బాదంపప్పు చూడటానికి చిన్నదే... కానీ చేసే మేలు మ్త్రాం
ఒక విశాలమయిన జీవితమంత... గుండెపోటు రాకుండా చేసే చక్కటి గుణాలు ఈ
బాదంపప్పులో ఉన్నాయట.
బాదంపప్పు వల్ల ఉపయోగాలు
- గుండె సంబంధవ్యాధుల నివారణ.
- శరీరంలో కొలెస్టెరొల్‌ను సమస్థాయిలో ఉంచుతుంది.
- ప్రొటీన్‌లు అందిస్తుంది.
- న్యూట్రిషన్ గుణాలు అధికంగా ఉన్నాయి.
- బాదంపప్పులు తింటే వేరే పోషక పదార్థాలున్న మెడిసిన్ వాడనవసరం ఉండదు.
- బాదంపప్పులో ఆరోగ్యానికి సంబంధించిన హానికర అంశాలేమీలేవు.
బాదం పప్పుల వినియోగం
ఉపయోగాలకు సంబంధించి అమెరికాలోని కాలిఫోర్ని యాలో అధ్యయనం జరిగింది. మామూలు భోజనం అలాగే బాదంపప్పులతో కూడిన భోజనాన్ని ఎంపిక చేసి న కొంతమందికి వడ్డించారు. వీరు మామూలు భోజ నం తిన్నారు. అలాగే బాదంపప్పుల భోజనం తిన్న తర్వాత మరింత శక్తివంతంగా తయారయ్యారని కాలి ఫోర్నియాలో జరిగిన అధ్యయనం తేటతెల్లంజేసింది.టొరొంటో విశ్వవిద్యాలయం వెైద్యనిపుణులలో సిరిల్ కెన్‌డాల్ మాటల్లో ‘‘బాదంపప్పులపెై మాఅధ్యయనంలో ఒక విషయం స్పష్టమైంది. అది గుండెలో, కడుపులో మంటల్ని తగ్గించి చల్లదనం ఇస్తుంది. అలాగే కెలొస్టెరొల్ శాతం తగ్గిస్తుంది’’.ఒక జీన్సు లేదా 164 కేలరీల బాదంపప్పులు లేదా గుప్పెడు బాదంపప్పులు ఎంతో విలువయినవి. ఆ మోతాదు బాదంపప్పులు తింటే మన శరీరంలో ‘ఇ’ విటమిన్‌కు తిరుగుండదు. అలాగే బాదంపప్పులు వల్ల శరీరానికి మాగ్నిషియమ్, పొటాషియమ్, కాల్షియం, పాస్ఫరస్, ఐరన్ లభిస్తాయి.

0 Comments