ఊపిరితిత్తుల క్యాన్సర్(Lung cancer) గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
-ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రతిఏటా 12 లక్షల మంది గురవుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ప్రతి 30 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారు. అభివృద్ది చెందిన దేశాల్లోనే కాకుండా భారతదేశం వంటి అభివృద్ది చెందుతున్న దేశాల్లో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకే వారి సంఖ్య ఆందోళన కలిగించే రీతిలో పెరుగుతుండడం విచారకరం.ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో రెండు ప్రధాన రూపాలున్నాయి. మొదటిది స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ (ఎస్‌సిఎల్‌సి), రెండవది నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ (ఎన్‌ఎస్‌సిఎల్‌సి). ఊపిరితిత్తులకు సోకే క్యాన్సర్లన్నింటిలో 80 శాతం కేసులు ఎన్‌ఎస్‌సిఎల్‌సి రకానికి చెందినవి. అవి ఎడినో కార్సినోమా, స్క్వామాసెల్ కార్సినోమా, లార్జ్‌సెల్ కార్సినోమా, బ్రాంకో అల్వియోలార్ కార్సినోమా.
లక్షణాలు...
వ్యాధి తీవ్రమయ్యే వరకూ లక్షణాలు స్పష్టం కావు కనుక ఈ వ్యాధికి చికిత్స చేయడం కష్టమైన పని. ఈ వ్యాధితో బాధపడేవారిలో కనిపించే కొన్ని లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
* ఎడతెగని దగ్గు
* గొంతు బొంగురు పోవడం
* దగ్గుతున్నప్పుడు నోటి నుంచి రక్తం పడడం
* బరువు కోల్పోవడం
* సరైన కారణం లేకుండా ఆకలి తగ్గిపోవడం
* హ్రస్వ శ్వాస
* కారణమేమీ లేకుండా జ్వరం రావడం
* శ్వాసలో పిల్లికూతలు
* శ్వాస నాళాల వాపు లేదా న్యుమోనియా పదేపదే వస్తుండడం
* ఛాతి నొప్పి
ఊపిరితిత్తుల కణాలు విపరీతమైన స్థాయిలో పెరిగి ఊపిరితిత్తులను విధ్వసంసం చేసే వ్యాధి ఇది. ఈ కణాలు మామూలు కణాల కంటే మరింత త్వరగా పునరుత్పత్తి అయి ఒక కంతిగా ఏర్పడుతుంది. ఊపిరితిత్తుల్లో మొదట ఒక కంతి మాత్రమే ఏర్పడితే దానిని ప్రాథమిక కంతి అంటారు. విపరీతమైన కణాలు ఈ కంతిని విచ్ఛిన్నమయ్యేలా చేసి రక్త ప్రసరణ ద్వారా శరీరంలోని ఇతర భాగాల్లోకి వ్యాపిస్తే అక్కడి అవయవాల్లో కూడా పెరగడం ఆరంభమవుతుంది.
ఈ ప్రక్రియను మెటాస్టేసిస్ అని అంటారు. అక్కడ ఏర్పడే కంతిని రెండవ కంతి అంటారు. రోగి జీవించి ఉండే తీరు వ్యాధి ఏ దశలో ఉందనే అంశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే ఏ రకమైన చికిత్స ఇస్తున్నారనే అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే ఏ రకమైన చికిత్స ఇస్తున్నారనే అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. క్యాన్సర్ తొలిదశలోనే వ్యాధిని నిర్ధారించి చికిత్స ఆరంభిస్తే రోగులు కనీసం అయిదేళ్లు జీవించి ఉంటారు. దురదృష్టవశాత్తు చాలా మందిలో వ్యాధిని తొలి దశలోనే గుర్తించడం సాధ్యం కాదు.
వ్యాధిని గుర్తించే సరికే అది మరొక భాగానికి వ్యాపించి ఉంటుంది. ఈ దశలో అయినా గుర్తించి చికిత్స చేస్తే 5 శాతం మంది రోగులు అయిదేళ్ల వరకూ జీవించి ఉండగలుగుతారు. 15 నుంచి 35 శాతం మంది ఒక ఏడాది పాటు జీవిస్తారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను వృద్ధి చేయగల అత్యంత పెద్ద ప్రమాదకర అంశం ధూమపానం. ప్రతి 10 ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసుల్లో 9 కేసులు ఈ కోవలోకి చెందినవే. ఎన్నాళ్ల నుంచి పొగ తాగుతున్నారు... ఎన్ని సిగరెట్లు కాలుస్తున్నారు...అనే పలు అంశాలపై వ్యాధి తీవ్రత ఆధారపడి ఉంటుంది.
చికిత్స :
ఊపిరి తిత్తుల క్యాన్సర్ ని
surgery ,
radiation ,
chemotherapy ,
palliative care
అనే నాలుగు విధాల్లో ఒకదానిని ఎంచుకోని గాని రెండు , మూడు విధానాలు కలిపి గాని చేస్తుంటారు . పూర్తిగా నయము అయ్యే అవకాశాలు చలా తక్కువా ఉంటాయి. ముఖ్యము గా భాద నివారణ , వ్యాధి పెరుగుదల ఆపడము , కొద్దిగా జీవితకాలము పొడిగింపు కోసమో ప్రయత్నాలు చేస్తూఉంటారు .
ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగి రక్తంలోని కణతి కణాలు లెక్కించడం వల్ల వ్యాధి తీవ్రత నిర్ధారించొచ్చు. దీని వల్ల మెరుగైన చికిత్స అందించే వీలుందని బ్రిటీష్ శాస్త్రవేత్తలు అంటున్నారు. లెక్కించడానికి కొత్త సులభమైన పరిజ్ఞానం తోడ్పడుతుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న నిర్ధారణ ప్రక్రియ 'బ్రాంకోస్కొపి'. ఇది ఒక్కసారే చేసే వీలుండడం. దీనికన్నా మెరుగైన పద్ధతిలో కొత్త పరిజ్ఞానాన్ని ఛారిటీ క్యాన్సర్ రీసెర్చ్, యుకె పరిశోధకులు అభివృద్ధి చేశారు. కణితి కణాలను లెక్కించి వాటిని విశ్లేషించడం వల్ల వ్యాధి ఎలా వృద్ధి చెందుతుందో తెలుసుకునే అవకాశాలున్నాయి మరణానికి దారితీసే వాటిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రముఖమైంది. ఈ వ్యాధి చికిత్సకు కొత్త వైద్య విధానాల అవసరం ఉందని ఛారిటి డైరెక్టర్ డాక్టర్ లెస్లి వాకర్ చెప్పారు. రక్తంలో ప్రవహించే అరుదైన కణతి కణాలను గుర్తించి లెక్కించడం, వ్యాధి అభివృద్ధిని తెలుసుకోవడం కొత్త పరిశోధనకు నాంది అని' వాకర్ పేర్కొన్నారు. 'ఇప్పుడు మేం వ్యాధికి సంబంధించి రహస్యంగా ఉన్న జన్యులోపాలను పరిశీలిస్తున్నాం. దీని లక్ష్యంగా కొత్త మందులను వృద్ధి చేసి చికిత్స చేసే ప్రయత్నంలో ఉన్నాం' అని వాకర్ తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 12 లక్షల మంది చనిపోతున్నారు. ఈ క్యాన్సర్ వచ్చినవారు బతికి బయటపడే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే చాలా మందిలో వ్యాధిని ఆలస్యంగా గుర్తిస్తున్నారు. చివరి దశలో చికిత్స అంతగా ఫలితాలను ఇవ్వడం లేదు.

0 Comments