Habits for good health , మంచి ఆరోగ్యానికి కొన్నిఅలవాట్లు ->
ఆరోగ్యంగా వుండాలని మనలో ప్రతి ఒక్కరికీ వుంటుంది. ఎందుకంటే మనం ఏ కార్యం చేయాలన్నా దానికి ఆరోగ్యం అవసరం. అందుకే పూర్వం మన పెద్దలు ఆరోగ్యమే మహభాగ్యం అన్నారు.
అయితే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని చిన్న చిట్కాలు పాటించినట్లయితే మనం నిత్యం ఆరోగ్యంగా వుండ గలుగుతాము.
పల్లెటూళ్లలో మరియు మారుమూల ప్రాంతాలలో ప్రజలు తమకు వచ్చిన జబ్బులను తమకు అందుబాటులో ఉన్న వాటితో నయం చేసుకొనే గృహవైద్యమే చిట్కావైద్యం. పురాతన కాలం నుంచి కొన్ని రుగ్మతలకు నాయనమ్మ అమ్మమ్మలు ఇంట్లో లభ్యమయ్యే పదార్ధాలతోనో పెరటిలో దొరికే ఆకులతోనో చికిత్స చేసి స్వస్థత కలిగించడం అందరికి తెలిసినదే.మన అలవాట్లు , ఆహార నియమాలు బట్టి మన ఆరోగ్యము అధారపడి ఉంటుంది .
ఎన్ని పనులున్నా.. ఆరోగ్యం మీద దృష్టిపెట్టి శ్రద్ధ తీసుకోవాలి. అందుకు అనువైన అలవాట్లను అలవరచుకొంటే ఆరోగ్యం... ఆనందం మనసొంతమవుతాయి..........అవి ఏమిటంటే ----------
1 . పని ఒత్తిడితో కూర్చున్న చోటు నుంచి లేవకుండా అదే పనిగా విధుల్లో నిమగ్నమవుతుంటారు కొందరు. దానివల్ల ఊబకాయం సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాకాకుండా అరగంటకోసారి లేచి రెండుమూడు నిముషాలు అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. దానివల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. మెడ, వెన్ను నొప్పి వంటివీ దూరంగా ఉంటాయి.
2 . ఉదయాన్నే తప్పనిసరిగా అల్పాహారం తీసుకొంటేనే పనుల మీద శ్రద్ధ పెట్టగలం. లేదంటే ఆకలి, నీరసంతో పనిచేయగలం అంటే అనారోగ్యానికి దారితీస్తుంది. ఆహారము తీసుకోవడానికి వీలుకాకపోతే డ్రైఫ్రూట్స్‌ను వెంట తెచ్చుకొని తింటూ ఉంటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.
3 . పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు మనసు టీ, కాఫీల మీదకు లాగుతుంది. అదే పనిగా కాకుండా రోజులో రెండు కప్పులకు మించి తీసుకోకపోవడం మంచిది.
4 . చల్లటి నీళ్లు తీసుకొనే బదులు పని చేసే సమయంలో కాచి చల్లార్చిన నీళ్లు తీసుకోవడం మంచిది. ఎందుకంటే అవి సూక్ష్మజీవుల రహితం గా ఉంటాయి . శారీరక నొప్పులను దూరం చేసి.. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి తోడ్పడుతుంది.
5 . సాధ్యమయినంత వరకు ఇంటి ఆహారానికి ప్రాధాన్యమివ్వడం మంచిది. భుక్తాయాసంగా కాకుండా కాస్త వెలితిగా తీసుకోవడం ఉత్తమం.
6 . మధ్యాహ్న భోజనంలో నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోకుండా వాటిని దూరంగా ఉంచితే మంచిది. అవి పడని సందర్భాల్లో కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. పని చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని పండ్ల ముక్కలను వెంట తెచ్చుకుంటే సాయంత్రం స్నాక్స్‌కు బదులు అల్పాహారంగా తీసుకోవచ్చు. వాటి నుంచి పోషకాలు అందుతాయి. చక్కగా అరుగుతాయి.
7 . కంప్యూటర్ల ముందు గంటల తరబడి పనిచేసేవారు ప్రతి ఇరవై నిమిషాలకోసారి కళ్లు మూసి తెరుస్తూ ఉండాలి. దానివల్ల కళ్లు అలసటకు గురికాకుండా ఉంటాయి. ఇదో చక్కటి వ్యాయామం.
