వైద్యము లో ప్రతి రోగము వెంటనే నయము చేసుకోవడము అవసరమే అయినా... కొన్ని వ్యాదులు వెంటనే తగిన చికిత్స చేయకపోతే ప్రాణాలు పోతాయి లేదా జీవితాంతము బాధతోను , ఆ జబ్బుతోను , ఆ జబ్బు మిగిల్చే శేషాలతోను బ్రతకవలసి ఉంటుంది . ఆ కోవలో ముఖ్యమైనవి ....
గుండె పోటు(Heart attack) ,
పక్షవాతము (Paralysis),
కాలిన గాయాలు(Burns) ,
శ్వాసించడము లో ఇబ్బంది (ఉబ్బసము - Asthma),
పాముకాటు (snake bite)
గుండెపోటు--
అంటురోగాలు , ఇతర రొగాలకన్నా గుండె జబ్బులు ప్రమాదకరమైనవి . తక్షణము వైద్య సహకారము అవసరమైనవి . నేడు సాధారణ గుండెజబ్బులను గుండెపోటు , గుండె ఆగిపోవడము , ఎక్యూట్ మయోకార్డియల్ ఇంఫ్రాక్షన్ అంటాము . శరీరము లో అంగాలన్నింటిలో కీలకమైనది గుండె . శరీర భాగాలన్నింటికి అవసరమైన రక్తాన్ని సమర్ధవంతము గా పంప్ చేసే అంగం గుండె .అటువంటి గుండెకండరాలకు తగినంత ఆక్షిజన్ సరఫరా అవనపుడు క్రమముగా గుండె కండరాలు దెబ్బతిని తెలియకుండానే గుండెపోటు తెస్తుంది .
గుండె పోటుకు కారణాలు :
ముఖ్యమైనవి -- ఎథెరొస్క్లిరోసిస్ , ఆర్టీరియో స్క్లిరోసిస్ , రక్తనాళాలలోపల ఏర్పడిన గార (ఎథిరోమ ). నస్టపరిచే ఇతర కారణాలు -- పొగతాగడము , హైపర్ లిపిడీమియా , ఒత్తిడి , అధిక స్థాయి కొలెస్టిరాల్ , అధిక రక్తపోటు , మధుమేహము , భారీకాయము .
లక్షణాలు : గుండెపోటు లేదా మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్ కు హెచ్చరిక చాతి నొప్పి . ఆ నొప్పి సాధారణము గా పిండినట్లు గా ఉంటుంది . చాతీ బిగుసుకున్నటువంటి భావన లేదా బాగా ఒత్తిడి పడుతున్న భావన . సధారణము గా ఆ నొప్పి చాతీనుండి విస్తరిస్తుంది. ఎడమ చేతివైపుకు నొప్పి విస్తరణ సాధారణమైనప్పటికీ కింది దవడ , మెడ , కుడిచెయ్యి , వీపుకు విస్తరిస్తుంది . కడుపులో మంటను పోలిన బాధ కలుగుతుంది.
ఇతర లక్షణాలు : ఊపిరి అందకపోవడము , తీవ్రము గా చెమట పట్టడము , తల తేలిపోవడము , గుండెదడ , నీరసము , కడుపులో తిప్పడము , తలతిరగడము లేదా స్పృహ కోల్పోవడము .
గుండెపోటుకు ప్రాధమిక చికిత్స : గుండె పోటు వచ్చినవారిలో పైన చెప్పిన లక్షణాలు , సంకేతాలు కనిపిస్తాయి. వాటిలో తీవ్ర చాతీనొప్పి తట్టుకోలేనిది . అటువంటివారిని హాస్పిటల్ కి తరలించేలోగా సమయము వృధాచేయక ప్రాధమిక చికిత్స అందించాలి . గుండెపోటు కేసుల్లో సమయము చాలా కీలకము .ఆలస్యమైతే గుండె కండరము దెబ్బతింటుంది . చేయవలసినవి ...*అత్యవసర సర్వీస్ నంబర్ కి ఫోను చేయడం , *రోగి దుస్తులను వదులు చేయడము , *రోగిని కంగారు పెట్టకుండ ధైర్యము చెప్పడము , *కొంచము వంగి కూర్చున్న భంగిమ ను ఏర్పాటు చేయడము ,* అనవవసర కదలికలు చేయకూడదు , *శ్రమపడితే ఆక్షిజన్ పెట్టే సదుపాయము చేయడము , *వెంటనే హృద్రోగ నిపుణులున్న హాస్పిటల్ కి తరలించడము ... ముఖ్యమైనవి . దొరికితే .. సార్బిట్రేట్ మాత్ర నాలుక కింద పెట్టడము చేయాలి .
