అధరాల(పెదాల) అందం కోసము చిట్కాలు : -> ప్రతి జీవి అందము గా ఉండాలని అనుకుంటుంది . అందులో మానవులు సంగతి వేరేగా చెప్ప్ప్పనక్కరలేదు . శీతాకాలము కాలంలో పెదాలు పొడిబారి పగులుతుంటాయి. ఒక్కోసారి రక్తస్రావం కూడా అవుతుంది. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఇన్‌ఫెక్షన్ల బారిన పడాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే అందమైన అధర సౌందర్యం కోసం ఈ నియమాలు పాటించాలి.
పెదాలు పొడి బారినపుడు నాలుకతో తడిచేసుకోవడం చాలామందికి అలవాటు. కానీ దాని వల్ల చర్మం పొలుసులుగా వూడిపోతుంది. ఇంకా ఎక్కువ పొడి బారుతుంది. లిప్‌బామ్‌ను అందుబాటులో ఉంచుకొని తడారిన ప్రతిసారీ రాస్తుండాలి.
మృతకణాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. టూత్‌బ్రష్‌తో వలయాకారంలో మృదువుగా రుద్దాలి. దానివల్ల మురికి, జిడ్డు తొలగిపోయి పెదవులు తాజాగా కనిపిస్తాయి.
పంచదార లేదా ఉప్పుతో పెదాల మీద రుద్దినా మృతకణాలు తొలగిపోతాయి. అధరాలకు తేమ అందుతుంది. అయితే పెదవులకు పగుళ్లు ఉంటే మాత్రం ఈ ప్రయోగం చేయకపోవడం మంచిది.
వంటనూనెను మునివేళ్లతో తీసుకొని పెదాల మీద వలయాకారంలో మర్దన చేయాలి. పదినిమిషాల తరవాత వేణ్నీళ్లతో శుభ్రపరచుకుంటే మురికి తొలగిపోయి తాజాదనాన్ని సంతరించుకుంటాయి.
అర చెంచా వెన్నలో నాలుగు చుక్కల తేనె కలిపి అధరాలకు పట్టించి ఐదునిమిషాల పాటు మర్దన చేయాలి. తరవాత మెత్తని తువాలుతో తుడిచేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల పెదాలు అందంగా తయారవుతాయి.
కొబ్బరిపాలు, గులాబీనీళ్లు, ఆలివ్‌నూనె సమపాళ్లలో తీసుకొని పెదవులకు పట్టించాలి. ఫలితంగా పగుళ్లు, ఇన్‌ఫెక్షన్లు దరిచేరకుండా.. ఆరోగ్యంగా కనిపిస్తాయి.
రాత్రిపూట పెట్రోలియం జెల్లీని రెండుసార్లు పూతగా పూసి అలా వదిలేయాలి. దానివల్ల పెదవులకు తేమ అందుతుంది.
గుప్పెడు గులాబీ రేకలు కప్పు పాలలో నానబెట్టి.. మర్నాడు మిక్సీలో వేసి మెత్తని ముద్దగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో భద్రపరిచి తరచూ పెదాలకు రాస్తుంటే నలుపు రంగు తగ్గి.. క్రమంగా ఎర్రగా మారతాయి.
రాత్రిపూట పాలమీగడతో పెదాలను బాగా రుద్ది.. కడిగేయకుండా అలా వదిలేస్తే పెదాలకు తేమ అందుతుంది. పొడిబారకుండా ప్రకాశవంతంగా తయారవుతాయి.
కీరదోస కళ్లకే కాదు పెదాలకూ మేలు చేస్తుంది. ముక్కలుగా తరిగి.. వీలున్నప్పుడల్లా పెదాలకు రుద్దుతూ ఉండాలి. అవి పెదాలను మృదువుగా తయారుచేస్తాయి.
చెంచా తేనెకు నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి పూత వేయాలి. తేనెకు ఉండే మాయిశ్చరైజింగ్ గుణం పెదాలకు మేలు చేస్తుంది. అలాగే అలాబీ రేకలను ముద్దగా చేసి.. దానికి నాలుగు చుక్కల గ్లిజరిన్ కలిపి పెదాలకు తరచూ పూత వేస్తుంటే పగుళ్లు తగ్గిపోతాయి.
అరకప్పు నీళ్లలో చెంచా ఉప్పు వేసి దాన్లో దూదిని ముంచి అధరాలకు రుద్దితే వాటికి తేమ అందుతుంది. విటమిన్ 'ఇ' మాత్రలో ఉండే పదార్థాన్ని రాసినా చక్కటి ఫలితం ఉంటుంది.
0 Comments