అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. అదేపనిగా కూచోవటానికీ ఇది వర్తిస్తుందని మీకు తెలుసా? విశ్రాంతి సమయాల్లోనైనా ఎటూ కదలకుండా అదేపనిగా గంటల తరబడి కూచోవటం మంచిది కాదని తాజా అధ్యయనంలో వెల్లడైంది మరి. దీంతో త్వరగా మరణం ముంచుకొచ్చే ప్రమాదమూ ఉంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ శాస్త్రవేత్తలు దాదాపు 1.20 లక్షల మందిని పరిశీలించి ఈ సంగతిని గుర్తించారు.
విశ్రాంతి సమయాల్లో రోజుకి మూడు గంటల సేపు కూచునేవారితో పోలిస్తే.. ఆరు గంటల పాటు కూచునే వారు ముందే మరణిస్తున్నట్టు అధ్యయనంలో బయటపడింది. ఇది పురుషుల్లో కన్నా మహిళల్లోనే ఎక్కువగా ఉంటోంది కూడా. శారీరక శ్రమ, బాడీమాస్ ఇండెక్స్, పొగ తాగే అలవాటు వంటి వాటితో ప్రమేయం లేకుండానే ఇది సంభవిస్తుంటం గమనార్హం. ఎక్కువసేపు కూచోవటం వల్ల అధికంగా తినటం వంటి అనారోగ్యకర అలవాట్ల బారినపడే ఆస్కారముంటుందని, వీటివల్లే మరణం ముప్పు ముంచుకు వస్తుండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాగే జీవక్రియల దుష్ప్రభావాలు కూడా ఇందుకు దోహదం చేస్తుండొచ్చని చెబుతున్నారు. అందుకే రోజు మొత్తమ్మీద కూచునే సమయాన్ని తగ్గించటం, శారీరక శ్రమను ప్రోత్సహించటం అవసరమని సూచిస్తున్నారు.
కదలకుండా కూరునినే చేసే ఉద్యోగాలయితే " కడుపులో చల్ల కదలకుండా ఉంటాయని " గతం లో పెద్దలు అనేవారు . చల్ల కదలకపోవడము , కదడాల సంగతి పక్కన పెడితే కొవ్వుపేరుకు పోవడము మాత్రం ఖాయము . చేసే వృత్తి ఉద్యోగాలమీద మహా ప్రేమవున్న వారు సైతము అలాడెస్క్ లకు అతుక్కుపోయి కూర్చోకూడదని పరిశోధకులు పేర్కోంటున్నారు . ఇలా గంటల కొద్దీ కదలకుండా కూర్చుండిపోతే ఆరోగ్యము పాడౌతుంది .
45 -65 సం.రాల నడుమగల 63 వేలమంది పై విస్తృత అధ్యయనాలు నిర్వహించారు . 4 గంటల్కకంటే తక్కువ , 4-6 గంటలు , 6-8 గంటలు , 8 గంటలు కంటే ఎక్కువ కూర్చునే స్థితిగతులపై అధ్యయనము చేసారు. ఎక్కువసేపు కూర్చునే వారిలో దీర్ఘకాలిక వ్యాధులు పెరిగినట్లు గుర్తించారు. 6 గంటలు కూర్చున్నచోటనిండి కదలకుండా ఉన్నవారికి డయాబిటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ . ఇక 8 గంటలు కూర్చునే వారికి రిష్క్ మరీ ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. ఇది ఆఫీషులో కూర్చున్నవారికే కాదు గంటలకొద్దీ డ్రైవింగ్ చేసే వారికీ వర్తిస్తుంది . శారీరంగా తక్కువ చురుకుదనము గలవారికి , చురుకుదనము ఎక్కువగా గలవారికంటే దీర్ఘాకాలిక వ్యాధులు వచ్చే అవకాశము ఎక్కువ కావున వీలైనన్ని సార్లు కూర్చున్నచోటనుండి లేచి అటూ ఇటూ కొన్ని నిముషాలు నడవడము ముఖ్యము .
కూర్చునే సమయము దీర్ఘ్కాలికవ్యాధులు పెరగడానికి కారణమవుతాయా, వ్యాధులు కూర్చునే సమయాన్ని ప్రభావితం చేస్తాయా అన్నది పరిశోధకులు స్పస్టముగా పేర్కొనలేదుగాని , మొత్తము మీద ఈ రెండింటికి లింక్ ఉన్నట్లు నిర్ధారించారు .
నివారణోపాయాలు :
మధ్య మధ్యలో లేచి , ప్రతిగంటకు ఒకసారి 2-3 నిముషాలు అటు ఇటూ తిరగాలి ,
ఎలివేటర్ కు బదులుగా మెట్లు ఎక్కాలి ,
ఆఫీషుకు మరీ దూరము కాకపోతే నడిచి వెళ్ళాలి,
కొన్ని సింపుల్ డెస్క్ ఎక్సరసైజ్ లు అనగా మన ఫీల్స్ మనమే మోసుకోవడము , మనకు కావలసినవి మనమే తెచ్చుకోవడము , మన బెంచీని , కుర్చీని, టేబుల్ ని మనమే క్లీనింగ్ చేసుకోవడము మున్నగు పనులు చేసుకోవాలి .
0 Comments