Full Style

>

శిరోజ సంరక్షణకు..



-ప్రతిరోజూ వెంట్రుకలకు ఆయిల్ మసాజ్ చేయండి. మహావూబింగరాజ్‌ను టర్బన్ థెరపీలా ఉపయోగించుకోవచ్చు.

-చర్మాన్ని తేనెతో మసాజ్ చేస్తే మృదువుగా అవుతుంది.


-మయోనేస్‌ను మీ వెంట్రుకలకు హేర్ మాస్క్‌లా వేసుకుని అర గంటసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత షాంపూ చేయాలి.

-పొడిబారిన శరీరానికి సమువూదపు ఉప్పు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. 4టీ స్పూన్ల సమువూదపు ఉప్పు, 5 చుక్కల ఆలివ్ నూనె, చందనం నూనె, లేకపోతే నిమ్మకాయ నూనె కలిపి వాడితే మంచిది.

-ముందు షాంపూతో వెంట్రుకలను కడిగేయండి. 2గంటల తరువాత 2 టీస్పూన్ల ఉసిరి, శీకాయ్, ఫెనుక్షిగీక్, లీకరిస్ (యష్ఠి మధుకం), 2గుడ్లును కలిపి ముద్దలా చేసి దీన్ని వెంట్రుకల మొదళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట పాటు ఆరనివ్వాలి. తరువాత షాంపూతో కడిగేయండి. ఇది జుట్టుకి మంచి కండీషనర్‌లా పని చేస్తుంది.

-చలికాలంలో వెంట్రుకలు రాలడం, తెగిపోవడం, చుండ్రు ఎక్కువగా ఉంటుంది. ముందు కొబ్బరి నూనెతో పాటు నిమ్మకాయ రసాన్ని కలిపి మీ జుట్టుకు మర్దనా చెయ్యండి. తరువాత టవల్‌ని వేడి నీళ్ళలో ముంచి తలకు చుట్టేయండి. ఆవిరి పట్టించడం ఎంతో మంచిది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు.

Post a Comment

0 Comments