8 . కంప్యూటర్ల వల్ల శరీరానికి రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉండి చర్మం పొడిబారుతుంది. అందుకని సన్‌స్క్రీన్ లోషన్ వెంట పెట్టుకొంటే రెండుమూడు గంటలకోసారి రాసుకొంటే సరిపోతుంది. ఎలాంటి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తవు.
9 .ధూమపానము , మధ్యపానము ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడదు .
10 . రాత్రి భోజనము తొందరగా 8.00 గంటలలోపు తినెయ్యాలి. లేటుగా భోజనం చేయడం వల్ల నిద్రాభంగము కలుగును .
11 . రాత్రి 9.00 గంటల తర్వాత నీరు ఎక్కువగా త్రాగరాదు ... ఎక్కువసార్లు నీరుడై నిద్రకి భంగము కలుగును .
12 . రాత్రి నిద్రపోయే ముందు పళ్ళు బ్రెష్ తో తోముకోవాలి ...దీనివల్ల దంతక్షయము నివారించవచ్చును .
13 . రాత్రి బాగా లేటు అయ్యేంతవరకు టి.వి. చూడకూడదు . కళ్ళు ఒత్తిడికి లోనై ఉదయానికి నీరసమనిపించును ,
14 . బందువులు , స్నేహితులతో సరదాగా నవ్వుతూ గడపాలి . ఒత్తిడి తగ్గి ఆయుస్సు పెరుగును ,
15 .ఉదయాన్నే నిద్ర లేవగానే ఒకటి లేదా ఒకటిన్నర లీటరు నీళ్ళు త్రాగండి. అలా త్రాగటంవల్ల సుఖ విరేచనం అవుతుంది. సమస్త వ్యాధి వర్థకం మలబద్దకం అని మనవైద్యశాస్త్రం చెప్తుంది. సుఖ విరోచనం అవ్వటం అంటే అన్ని జబ్బులు నుండి విముక్తి పొందటమే.
16 . రోజుకు ఒక అర్థగంట లేదా 45నిమిషాల నడక ఆరోగ్యానికి అత్యంత అవసరం. ఉదయం నడక మన ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నీ వ్యాయామాలలో నడక అనేది చాలా సులువైన వ్యాయామం.రోజూ ఒకగంట వాకింగ్ చేయడం మూలంగా బిపి షుగర్‌ను కొంత వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యటం వల్ల గుండెపోటు అనేది దరిచేరదు. వాకింగ్ చేసేటప్పుడు మాట్లాడడం మానాలి.
17 . బలమైన ఆరోగ్యకర ఆహారాన్ని తీసు కోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌ను తినటం మానాలి. ప్రోటీన్లు, పీచు అధికంగా ఉండే ఆహారం తీసు కోవటం అత్యుత్తమం. మొలకెత్తిన విత్తనా లలో కొబ్బరి క్యారెట్‌లను తురిమి కొతిమీరతో కలిపి డేట్స్‌తో సహా అల్పాహారంగా తీసుకోవాలి. గోంగూర, తోటకూర, పాల కూర, బచ్చలికూర లేదా క్యారట్‌రసం సేవించటం చాలా మంచిది. ఆకుకూరలన్నింటిలో మునగాకు అత్యంత బలమైన ఆహారం అన్న విషయాన్ని మరువకూడదు.
18 .ఉప్పు అధికంగా తినటం వల్ల ప్రమాదం వుంటుంది. కనుక వాటిని తగ్గించాలి. అలాగే నూనె, వేడిపదార్థాలను ఎక్కువగా తినటం మానాలి. జంక్ పుడ్స్ అసలు తినకూడదు .
19 .ఆహారాన్ని ఎప్పుడూ కూడా బాగా నమిలి తినాలి. ఆదుర్ధాగా తినడం అజీర్ణానికి దారితీస్తుంది .
2 . అన్నంలో కూరకలిపే పద్ధతిని మాని, కూరలో అన్నం కలిపే అలవాటు చేసుకున్నట్లయితే అది ఆరోగ్యానికి చాలా మంచిది. కేలరీలు తక్కువగా ఉండి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.

0 Comments