పక్ష వాతము
మనిషి బ్రతికే ఉంచి అచేతనం గా ఉండే విచిత్ర స్థితి . శరీరము లో ఒక భాగము కాని , సగము కాని , పూర్తిగా కాని తమ కదేలే శక్తిని సంపూర్ణము గా కోల్పోతే దాన్ని పక్షవాతము (paralysis) అంటారు . ఇది వస్తే ఆ భాగము స్పర్శ , కదలిక ఏమీ ఉండవు . శరీరం అంతా బిగుసుకుపోవడం, మూతి అష్టవంకరలు తిరిగిపోవడం, కాళ్ళు చేతులు వెనుతిరగి పోవడం, ఒక్కోసారి గుండె కూడా పనిచేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అవయవం పై పక్షవాతం ప్రభావం ఏదో విధంగా తెలియ కుండా కనిపిస్తుంది.
ఏ కారణాల వల్ల వస్తుంది :
స్ట్రోక్ : ఈ స్ట్రోక్ లో మెదడుకి రక్త ప్రసారము ఆగిపోతుంది .. . దానివల్ల మెదడు లో జీవకణాలు చచ్చిపోతాయి . ఈ స్థితి రెండు రకాలుగా ఉంటుంది .
ఒక దానిలో మెదడకు వెళ్ళే రక్తనాళాలలో రక్తము గడ్డకట్టడం .... దీన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాము .
రెండవది .. మెదడు లోని రక్తనలలో వత్తిడి పెరిగి పగిలి రక్తస్రావము జరగడం ... దీన్ని " హెమరేజిక్ స్ట్రోక్ అంటాము .
ఏది ఏమైనా మెదడులోని కొన్ని కణాలూ చనిపోవడం వలనే ... ఆ సంభదిత అవయవాలు చచ్చుబడి పక్షవాతము వస్తుంది
కాలిన గాయాలు--
కాలిన గాయాలు--కాలిన గాయాల వలన ఏర్పడే బాధ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మనిషిని కుంగదీస్తుంది. కాలిన గాయాలకు వాటి స్వభావాన్ని బట్టి, గాయం తీవ్రతను బట్టి చికిత్స పొందాల్సి ఉంటుంది.
చెయ్యవలసినవి
*మంట ప్రభావాన్ని ముందుగా ఆపండి .*మంటనుండి మనిషిని బయటకు లాగడము లేదా మందమైన దుప్పటి తో కప్పి మంటలను ఆపాలి .*ప్రమాదము నుండి రోగిని దూరము గా తీసుకు వెళ్ళాలి .* కాలిన ప్రదేశము లో దుస్తులు లేదా నగలను తొలగించాలి . *కాలిన 20 నిముషాలలోపే ప్రభావితమైన శరీర భాగాలను చల్లని తేదా గొరువెచ్చని నీటితో10-30 నిముషాలు చల్లబరచాలి . * చర్మానికి తగలకుండా తెల్లటి పలుచని గుడ్డతో కపాలి. * హాస్పిటల్ కి వీలైనంత త్వరలో తీసుకు వెళ్ళాలి .
చెయ్యకూడనివి --
* ఐస్ లేదా ఐస్ నీళ్ళు లో కడగడం గాని తుడవడం గాని చేయవద్దు . * క్రీమ్స్ లేదా వెన్న వంటివి రాయడను , సిరా (పెన్ను ఇంక్ )లాంటివి పోయడము చేయవద్దు .
0 Comments