Full Style

>

గోరుచుట్టు ,Whitlow,Paronychia


గోరుచుట్టు ,Whitlow,Paronychia- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


గోరుచుట్టు (Whitlow) చేతి లేదా కాలి వేలి గోరు కుదుళ్ళలో చీముపట్టి చాలా బాధించే వ్యాధి. ఇది బాక్టీరియా లేదా శిలీంద్రాల వలన సంక్రమిస్తుంది. చీము ఎక్కువగా ఉన్నచో చిన్న గంటు పెట్టి దాన్ని తొలగించవలసి వస్తుంది.
గోళ్ళను కత్తిరించేటప్పుడు బలవంతంగా గోరును పీకినట్లయితే గోరుకు అతుక్కున్న చర్మం గోరు నుంచి విడిపోయి, చర్మానికి వాపురావటమే కాకుండా అమిత బాధ కలుగుతుంది. పాదం క్రింద పెట్టి నడవటం బాధాకరంగా మారుతుంది.దీనినే గోరుచుట్టు అంటారు .
గోర్లు నోటితో కొరికేవారిలో చిన్న గాయంతో ఇది మొదలవుతుంది. ఎక్కువగా నీటితో, ఆహార పరిశ్రమలో పనిచేసేవారిలో, గోరు మూలల్లో మురికి పట్టియున్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలెక్కువ. గ్రహణం సమయంలో వేలుతో చూపిస్తే గోరుచుట్టు వస్తుందని మూఢ నమ్మకం ఉంది.

కారణాలు : వైరస్ , బాక్టీరియా , ఫంగల్ ఇన్ఫెక్షన్‌ వలన చీము పట్టి పుండుగా గోరుచుట్టూ తయారగును .

ఆయుర్వేదిక్ చిట్కాలు :
కొంతమంది గోరుచుట్టు లేచి బాధపడుతుంటారు. అలాంటి వారు కాస్త ఓపిక చేసుకొని కొండపిండి చెట్టుఆకు వెల్లుల్లి లవంగాలు కలిపి నూరి ఆ ముద్దను వేలికి తొడిగితే గోరుచుట్టుకు మనం టోపీ పెట్టినట్టే.(కొండపిండి చెట్టు, అమరాంధేసి అనే వృక్ష కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం యనామం ఇవ్వాలేనేట.)
కృష్ణ తులసి మొక్క మరియు ఆకుల రసాన్ని , వాటి లేపనాన్ని గోరుచుట్టు ఇంకా ఇతర అంటువ్యాధులకు, మందుగా వాడతారు.
గోరుచుట్టు లేవగానే , మునగ బంకను గోరుచుట్టుకు పట్టించి పట్టీ కడితే గోరుచుట్టు సులువుగా తగ్గిపోతుందని అంటారు కాని స్సుద్దిచేసి వాడాలి . .
గోరుచుట్టు లేచినపుడు నిమ్మపండును ఒకవైపు రంధ్రము చేసి వ్రేలును అందులో దూర్చి పెట్టుకున్నా సలపడం తగ్గును.

చికిత్స :
చీము ఎక్కువగా ఉన్నచో చిన్న గంటు పెట్టి దాన్ని చీమును తొలగించగా భాధ తగ్గుతుంది .
నొప్పితగ్గడానికి : tab Dolomed 1మాత్ర రెండు సార్లు గా 3-4 రోజులు వాడాలి .
Antibiotic : tab ciprofloxin 500 mg రోజుకి 2 చొ.. 3-4 రోజులు వాడాలి .
గోరుచుట్తు బిటాడిన్‌ లోషన్‌ తో కడిగి ... Clindamycin Ointment (Erytop) పూతగా రాసి కట్టు కట్టాలి .

Post a Comment

0 Comments