గర్భిణీ స్త్రీ తెలుసుకోవల్సిన 12 ఆరోగ్య చిట్కాలు
సాధారణంగా ఎవరైనా గర్భం దాల్చారని తెలిసిన వెంటనే, ఆమెకు చాలా సలహాలు
అందుతుంటాయిప. అమ్మలు, అమ్మలు, ఇరుగు పొరుగువారు, డాక్టర్స్ ఇలా ఒక్కరేంటీ
అందరి దగ్గర నుండి కావల్సినన్ని సలహాలు ఇస్తుంటారు. అందులో సగానికి సగం
నిజాలు, వారి వారి అనుభవాలను ఇలా ఇతర గర్భీణీ స్త్రీలకు సలహాల రూపంలో
ఇస్తుంటారు. అంతే కాకుండా మొదటి సారి గర్భం దాల్చిన ప్రతి స్త్రీకి
సందేహాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
గర్భం దాల్చిన వెంటనే ఆ స్త్రీ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
పుట్టబోయే బిడ్డ ఎలాంటి డెఫిషియన్సీకి లోనుకాకుండా నిపుణులైన వైద్యుల
పర్యవేక్షణలో వారు నిర్దేశించిన సమయాలలో తనిఖీలు చేయించుకుంటూ ఉండాలి.
తల్లి గర్భం సురక్షితమైనదే అయినప్పటికీ కడుపులో బిడ్డ ఉన్నప్పుడు అటువంటి
స్త్రీలు చేయకూడని కొన్ని పనుల గురించి మన దేశంలో చాలామందికి పూర్తి అవగాహన
లేదనే చెప్పాలి. కాబట్టి మేము అందిస్తున్న ఈ చిన్న చిట్కాలన్నీ గర్భిణీ
స్త్రీకి సంబంధించినవే.
థైరాయిడ్ పరీక్ష
గర్భిణీ స్త్రీలలో అనేక హార్మోను మార్పుల వల్ల థైరాయిడ్ సమస్య
ఏర్పడుతుంది. ధైరాయిడ్ ఫంక్షన్ పరీక్షలు చేయించుకోండి ... థైరాయిడ్ పనిలో
ఎచ్చు తగ్గులు వలన చెమటలు పట్టె ఆస్కారము ఉన్నది. గర్భిణీగా ఉన్నప్పుడు
థైరాయిడ్ సమస్యవల్ల గర్భస్రావం జరగవచ్చు. లేదా కడుపులో శిశువు పెరుగుదలను
అడ్డుకొంటుంది. కాబట్టి మీరు ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఒక సారి థైరాయిడ్
పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.
నీళ్ళు
గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ స్వేదము అలుము కోవడం అనేది సహజము.
ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గి , ఉష్ణోగ్రత మార్పులకు సెన్సిటివిటీ పెరగడం
వల్ల ఇలా జరుగుతుంది. అందుకొరకు రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి .
కొబ్బరి నీరు, నిమ్మరసము, తాజా పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది.
దాని వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వంటివి ఉండవు.
పిల్లులు
పిల్లులు ఇంట్లో పెంచుకొంటుంటే కానుక వాటికి దూరంగా ఉండాలి. ఇంకా
వాటిని శుభ్రం చేయకూడదు. ఎందుకంటే వాటిలో పారాసైట్స్ వంటివి ఇన్ఫెక్షన్ కు
దారితీస్తాయి. అంతే కాకుండా ఈ ఇన్ఫెక్షన్ వల్ల కడుపులో పెరుగుతున్న శిశువు
మెదడు, కళ్ళ మీద ప్రభావాన్ని చూపుతాయి.
ఆహారం
పిండిపదార్దాలున్న పప్పులు, ధాన్యాలు, గోధుమలు, బియ్యం, జొన్నలు,
రాగులు, బంగాళ దుంపలు, కర్రపెండలం, చిలగడదుంపలు, అరటి, బ్రెడ్, పండ్లు
వీటితో పాటు మాంసకృత్తులు ఎక్కువగా వున్నఆహారం తీసుకోవాలి. పప్పులు,
చిక్కులు, వేరుశనగలు, సోయబీన్సులు, పచ్చటి ఆకుకూరలు, పాలు, పెరుగు, గుడ్లు,
చేపలు, మాంసము వీటిలో వుంటాయి. ప్రతిరోజు గుప్పెడు వేరుసనగలు తింటే
శరీరానికి సరిపడా మాంసకృత్తులు లభిస్తాయి. ఐరన్, ఫోలిక్ /
కాల్షీయంను(ఎక్కువ 14-16 వారాల గర్బం నుంచి ప్రారంభించాలి, తల్లి పాలు
ఇచ్చేంతవరకు పోడిగించాలి.
వాకింగ్
గర్భవతి, రోజూవారీ చేసుకొనే పనులలో నడక ఉండాలి, కాని ఎక్కువ
బరువుపనులు చెయ్యరాదు, అదీ నెలలునిండిన సమయంలో ప్రత్యేకంగా. అది కూడా
డాక్టర్ సలహా ప్రకారమే. ఇలా చిన్న చిన్న వ్యాయామాలు, వాకింగ్ వల్ల సుఖ
ప్రసవం జరుగుతుంది.
నిద్ర
మొత్తానికి గర్భిణి స్త్రీలకు, నిద్రలేమి తప్పదు. పడుకోపోయే ముందు
వేడిపాలు త్రాగాలి. పగలు కొంచెం వ్యాయామం చేస్తే రాత్రి బాగా నిద్ర
పడుతుంది. రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి
తీసుకోవాలి. నిద్రపోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు ) తిరిగి
పడుకోవాలి.
మాంసాహారం
ఉడికించిన పదార్థాలను, పచ్చిగా ఉన్న (ఉడకని పదార్థాలను)విడివిడిగా
జాగ్రత్తపరచాలి. స్పూన్స్, ప్లేట్స్, కత్తులు, కట్టింగ్ బోర్డులు వంటివి
మాంసాహారాలను కట్ చేసినప్పుడు శుభ్రం చేసిన తర్వాత భద్రపరచాలి. లేదాంటే
సాల్మొనెల్ల ఇతర హానికరమైన బ్యాక్టీరియా గర్భిణీ స్త్రీలకు హనీ
కలిగిస్తుంది.
స్మోకింగ్
పోగాకు లేదా మద్యపానం అనగా (సారా, విస్కీ) లాంటివి సేవించరాదు. టీ,
కాఫీ తాగడంవలన, శరీరానికి కావలసినంత ఐరన్ అందదు, అందువలన భోజనం తరువాత, టీ /
కాఫీ తీసుకొనరాదు.
బరువు
గర్భిణి స్త్రీలు తమ బరువు పెరుగుతున్నారా? లేదా? గమనించుకోవాలి.
తొమ్మిది నెలలో గర్భిణి-ఎనిమిది లేక తొమ్మిది కిలోల బరువు పెరగాలి.
పెరగనిచో ఏదో సమస్య ఉన్నట్లే. కనుక డాక్టర్ను సంప్రదించాలి. చివరి నెలలో
అకస్మాత్తుగా బరువు పెరగడం మంచిది కాదు. తల్లికాబోయే ఆమెకు మంచి పోషకాహారం
ముఖ్యం. పచ్చటి ఆకుకూరలు, గుడ్లు, పండ్లు, మాంసము మొదలగు ఆహరం తీసుకోవాలి.
0 Comments