భావోద్వేగ మేధాశక్తి అవసరం ఏమిటి?(What is use of Emotional Intelligence?)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
--అరిస్టాటిల్ మాటల్లో చెప్పాలంటే - సరైన సమయంలో, సరైన వ్యక్తిపై, సరైన స్థాయిలో సహేతుకమైన కారణం కలిగి, సరైన పద్ధతిలో ఒక భావోద్వేగాన్ని (ఉదాహరణకు కోపం) ప్రదర్శించగలగడాన్ని భావోద్వేగ మేథాశక్తి అంటారు. దీనిని ఇంగ్లీషులో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు.
'తన కోపమె తన శత్రువు - తన శాంతమె తనకు రక్ష అనే పద్యంలో ఎంతో వాస్తవం ఉందనే విషయం ఇటీవలి కాలంలో జరిగిన అధ్యయనాలలో వెల్లడైంది. ఈ కింది విషయాలను పరిశీలిస్తే ఆ పద్యం అక్షరమక్షరమూ నిజమేనని అర్థమవుతుంది.
- మన మన:స్థితి, భావోద్వేగాల తాలూకు ప్రభావం మన రోగ నిరోధక శక్తిపై ఉంటుంది. మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు రోగ నిరోధక శక్తి తగ్గడం జరుగుతుంది.
- మన భావోద్వేగాలు మన శరీరంలోని అనేక వ్యవస్థలపై ప్రభావం కలిగి ఉంటాయి. ఒక పరిశోధనలో కేవలం కోపం వల్ల కలిగిన పరిస్థితిని గుర్తు చేసుకున్నప్పుడు గుండె రక్తాన్ని సరఫరా చేసే శక్తి 5 శాతానికిపైగా తక్కువ కావడం సంభవించింది. గుండె జబ్బులకు, కోపానికి సంబంధం ఉందని పరిశోధనల్లో వెల్లడైంది .
- పాజిటివ్ దృక్పథం ఉన్నవారి కంటే నెగటివ్ దృక్పథం కలవారు శారీరక వ్యాధులనుండి బైటపడటానికి ఎక్కువ సమయం పడుతుంది. వ్యాకులత కలవారు గుండెజబ్బులు, ఇతర దీర్ఘకాలిక శారీర వ్యాధులనుండి బైటపడే అవకాశం వ్యాకులత లేనివారిలోకంటే 25 శాతం తక్కువ.
- బంధువులు, స్నేహితులు, ఇతరుల ఆప్యాయత, ప్రోత్సాహం లభించినప్పుడు శారీరక వ్యాధులనుంచి తేలికగా బైటపడటం సంభవిస్తుంది.
ఈ అంశాలన్నీ మన భావోద్వేగాలు మన శరీరంపై ఎంత ప్రభావం చూపుతాయో తెలుపుతున్నాయి. కనుక చక్కటి శారీరక ఆరోగ్యం కోసం భావోద్వేగాల సమతుల్యత కూడా ఎంతో అవసరం.
మేథాశక్తిని రెండు ముఖ్య రకాలుగా విభజించవచ్చు. ఒకటి - కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్. ఇది మనిషి జ్ఞాపకశక్తి, విషయ పరిజ్ఞానం మొదలైన విషయాలకు సూచి, రెండవది - భావోద్వేగ మేథాశక్తి. ఇది మనిషి తాలూకు భావోద్వేగ సమతుల్యతకు సూచి. ఈ రెండు మేథాశక్తులు మెదడులోని వేర్వేరు భాగాల్లో సంభవిస్తాయి. మన భావోద్వేగాలు మెదడులోని లింబిక్ వ్యవస్థ, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ మొదలైన భాగాలనుంచి జనిస్తాయి. ఒక వ్యక్తి సమగ్రాభివృద్ధికి, సంపూర్ణ ఆరోగ్యానికి ఈ రెండు మేథాశక్తులు అవసరం. ఇవి ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. ఒకదానికి మరొకటి సహకరించుకుంటాయి. చక్కటి సమన్వయంతో ఒకదానితో మరొకటి చర్చించుకుని నిర్ణయానికి వస్తాయి.
