకు దారితీస్తుంది.
దాని శక్తికి మించి చర్మం అధిక సాగుదల బలానికి గురైనపుడు అది చీరుకుపోతుంది. ఆహారం మరియు సాధ్యమైనంతవరకు వ్యాయామం వలెనే, హార్మోన్ల మార్పులు మరియు జన్యువుల ప్రభావం గుర్తులు ఏర్పడటం నుండి చర్మం తట్టుకునే సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
స్ట్రెచ్ మార్క్స్ మటు మాయం కావాలంటే...
* ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతిరోజు ఆల్మండ్ ఆయిల్, విటమిన్-ఇ ఆయిల్, కోకోవా బటర్‌లలో ఏదోఒకదానితో పొట్ట చర్మంపై గుండ్రంగా, మృదువుగా రాయాలి.
* డెలివరీ అయ్యాక కూడా స్ట్రెచ్ మార్క్స్ కోసం అందుబాటులో వున్న క్రీమ్స్ రెగ్యులర్‌గా వాడాలి. ఇలా చేస్తే సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు.
* డెర్మాంబరేషన్ అన్న మెడికల్ విధానం ద్వారా స్ట్రెచ్ మార్క్స్‌ను తగ్గించుకోవచ్చు.
* పంచదార, ఆలివ్ ఆయిల్, విటమిన్-ఇ క్రీం, అలోవెరాజెల్ వీటిని సమభాగాలుగా కల్పి స్ట్రెచ్ మార్క్స్‌పైన మృదువుగా రాస్తూ వుండాలి. అలా ప్రతిరోజూ చేస్తుంటే క్రమంగా మచ్చలు తొలగిపోతాయి.
* కెమికల్ ఫీలింగ్ విధానాన్ని కూడా స్ట్రెచ్ మార్క్స్ తొలగించేందుకు వాడతారు.
* ఆముదాన్ని క్రమం తప్పకుండా మచ్చలు వున్న చోట రాస్తూ వుండాలి.
* అబ్బామినోప్లాస్టీ అనే వైద్య విధానంలోనూ వీటిని తొలగించుకునేందుకు వీలుంది. ఇది ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే చేస్తారు.
* క్యాలెందులా ఆయిల్‌తో మచ్చలపై మృదువుగా రోజూ రెండు పూటలా మసాజ్ చేస్తే మంచి ఫలితం వుంటుంది.
* లావెండర్ ఆయిల్‌ను రోజూ మూడు సార్లు మచ్చలపై మర్దనా చేసినా మంచి ఫలితం లభిస్తుంది.
* జింక్ అధికంగా లభించే ఆహారపదార్థాలు తీసుకోవాలి. ఆకుకూరలు, సోయా బీన్స్ స్ట్రెచ్ మార్క్స్‌ను తగ్గిస్తాయి.
* కడుపు కండరాలను బిగుతుగా చేసే యోగాసనాలు వేయాలి. నీరు ఎక్కువగా తాగాలి.
* E-two Laser ట్రీట్-మెంట్ 4-5 సిట్టింగ్ అవసరముంటుంది.
0 Comments