మన శరీరములో లివర్ (Liver in our body)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
కాలేయం శరీరంలో ఉండే అవయవాలలోకెల్లా (చర్మము తరువాత) పెద్ద అవయవం. శరీరంలో అన్ని రకాల సౌకర్యాలతో కూడిన జీవ రసాయన ప్రయోగశాలగా దీనిని అభివర్ణించవచ్చు. కార్బొ హైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవ ణాలు మొదలైన వాటి జీవక్రియను ఇది నిర్వహిస్తుంది. అలాగే శరీరంలో ఉష్ణశక్తిని ఉత్పత్తి చేసే అవయవంగా పని చేస్తుంది.
కాలేయం ఉదరభాగంలో కుడివైపు పైభాగంలో ఉంటుంది. గర్భస్థ శిశువులో దీని పరిమాణం పెద్దల్లో కంటే ఎక్కువగా ఉంటుంది. దీనిలో కుడి, ఎడమ ప్రక్కల రెండు లోబులు ఉంటాయి. ప్రతి లోబులోనూ అనేక చిన్న లోబులుంటాయి.
చివరి వరకూ పెరిగే అవయవం కాలేయం--కడుపులో కోన్ ఆకారంలో, ముదురు ఎరుపు రంగులో, మెత్తగా ప్రకాశిస్తూ స్పాంజ్‌లా ఉండే కాలేయం ఎవరికైనా శరీర బరువులో 2-3% మధ్యలో ఉంటుంది. కడుపులో కుడిభాగాన, ఉదర వితానం కింద ఉరః పంజరంలో ఉంటుంది.
కాలేయ నిర్మాణం
కాలేయానికి రెండు లోబ్స్ ఉంటాయి. ఒక్కో భాగంలోనూ మళ్ళీ నాల్గేసి విభాగాలుంటాయి. వీటిని ‘సెగ్మెంట్’ అంటారు. ఒక్కో సెగ్మెంట్ విడివిడిగా ఉండగల్గుతుంది. ఎలాగంటే ప్రతీదానికీ రక్తం లోపలికి వెళ్ళే రక్తనాళాలు, బయటకు రక్తాన్ని తీసుకొచ్చే రక్తనాళాలు వేరువేరుగా ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్పాంటే ఒక అపార్ట్‌మెంట్‌లో ఎనిమిది ఫ్లాట్లు ఉన్నట్లు ఎనిమిది వేరువేరు సెగ్మంట్‌లో కాలేయముంటుంది. ఏ ఫ్లాట్‌కి ఆ ఫ్లాట్‌కి నీటి సరఫరా లోపలికి, మురుగు బయటకు వెళ్ళే ఏర్పాటున్నట్లు కాలేయ ప్రతి సెగ్మంట్‌కి రక్త ప్రసరణ చేసే, తిరిగి వెనక్కి తెచ్చే నాళాలున్నాయి. ఇలాంటి నిర్మాణం ఉండడం వల్లే కంతులు లాంటివి ఏమైనా వస్తే కాలేయంలో ఆ భాగాన్ని తొలగించగల్గుతున్నారు. అలాగే బతికున్నవాళ్ళు దగ్గర బంధువులకు కాలేయంలో కొంతభాగాన్ని దానం చేయగల్గుతున్నారు. కాలేయంలో మూడవ వంతున్నా అది చేసే పనులన్నీ చేయగల్గుతోంది. అలాగే రెండు, మూడు నెల్లో అది మామూలు పరిమాణానికి పెరగగలదు.
కాలేయ ప్రత్యేకతలు
కాలేయంలో 70% దెబ్బతిన్నా మిగిలిన భాగం అన్ని పనుల్నీ నిర్వర్తించగలదు. చనిపోయే వరకూ పెరిగే ఏకైక అవయవం కాలేయం. మూడో భాగం మిగిలి మిగతాది తెగిపోయినా, రెండు నెల్లో ఉన్న కాలేయం పూర్తి స్థాయికి పెరుగుతుంది.
కాలేయ అనారోగ్యాలు
కాలేయ సింథటిక్ ఫంక్షన్ దెబ్బ తినడంతో రక్తస్రావం, కామెర్లు, ఎన్‌కెఫలోపతి లాంటి అనారోగ్యాలు కలుగవచ్చు. విసర్జన పని దెబ్బ తినడంతో కామెర్లు పుట్టుకతో రావచ్చు. బలియరీ ఎట్రేషియా అంటారు. లేకపోతే పెద్దయిన తర్వాత గాల్‌స్టోన్స్, కంతులు రావచ్చు. వీటిని తొలగించడానికి లాప్రోస్కోపిక్ సర్జరి చేయాల్సి రావచ్చు. సిర్రోసిస్ వల్ల రక్తప్రసరణలో అడ్డంకులేర్పడితే ‘పోర్టల్ హైపర్‌టెన్షన్’ కలుగవచ్చు. రక్తవాంతులు కావచ్చు, కడుపులో నీరు చేరడాన్ని ఎసైటిస్ అంటారు.