భావోద్వేగా మేథాశక్తి లోపిస్తున్న వ్యక్తులు తేలికగా మానసిక సమస్యలకు లోనవుతారు. ఒంటరితనం, వ్యాకులత, ఆందోళన, ఆహార సేవన రుగ్మతలు, హింసాత్మక ప్రవృత్తి, సంఘ వ్యతిరేకత మొదలైనవి వీరిలో అధికంగా చూస్తాం. వీరు తేలికగా మాదక ద్రవ్యాలకు బానిసల వుతారు. ఆత్మహత్యలకు, హత్యలకు పాల్ప డతారు. శారీరక సమస్యలు కలిగే అవకాశం కూడా వీరిలో ఎక్కువే.
భావోద్వేగ మేథాశక్తి కలిగిన వారు ఈ కింద పేర్కొన్న ఐదు విషయాల్లో పటిమను కలిగి ఉంటారు. వ్యక్తిగత చైతన్యం
తన భావోద్వేగాలను తాను గుర్తించగలగడం. ఒక వ్యక్తి తనకు కలుగుతున్న భావోద్వేగాలను గుర్తించగలిగి ఉండాలి.
తన గురించి తాను తెలుసుకోగలిగినప్పుడు ఆ వ్యక్తి ఆత్మ విశ్వాసం, సరైన సమయంలో ఆవేశానికి నిర్ణయాలు తీసుకోగలిన పటిమ కలిగి ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం తనకు కలుగుతున్న భావోద్వేగాలను గుర్తించగలిగిన వ్యక్తి వాటిని అదుపులో పెట్టుకోగల శక్తిని కూడా కలిగి ఉండాలి. ఉదాహరణకు తనకు కలుగుతున్న కోపం, బాధ, ఆందోళన వంటి భావోద్వేగాలను అదుపులో ఉంచడం. అంటే - దు:ఖం కలిగినప్పుడు క్షణికావేశానికి లోనుకాకుండా ఆ స్థితినుంచి సరైన రీతిలో బైటపడటం. తన భావాలను ఇతరులతో పంచు కోగలగడం మొదలైనవి. వీరికి జీవితంలోని ఒడిదుడుకులకు, సమస్య లకు కృంగిపోకుండా, వాటిని ధైర్యంగా ఎదు ర్కొనే శక్తి ఉంటుంది.
తనను తాను ప్రోత్సహించుకోవడం సమస్యలు కలిగినప్పుడు తనను తాను ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగగలగడం (లక్ష్య సాధన వైపు) తాత్కాలికంగా కొన్ని త్యాగాలను చేసి దీర్ఘకాలిక ప్రయోజనాలకు కృషి చేయగలగడం ఇతరుల భావోద్వేగాలను గుర్తించగలగడం
మానవ సంబంధాలు చక్కగా ఏర్పడాలంటే ముఖ్యమైన అంశం - ఇతరులను అర్థం చేసుకోగలిగే గుణాన్ని కలిగి ఉండటం. ఇతరుల భావాలను అర్థం చేసుకుని వారికి అవసరాను గుణంగా ఓదార్పు, సహకారం అందించగలిగి నప్పుడు, తగిన రీతిలో స్పందించగలిగినప్పుడు సంఘంలో గౌరవం పొంది ఎదగగలుగుతారు.
సంబంధాలను ఏర్పరచుకోవడం ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ వారిని సంతోషపరచగలిగినప్పుడు సమాజాన్ని ముందుకు నడిపించగల సామర్థ్యం ఏర్పడుతుంది. ఇతరుల భావోద్వేగాలపై పట్టును సాధించిన వ్యక్తి పరపతి, నాయకత్వ పటిమ, మానవ సంబంధాలపై కూడా పట్టు సాధిస్తాడు. అంటే భావోద్వేగ మేథాశక్తి కలిగిన వ్యక్తి స్వయంగా తాను తృప్తిగా, సంతోషంగా ఉంటూ, ఇతరులను కూడా సంతృప్తిపరచగలిగి, సమాజంలో హాయిగా జీవించగలుగుతారు. సమాజానికి దిశానిర్దేశం చేయగలుగుతాడు.
