Full Style

>

Eye care in Summer, వేసవిలో కంటి జాగ్రత్తలు

-Eye care in Summer, వేసవిలో కంటి జాగ్రత్తలు -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రత , సూర్యుని తీవ్రత నుండి కంటిని రక్షించుకునేందుకు రంగుటద్దాలు ధరించడము మంచిది . యు.వి.తరంగాలను తగ్గించె శక్తిలకిగిన గాగుల్స్ అయితే మరీ బాగుంటుంది .
కంట్లో తేమ త్వరగా కొల్పోతాం కాబట్టి తరచూ కళ్ళను నీళ్ళతో కడుక్కోవాలి.
ఎ.సి.గదుల్లో కూర్చున్నప్పుడు చల్ల గాలులు నేరుగా కంటిమీద తగలకుండ చూసుకోవాలి .
ఈ ఋతువుల్లో పెరిగిన దుమ్ము , తేమ వల్ల కళ్ళలో ఎర్రదనము వస్తుంది . వీటితో పాటు కంటిరెప్పలమీద కురుపులు వస్తాయి. కాబట్టి కంటిమీద దుమ్ము నిలవకుండ జాగ్రత్త పడాలి .
కళ్ళ కలక వచ్చే ఋతువు ఇది . దీనిని తొలిదశలోనే అడ్డుకోవాలి . ఇతరుల కర్చీఫ్ లతో కళ్ళు తుడుచుకోవద్దు .
కంటిలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా వైద్యపరీక్షకు వెళ్ళి వారి సూచన మేరకే మందులు వాడండి . సొంతంగా కంటిచుక్కలు వేసుకోవడము , ఆయింట్ మెంటు ను పెట్టుకోవడం చేయరాదు .
వేసవిలో కంటికి విశ్రాంతి అవసరము ... 6 నుండి 8 గంటలు నిద్ర అవసరము .
కంటిలో ఉండే పారదర్శకమైన పొరని కార్నియా అంటాము. ఈ కార్నియా కారణంగానే కాంతి కిరణాలు కంటి లోపలి భాగంలో ఉండే రెటీనాపైకి ప్రసరించి మనకు ఏ దృశ్యమైనా కనిపిస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకూ, కణజాలాలకు అవస రమైన మాదిరిగానే కార్నియాకు కూడా పోషకపదార్థాలూ, ఆక్సిజన్‌ అవసరమవుతాయి. కంటిలో ఉండే నీటి ద్వారా అంటే కన్నీటి ద్వారా ఆక్సిజన్‌, ఇతర పోషకాలు కార్నియాకు అందుతాయి. అయితే ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం కారణంగానూ, ఆధునిక జీవనశైలిలో సరైన విశ్రాంతి లేకుండా రాత్రింబవళ్లు పని చేయడం వల్ల కన్నీటి గ్రంథుల (లాక్రియల్‌ గ్లాండ్స్‌)నుంచి తగిన స్థాయిలో కన్నీరు స్రవించడం లేదని, దాని మోతాదు తగ్గిపోతున్నదని గమనించారు. కంటిలోని తడి ఆరిపోయి కళ్లు పొడిగా మారడాన్ని Dry Eyes అంటారు.

Post a Comment

0 Comments