Full Style

>

ఒంటరితనం-అనారోగ్యమము ,Loneliness and illhealth


ఒంటరితనం-అనారోగ్యమము (Loneliness and illhealth)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదు ... తాజా పరిశోధనలు చెబుతున్నాయి. మనిషి మనిషికీ మనసులు వేరువేరుగా ఉంటాయి. మమతలు పంచుకోవడం ద్వారా మనిషి రీతి లో మార్పులు చోటుచేసుకునే అవకాశముంటుంది . మానసిక రుగ్మతలకు దూరముగా ఉండవచ్చును .

పొగ తాగడం, ఉబకాయం రావడం వల్ల ఆరోగ్యానికి ఎంత హాని జరుగుతుందో ఒంటరితనం వల్ల కూడా అంతే హాని జరుగుతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా ఉండే వ్యక్తులు అశాంతిగా ఉండటం వల్ల వారి మెదడు తీవ్ర ప్రభావానికి లోనవుతుందని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. ఫలితంగా ఒత్తిడి స్థాయి పెరగడంతో పాటు, రక్త పోటు కూడా ఎక్కువవుతుందనీ, మెదడులో కణాలు క్షీణించి అల్జిమర్స్‌ వ్యాధికి గురయ్యే అవకాశం కూడా ఉందని పరిశోధకులు అంటున్నారు. ఒంటరిగా ఉండే వ్యక్తులలో దృఢ సంకల్పం, పట్టుదల, ధైర్యం వగైరాలు క్షీణిస్తాయని ఈ పరిశోధనల్లో తేలింది. ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన షికాగో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జాన్‌ కాసియొప్పో మాట్లాడుతూ, ఒంటరిగా ఉండే వ్యక్తికి, మామూలుగా అందరితో పాటు కలిసి ఉండే వ్యక్తికి మధ్య వ్యత్యాసం, పొగ తాగేవాడికి, తాగనివాడికి మధ్య ఉన్నంత తేడా ఉంటుందని చెబుతున్నారు.

ఒంటరితనం వల్ల వారి ప్రవర్తనా తీరు మారడంతో పాటు, రక్త సరఫరా వ్యవస్థపైన కూడా ప్రభావం చూపుతుందనీ, రక్తపోటు ఎక్కువై మనిషి తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోతాడని కాసియొప్పో చెప్పారు. ఒంటరితనంతో బాధ పడేవారు తక్కువ ఆరోగ్యంతో ఉంటారనీ, ఎక్కువగా ఆహారం తీసుకుంటారని, చెప్పారు. ఇలా ఉండే వారికి వారిపై వారికే నియంత్రణ ఉండదని చెప్పారు. మన సమాజంలో సంప్రదాయ వ్యవస్థ క్రమేణా తెరమరుగు కావడం వల్లే చాలామంది ఒంటరితనంతో బాధ పడుతున్నారని అన్నారు. ఒంటరితనం అనేది మనిషిలో అనేక రోగాలకు దారితీయటమే కాకుండా, వారిపై వారికే నియంత్రణ లేని విధంగా తయారు చేస్తుంది. కనుక 'నలుగురికీ నచ్చినది నాకసలే ఇక నచ్చదురో'..అంటూ ఎవ్వరినీ పట్టించుకోకుండా నలుగురితో కలిసి మెలిసి ఉండకుండా ఒంటెత్తు పోకడలతో బతికేసే వారు కొందరుంటారు. మరి కొందరు పదిమందిలో ఉన్నా ఒక్కడిగా ఉన్న ఫీలింగ్‌తో ఉంటారు. ఒక్కడిగా బతికే వాడిని ఈ ప్రపంచం ఒంటి పిల్లి రాకాసి అంటూ వెక్కిరిస్తుంది. దేశం కాని దేశంలో, ఎవ్వరూ లేని ప్రాంతంలో, నైరాశ్యం ముంచుకొచ్చిన సమయంలో. విషాదం విరుచుకుపడినపుడు ఒంటరితనం కమ్ముకుంటుంది. జీవితంలో చిత్తుగా దెబ్బతిన్న వారు, ప్రేమలో ఘోరంగా విఫలమైన వారు, కష్టాలతో మనసు నలిగి పోయిన వారు ఒంటరితనాన్ని బలంగా కోరుకుంటారు.

Post a Comment

0 Comments