ఈ రకమైన వ్యక్తులు నవ్వుతూ, నవ్విస్తూ, ఆడుతూ, హాయిని అందరికీ పంచుతూ వెళతారు. వీరు ఉన్న చోట విజయం, సంతోషం ఉంటాయి.
వీరు తమ భావాలను ఖచ్చితంగా, స్పష్టంగా చెప్పగలిగి ఉంటారు. ఇష్టం లేని పనిని ఇత రులు తమపైన రుద్దితే మౌనంగా సహించరు. వీరికి జీవితం అర్థవంతమైనది. తాత్కాలికంగా కలిగే సమస్యలు, ఓటమికి వీరు లొంగిపోరు. ఎమోషన్ అంటే? భావోద్వేగమంటే మనసులో కలిగే భావనలు, వాటికి తోడుగా వచ్చిన ఆలోచనలు, ఫలితంగా కలిగిన శారీరక, మానసిక స్థితి, ప్రవర్తనలో సంభవించే మార్పులు మొదలైనవాటి సమాహారం. ఉదాహరణకు - కోపం, ఆనందం, అసహ్యం, బాధ, ప్రేమ, సిగ్గు, భయం, ఆశ్చర్యం. ఇవి కలిగినప్పుడు గుర్తించగలగడం, సరైన రీతిలో వ్యక్తీకరించడం, అదుపు చేసుకోగలగడమే భావోద్వేగ మేథాశక్తి.
ఎమోషన్ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఎక్కువసేపు అదే స్థితిలో ఉంటే దానిని మూడ్ అని వ్యవహరిస్తారు. అదే స్థితి మరింత ఎక్కువ కాలం కొనసాగితే డిస్పొజిషన్ అంటారు. కాగా, ఆ స్థితిలోనుంచి బైటపడకుండా, ఎన్నాళ్లయినా అలాగే ఉండిపోతే దానిని డిసీజ్‌గా గుర్తిస్తారు.
ఒక వ్యక్తికి సాధారణ తెలివితేటలే ఉన్నా, ఆ వ్యక్తి జీవితంలో అసాధారణ ఫలితాలు సాధించడా నికి కారణం అతడికి భావోద్వేగ మేథాశక్తి ఎక్కువగా ఉండటమే.
ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌కు పునాది చిన్నతనంలోనే పడుతుంది. ఈ వయస్సులో పిల్లల మెదడు తేలికగా విషయాలను గ్రహించి తదనుగుణంగా మారుతుంది. దీనిని ప్లాస్టిసిటీ (ప్లాస్టిక్‌లాగా ఎటు వంచితే అటు వంగే శక్తి) అని వ్యవహరిస్తారు.
వయస్సు పెరిగే కొద్దీ ఈ ప్లాస్టిసిటీ తగ్గుతూ వస్తుంది. కనుక మొదటి పది సంవత్సరాల వయస్సులో పిల్లలకు లైఫ్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వగలిగితే వారి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది.
అలాగే ఈ వయస్సులో సరైన ఎమోషన్ సపోర్ట్, ట్రెయినింగ్ లభించనప్పుడు వారు తమ చుట్టూ ఉన్న వాతావరణంలో - తల్లిదండ్రుల ప్రవర్తన / భావాలు, ఇతరులన ప్రవర్తన, పరిస్థితులు - మొదలైన వాటిలో అనుకూలత లేనప్పుడు, వారిలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
పిల్లల ప్రవర్తన తమ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. కనుకనే ప్రసార మాధ్యమాలు హింస, అశ్లీలత, నేరపూరిత కథనాల వంటివాటిని ప్రచురిం చడం, ప్రసారం చేయడం మానుకోవాలి.

0 Comments