-కళ్లకి వ్యాయామము , Exercise for Eyes- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
శారీరక ఆరోగ్యానికి వ్యాయామం చేస్తున్నట్లే కళ్ల ఆరోగ్యానికీ కొన్ని ప్రత్యేక వ్యాయామాలున్నాయి. వాటిలో కొన్ని...
* రెండు అరిచేతుల్నీ రుద్దుతూ వెచ్చగాచేసి రెండు నిమిషాలు కళ్లపైన ఉంచాలి. కళ్లపై ఒత్తిడి పడేలా గట్టిగా నొక్కకుండా అరిచేతుల్ని కళ్లకు ఆనిస్తే చాలు. ఇలా ఆరేడుసార్లు చేయాలి.
* నాలుగు సెకన్లపాటు కళ్లను గట్టిగా మూయడం, తెరవడం ఇలా 7-8 సార్లు చేయాలి.
* కళ్లను మూసి ఉంచి చేతివేళ్లతో మసాజ్ చేస్తున్నట్లు రెప్పలపై నెమ్మదిగా గుండ్రంగా కదపాలి.
* కనుగుడ్లను సవ్యదిశలో ఒకసారి, అపసవ్యదిశలో ఒకసారి గుండ్రంగా తిప్పాలి. ఇలా అయిదుసార్లు చేయాలి. మధ్యమధ్యలో కనురెప్పలను అల్లల్లాడించాలి.
* 150 అడుగుల దూరంలోని ఒక వస్తువును తదేకంగా చూడటం, మళ్లీ 30 అడుగులలోపు ఉన్న వస్తువుపైకి దృష్టి మరల్చడం... ఇలా పదిసార్లు చేయాలి.
* వీలు చిక్కినప్పుడల్లా చల్లని నీటితో కళ్లను కడుక్కోవాలి.
* తలను బాగా విశ్రాంతిగా ఉంచి చూపును కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి పూర్తిగా చివర్లకు తిప్పాలి. కనుగుడ్లు ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకు ; ఆ ప్రక్కనుంచి ఈ ప్రక్కకు తిప్పాలి.
* తలను విశ్రాంతిగా ఉంచి చూపును సవ్యదిశ లోను,అపసవ్య దిశ లోనూ,తిప్పాలి, ఇలా 3 సార్లు చేయాలి.
* తలను ఏమాత్రము కదల్చకుండానే వీలైన పైకి, మళ్ళీ వీలైనంత క్రిందకూ చూడాలి
* తలను నిటారుగా వుంచిచూపును పైకి తిప్పుతూ పూర్తి కుడివైపు నుండి చూడండి, అలాగే చూపును క్రిందకి దించి పూర్తిగా ఎడమవైపు నుంచి చూడండి.

0 Comments