Full Style

>

మానసిక సమస్యలను నవ్వుతో నయం చేసుకోండి!!!



నవ్వుని ప్రతిమనిషి తన రోజు వారి జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. రోజుకు కనీసం అరగంట అయినా నవ్వేటట్టుగా చూసుకొనినట్లైతే వారి మనసుకు ప్రశాంతత కలిగి సంతోషముగా, ఆరోగ్యవంతులుగా మారుతారు.

* నవ్వు నాలుగు విధాలు మేలు అనేది అక్షర సత్యం. నవ్వును జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు.

* నవ్వడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. రక్తపోటు తగ్గుతుంది. రక్

తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

* నవ్వు సీరమ్ కార్టిసాల్‌ను తగ్గించి టి లింఫోసైట్స్ పనితనాన్ని పెంచుతుంది. టీ సెల్స్ పెరుగుదలకు కూడా దోహదపడుతుంది. ఈ విషయం పరిశోధనల్లో రుజవయింది.

* నవ్వు వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా, వ్యాధి నుంచి కాపాడే ప్రొటీనులు, గామ్మా- ఇంటర్ ఫెరాన్, వ్యాధిని నయం చేసే యాంటీబాడీస్ బి-సెల్స్‌ను పెంచుతుంది.

* ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే మానసిక ప్రశాంతత అవసరం. మానసిక ప్రశాంతత వలన శరీరం తన పూర్వ స్థితిని పొందుతుంది.

* చురుకుగా, ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూ ఉండటం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు. ఆరోగ్యంలో మంచి అభివృద్ధిని గమనించవచ్చు.

Post a Comment

0 Comments