--అందం రహస్యము(బ్యూటీ సీక్రెట్), Beauty Secret- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
నేడు మహిళలు చాలామంది తమ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసుకునేందుకు బ్యూటీ పార్లర్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే బ్యూటీ పార్లర్‌కు వెళ్ళాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు. మనచుట్టూ ఎందరో ఉంటారు. కానీ వాళ్ళలో కొందరే అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. వాళ్ళ బ్యూటీ సీక్రెట్ ఏమిటి? ఒకసారి ఆలోచించండి.
కనుముక్కు తీరు బాగుండటం, మంచి రంగు, చక్కటి జుట్టు, ఎత్తుకు తగ్గ లావుతో మంచి పర్సనాలిటీ ఇలా చాలానే కారణాలు చెప్తారు. ఫీచర్స్ తో వచ్చేది నాచురల్ బ్యూటీ. ఫిజికల్ గా బాగుండటం సరే. దానికి తప్పకుండా కొన్ని మార్కులు పడతాయి.
ఇంకొందరు వేసుకున్న దుస్తుల వల్ల అందం వచ్చిందని, హెయిర్ స్టైల్ వల్ల అందం పెరిగిందని, మేకప్ తో బ్యూటీ వచ్చిందని, ఇలా రకరకాల కారణాలు చెప్తారు. వీటినీ కాదనలేం. నాచురల్ బ్యూటీ కి అలంకరణ తోడైతే అదనపు ఆకర్షణ, లేదా ఎట్రాక్షన్ వస్తుంది. దీనికి ఇంకొన్ని మార్కులు పడతాయి.
కానీ గమ్మత్తు ఏమిటంటే, ఫీచర్స్ బాగుండటం, చక్కగా తయారవడం కంటే కూడా మరో రెండు కారణాలతో అందం వస్తుంది. అందులో ఒకటి మన ప్రవర్తన. మంచితనం, నిజాయితీలతో ముఖంలో బ్యూటీ వస్తుంది. ఇక రెండోది తెలివితేటలు. కాస్త వైజ్ గా, మెచ్యూరిటీతో నడచుకోవడం వల్ల ముఖానికి గ్లో వస్తుంది. బ్యూటీ పెరుగుతుంది. ముఖం ఛార్మింగ్ గా ఉంటుంది.
బిహేవియర్, బ్రెయిన్ మెచ్యూరిటీలతో అందమా అని ఆశ్చర్యపోకండి. ఇదేదో అతిశయోక్తి అని నిట్టూర్చకండి. మీకు అందంగా కనిపిస్తున్న లేదా బాగా అనిపిస్తున్న వాళ్ళని ఒకసారి గుర్తుచేసుకోండి. వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ కంటే మెచ్యూరిటీ లెవెల్స్ వల్లే బాగున్నారని స్పష్టం అవుతుంది. అదన్నమాట బ్యూటీ సీక్రెట్. ఇకనేం, బ్యూటీ సీక్రెట్ తెలిసింది కనుక బ్యూటిఫుల్ గా, ఛార్మింగ్ గా కనిపించడం మన చేతిలోనే ఉంది. అంతే కదా మరి, పుట్టుకతో వచ్చిన రూపాన్ని మార్చలేం కానీ, మెచ్యూరిటీ లెవెల్స్ ను తప్పకుండా పెంచుగోగలం.
SUPERMODEL
* మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాయండి. పదినిమిషాల తర్వాత మెత్తగా, నెమ్మదిగా అక్కడ మసాజ్ చేయాలి.
* నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో లిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించండి.
* బంగాళాదుంపల రసం తీసి ముఖానికి రాసుకోండి. అర్ధగంట వరకూ అలాగే ఉంచండి. వారానికి రెండు,మూడు సార్లు ఇలా చేయడం వల్ల టాన్ తగ్గుతుంది.
* పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచండి. రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు,పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతోపాటు నలుపు రంగును దూరం చేస్తుంది.
* శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే మీ పొడిబారిన చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు నలుపు తగ్గిపోయి ఛామన చాయతో కాంతి వంతంగా ఉంటుంది.
* ప్రతి రోజూ చర్మానికి తేనె పూతగా రాయాలి.
* స్నానం చేయడానికి పది పదిహేను నిమిషాల ముందు శరీరానికి శనగపిండి, పచ్చిపాలు పసుపు కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి. ఆ తర్వాత స్నానం చేయాలి.
* గంధం పొడిని, పసుపు, రోజ్‌వాటర్ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి.
* బాదం పాలు ముఖానికి పట్టించండి. రాత్రంతా ఉంచుకుంటే ఇంకా మంచిది.
నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచు కోవాలి.రాత్రిపూట దీన్ని రాసుకుని పడుకుంటే ఇంకా మంచిది.
* బక్కెట్ నిండా నీళ్లు తీసుకుని దాన్లో రెండు నిమ్మకాయలు పిండాలి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసాక ఆ నీళ్ళతో స్నానం చేయాలి. దీనిని కొన్ని నెలలవరకూ కొనసాగిచాలి.
* నలుపు రంగు పుట్టుకతో వచ్చినా లేక తర్వాత కాలంలో ఏ కారణంగానైనా వచ్చినా పైన తెలిపిన చిట్కాల్ని ప్రయోగించాలి.

0 Comments