Full Style

>

టినెటస్‌-చెవిలో హోరు,Tinitus-noise in the Ear



టినెటస్‌-చెవిలో హోరు,Tinitus-noise in the Ear- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


-చాలామందికి చెవిలో విపరీతమైన పోరు ఉంటుంది. ఇలా చెవిలో హోరు వినిపిస్తోంటే చాలావరకు శ్రవణ నాడి దెబ్బ తిన్నదని అర్థం చేసుకోవాలి. కర్ణభేరికి రంధ్రం, చెవికి ఎముకలు బిగిసినా, గొలుసు కదిలిపోయినా, మధ్యచెవిలో దీర్ఘకాలం స్రావాలు చేరినా, గట్టిగా తలకు దెబ్బ తగిలిన్ఠా, మెదడులో రక్తనాళాల వ్యాధి లేక కంతులు ఏర్పడినా లేక గువిలితో పూర్తిగా నిండి చెవి మూసుకున్నా చెవిలో హోరు రావచ్చు. కేవలం హోరు మాత్రమే ఉండి వినికిడిలో మార్పు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు నరాలు దెబ్బతిని వినికిడి కూడా తగ్గవచ్చు. కాబట్టి ముందుగా హోరుకు సరైన కారణం, నిర్థారణ చేయవలసి ఉంటుంది.

పరీక్షలు
-పూర్తి వివరాలు తీసుకున్నాక చెవిపరీక్ష .
ఆడియోగ్రామ్‌ వంటి వినికిడి పరీక్షలు ,
అవసరమైతే సి.టి.స్కాన్‌, ఎమ్‌.ఆర్‌.ఐ.

చికిత్స:

- వినికిడి లోపం లేకుండా కేవలం హౌరు మాత్రమే ఉంటే మీరు అనుమానాలు భయాలు పెట్టుకోకుండా దానితో జీవించడానికి అలవాటు పడాల్సి ఉంటుంది.

- వినికిడి లోపం కూడా ఉంటే, వినికిడి యంత్రం సహాయపడుతుంది.- ఇది చాలా మటుకు హౌరుని తగ్గిస్తుంది.

- అలాగే లోపలి హౌరు ఇబ్బంది పెట్టకుండా రక రకాల మార్గాలను అనుసరిం చవచ్చు.

- ముందుగా సాధ్యమైనంత వరకూ దానిని పట్టించు కోకూడదు.

- ఆధునికంగా బయటి శబ్దాలు మాత్రమే వినిపిస్తూ లోపలి హౌరును తగ్గించే టినెటస్‌ మాస్కర్లను అవస రాన్ని బట్టి వాడవచ్చును. కాబట్టి నిపుణు లను సంప్రదిస్తే 'టినెటస్‌' హౌరుకి తగిన సలహాలు, చికిత్స పొందవచ్చును.
- తీవ్ర జలుబు, ఇతర వ్యాధులు ఈ టినెటస్‌కు కారణం కాదని నిర్ధారణ చేసుకున్నాక, ముఖ్యంగా వైద్యులు రోగికి మనోధైర్యం యివ్వాలి.

- ఈ లక్షణాల నుంచి దృష్టిని మరల్చుకోవాలి. ఇంకో వ్యాపకంపై దృష్టిని పెట్టుకోవాలి.

ఇంగ్లిష్ మందులు :
Tab . Diziron 1 tab 3 times / day 3-4 days
Tab. vertizac 1 tab 2 time /day 5-7 days
Tab .vertin 1 tab 2 times / day 4-5 day
పై మందులలో ఏదో ఒకటే వాడాలి . దానితో బి.కాంప్లెక్ష్ మాత్రలు వాడాలి
Tab . beplex forte 1 tab daily for 15 to 20 days.

Post a Comment

0 Comments