కాలేయంలో బైల్ అనే జీర్ణరసం తయారవుతుంది. ఈ రసం కాలేయ నాళాల ద్వారా పిత్తాశయంలోకి చేరుతుంది. అక్కడ చిక్కగా తయారై, పిత్తాశయ నాళాల ద్వారా చిన్న ప్రేవుల్లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఇది తోడ్పడుతుంది. ఈ బైల్‌తోపాటు క్లోమ రస గ్రంథినుంచి వచ్చే స్రావాలతో కలిసి ఆహార పదా ర్థాలు జీర్ణమవుతాయి.శరీరానికి కావలసిన పదార్థాలు ప్రేవుల ద్వారా పీల్చుకుని రక్తంలో కలిసి పోర్టల్ సిరల ద్వారా కాలేయానికి చేరుతాయి. ఈ పదార్థాలు (కార్బొహైడ్రేట్లు, ప్రోటీనులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు) కాలేయంలో జరిగే జీవక్రియ ద్వారా శరీరశక్తిని, ఉష్ణశక్తినిఉత్పత్తి చేయడానికి ఉపయోగ పడతాయి.
కాలేయం విధులు
*గర్భంలోని శిశువులో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడం, పెద్దలలో ఎర్ర రక్త కణాలను విచ్ఛిన్నం చేయడం.
*శరీరంలోని రక్తాన్ని నిలువఉంచడం,క్రమబద్దీకరించడంరక్త గడ్డ కట్టడానికి విటమిన్ కె ద్వారా ప్రోత్రాంబిన్, ఫైబ్రి నోజెన్‌లను ఉత్పత్తి చేయడం.
మాస్ట్ కణాల ద్వారా హెపారిన్‌ను ఉత్పత్తి చేసి రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టకుండా సహాయపడటం.
రెటిక్యులో ఎండోథీలియల్ (ఆర్‌ఇ) వ్యవస్థ ద్వారా ఇమ్యూన్ మెకానిజంలో పని చేయడం
పోర్టల్ ధమనుల ద్వారా వచ్చిన రక్తాన్ని శరీరంలో ప్రవ హించే రక్తంలో కలపడంప్లాస్మా ప్రొటీన్లను ఉత్పత్తి చేయడం.
ఎర్ర రక్త కణాలు, హీమోగ్లోబిన్ తయారీకి కావలసిన ఇనుప ధాతువు, విటమిన్ బి12, రాగి ధాతువులను నిలువ చేయడం .
కాలేయం నిముషానికి 75 మి.లీ. లింఫును ఉత్పత్తి చేస్తుంది. దీనిలో ప్రొటీను 90 శాతం ఉంటుంది. కాలేయానికి సబంధించిన లింఫు నాళాల ద్వారా ప్రతి 24 గంటలలో 40 శాతం ప్లాస్మా ప్రొటీన్లు రక్తంలోకి చేరుతాయి.
పిత్త రసము తయారీకి ఉపయోగపడటం.
కార్బొహైడ్రేట్లను గ్లయికోజెన్ రూపంలో నిలువ ఉంచడం.
శరీరంలోని గ్లూకోజ్‌ను నియంత్రించడంకార్బొహైడ్రేట్లనుంచి కాకుండా ఇతర పద్ధతుల ద్వారా గ్లూకోజును తయారు చేయడం,
కొవ్వు పదార్థాలను కార్బొహైడ్రేట్లునుంచి తయారు చేయడం.
మద్యం (ఆల్కహాల్) మెటబాలిజానికి ప్రధాన స్థానంగా వ్యవహరించడం.
కొవ్వు పదార్థాలను నిలువ చేయడంఆమ్లజనీకరణ (ఆక్సిడేషన్) అనే ప్రక్రియ ద్వారా కొవ్వు నుండి అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ (ఎటిపి) అనే శక్తిని ఉత్పత్తి చేయడం.
ఎసిటేట్‌నుంచి కొలెస్టరాల్‌ను, కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లనుంచి కొవ్వు పదార్థాలను, ఫాస్ఫోలిపిడ్స్‌ను ఉత్పత్తి చేయడం.
కీటోన్‌పదార్థాలను ఉత్పత్తి చేయడం.విటమిన్ ఎ, డి, ఇ, కెలను నిలువ చేయడం.
డీ అమైనేషన్‌కు ప్రధాన కేంద్రంగా వ్యవహరించడం, యూరియా, యూరిక్ యాసిడ్‌ల ఉత్పత్తి, కొన్ని అమైనో యాసిడ్‌ల తయారీకి, ప్లాస్మా ప్రొటీన్ల (ఇమ్యునోగ్లోబిన్ కాకుండా మిగిలినవి) తయారీకి తోడ్పడటం.
హార్మోన్లు,విటమిన్‌లమెటబాలిజంలో తోడ్పడటం.
భారీ లోహ పదార్థాలు, ఎక్కువ సాంద్రత కలిగిన ఖనిజా లను, బ్యాక్టీరియా, కొలెస్టరాల్, బైల్ పిగ్మెంట్లు, బైల్‌ను పిత్తం లోకి విసర్జించడం.
శరీరాన్ని దెబ్బతీసే విషపదార్థాలను, మందులను ఆక్సిడే షన్, హైడ్రాలిసిస్, రిడక్షన్, కాంజుగేషన్ ప్రక్రియల ద్వారా నాశనం చేయడం,
శరీరంలోని ఉష్టాన్ని క్రమబద్ధీకరించడం.
కాలేయం పైన పేర్కొన్న విధులను నిర్వర్తిస్తుంది. కాలేయా నికి సమస్య ఏర్పడినప్పుడు మనిషి అనేక ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుంది.
0 Comments