చర్మం మెరవాలంటే...ఇంటి వైద్యము, Home Remidies for bright skin- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
--కాలమేదైనా పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడేది చర్మం. శీతాకాలంలో పొడిబారడం, వేసవిలో నల్ల బడడం ఇలా అనేక ఇబ్బందులు. అయితే కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే, చర్మాన్ని చక్కగా సంరక్షించుకోవచ్చు. మనం తినే ఆహారపదార్ధాల్లో మనకు, మన చర్మానికి సరిపడని వాటిని గుర్తించడం అత్యవసరం. అటువంటి వాటికి దూరంగా వుండాలి. అదే విధంగా చర్మం కాంతివంతంగా వుండడానికి పలు ఆహారపదార్ధాలు దోహదం చేస్తాయి. వాటిని తరచు స్వీకరించాలి. నూనె పదార్ధాలు, కొవ్వు పెంచే పదార్ధాలు, మత్తు పదార్ధాలు చర్మానికి హాని కలిగిస్తాయి. అందువల్ల వీలైనంత వరకు వాటికి దూరంగా వుండాలి. ఇక ఆకు కూరలు, పళ్లు, పాలు, మొక్కజొన్న, సోయాచిక్కుళ్లు వంటివి తరచు తీసుకోవడం చర్మానికి మంచిది. వేసవిలో పొడుగు చేతుల చొక్కాలు వేసుకోవడం అవసరం. కానీ వీలయినంత వరకు మృదువైన నూలు వస్త్రాలు ధరించాలి. సౌందర్యసాధనాలు తాత్కాలికంగానే చర్మ సౌందర్యం ఇనుమడించినట్లు కనిపింప చేస్తాయి. అంతకన్నా మన ఇంట్లో వుంటే సున్నిపిండి, సెనగపిండి, పాలు, కమలా, బొత్తాయి తొక్కల పౌడరు లాంటివి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. సబ్బు కన్నా వివిధ సహజ మూలికలతో తయారుచేసిన సున్నిపిండి వాడడం మంచిది.
శరీరానికి చల్లటి, స్వచ్ఛమైన గాలి, నిత్యం కాస్సేపైనా తగలనివ్వాలి. వేసవిలో బిగుతైన దుస్తులు కాకుండా, కాస్త గాలి ఆడే దుస్తులు ధరించాలి. అవి కూడా నూలుతో చేసినవై వుండాలి. నిత్యం వీలైనంత ఎక్కువగా నీరు సేవించాలి. ఇది కేవలం చర్మానికే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిది. చెమట ఎక్కువగా పట్టే వారు, స్నానానంతరం కాస్త చందనాన్ని నీళ్లలో కలిపి, పల్చగా చేసి, వంటికి పట్టించడం మంచిది. అత్తరులు, ఫెర్ఫ్యూమ్స్ కన్నా ఇది మంచిది. నూనె పదార్ధాలకు దూరంగా వుంటే ముఖంపై చర్మం కాంతివంతంగా వుంటుంది. జిడ్డు చేరదు. జిడ్డు చర్మం కలిగిన వారు రోజుకు నాలుగైదు సార్లు, స్వచ్చమైన మంచి నీటితో ముఖాన్ని కడగడం అవసరం.
రక్తప్రసరణ లోటుపాట్లు కూడా చర్మంపై ప్రభావాన్ని కనబరుస్తాయి. కనుక రక్తప్రసరణకు సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. తలపై చుండ్రు వుంటే అది ముఖంపైనా, భుజాలపైనా రాలిపడిన చోట, చర్మానికి ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల చుండ్రును నిర్మూలించుకోవడం అవసరం. వేసవిలో కానీ, శీతాకాలంలో కానీ అతిశీతలం లేదా అతివేడి నీటిని స్నానానికి వాడకూడదు.గోరువెచ్చని నీరు స్నానానికి వాడడం ఉత్తమం. వేసవిలో స్నానం చేసే నీళ్లలో చెంచాడు ''ఉడుకోలేన్'' వేసి వాడితే వంటికి మంచి సువాసన పడుతుంది. ఇక ఫెర్ఫ్యూమ్‌లు వాడే అవసరం వుండదు.
Tips to get smooth and bright skin,చర్మము నలుపు తగ్గి నునుపు గా అవడానికి చిట్కాలు :-
ఎంత తెల్లగా ఉన్న వారి చర్మమైనా మోచేతులూ, మోకాళ్ల దగ్గర నల్లగా, మందంగా అయిపోతుంది. అలాకాకుండా ఉండాలంటే ఇలా చేయండి.
నిమ్మ చెక్కతో మోచేతులూ, మోకాళ్ల దగ్గర రుద్ది పావుగంట సేపు వదిలేయాలి. వేడినీళ్లలో ముంచిన టవల్‌తో గట్టిగా తుడవాలి. ఇలా ప్రతిరోజూ ఒక నెల రోజూలు చేయాలి. తరువాత వారానికి రెండు స్సర్లైనా చేస్తూ ఉండాలి.
అలాగే ఒక టీస్పూను కొబ్బరి నూనెకి, అర టీ స్పూను నిమ్మరసం కలిపి జాయింట్ల దగ్గర రుద్ది, పైవిధంగానే వేడి టవల్‌తో తుడిచేయాలి.ఇలా ప్రతీ వారము చేయాలి .
కొబ్బరి నూనెకి వాల్‌నట్ పొడిని కలిపి తరచూ రాస్తున్నా మంచి ఫలితమే ఉంటుంది.
మీగడకి, పసుపు కలిపి స్క్రబ్‌లా రోజూ వాడచ్చు. చర్మము నలుపు తగ్గి నునుపు అగును .
రెండు స్పూన్ల పెరుగుకి కొంచెం బాదం పొడిని కలిపి రాసుకున్నా చర్మము నలుపు తగ్గి నునుపు అగును .
రాత్రి పడుకోబోయే ముందు మోకాళ్లకీ, మోచేతులకీ కచ్చితంగా ఆలివ్ ఆయిల్ లేదా ఆముదం నూనెతో మర్దన చేసుకుని నిద్రపోండి. ఈ నూనెలు చర్మం ముడతలు పడడాన్ని తగ్గిస్తాయి.
మూడు స్పూన్ల బొరాక్స్ పొడికి, రెండు స్పూన్ల గ్లిజరిన్, రెండు స్పూన్ల రోజ్‌వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని మోకాలికీ, మోచేతులకీ రాసుకుని పావుగంట ఆగి, వేడి నీళ్లతో కడిగేసుకోండి. ఇలా తరచూ చేస్తుంటే నలుపు తగ్గి చర్మం నునుపు తేలుతుంది.
గుడ్డులోని తెల్లసొనకు టీ స్పూను పంచదార, అరస్పూను జొన్నపిండి కలిపి దానిని గరుకుగా ఉన్న చోట రాసుకుని, ఆరాక శుభ్రపరుచుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

0 Comments