అల్లోపతీ , Allopathy
ఎల్లోపతీ (Allopathy):దీనిని నవీన వైద్య విధానమందురు. మొట్టమొదట హోమియో వైద్యులైన డా.సామ్యూల్ హనిమాన్ ఈ పదాన్ని వాడేరు. ఈ వైద్య విధానములో ఒక వ్యక్తికి జబ్బు వలన కలిగే బాధలను అణచి వేయుటకు(To suppress)మందులను వాడేవిధానమని ఆయన ఉద్దేశము. ఇది హోమియో వైద్యవిధానానికి వ్యతిరేక ప్రక్రియ. ఉదాహరణకి జ్వరము తగ్గడానికి ఉష్ణోగ్రతను తక్కువచేసే 'పారసిటమాల్ 'ను అల్లోపతి లో వాడుతాము. ఈ పరసిటమాల్ జ్వరము ఉన్నవారిలోను , జ్వరములేనివారిలోనూ ఉస్ణోగ్రతను తగ్గిస్తుంది. హోమియో వైద్యవిధానములో అలా కాకుండా జ్వరమునకు వాడే మందు నార్మల్ వ్యక్తులలో జ్వరమును పుట్టిస్తుంది ,జ్వరముతో బాధపడేవారిలో జ్వరమును తగ్గిస్తుంది.
అల్లొపతీ వైద్య విధానములో ఒక రోగము వలన కలిగే బాధలను తగ్గించడానికి తగిన మందులివ్వడమే కాకుండా ఆ రోగము రావడానికి గల మూలకారణము వివిధ పద్దతులద్వారా కనుగొని, కారక సూక్ష్మక్రిములను తెలుసుకొని తదనుగునముగా చికిత్స చేయుదురు. నేడు ఎన్నో రకములైన లేబొరటరీ పరీక్షలు, ఎక్షురే పద్దతులు, స్కానింగ్ పరికరాలు అందుబాటులోనికి వచ్చాయి. ఈ వైద్యవిధానము లో చికిత్స చేయు వైద్యునకు సంభందిత డిగ్రీ ఉదా: MBBS, MD, MS, MCh, DM, లాంటి చదువులు అవసరము.
అల్లోపతి వైద్యం ఆవిర్భావం
మనం ఇప్పుడు అల్లోపతి వైద్యంగా చెప్పుకునే ఆధునిక వైద్యం చరిత్ర 500 సంవత్సరాలే. భారతీయ, గ్రీకు, రోమన్, అరబిక్ వైద్యాల మధ్య వందల ఏళ్లుగా జరిగిన సమ్మేళనం ఫలితంగా, పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో యూరోపులో తొలి ఆధునిక వైద్యం ఆవిర్భవించింది. ఆయుర్వేదం, సిద్ధవైద్యం మన ప్రాచీన వైద్యాలు. ఆత్రేయ (క్రీస్తు పూర్వం 800 సంవత్సరాలు), శుశ్రుతుడు, చరకుడు ( క్రీస్తు శకం 200 సంవత్సరాలు) మనకు తెలిసిన తొలినాటి గొప్ప వైద్యులు. చరకుడు 500 మందుల గురించి ఆనాడే రాశాడు. నాటి భారతీయ వైద్యులు సర్పగంధి అనే మొక్కను మందుగా వాడేవారు. రక్తపోటుకు వాడే 'రిసర్ఫిన్' అనే అలోపతి మందును ఈ మొక్కనుండే కనుగొన్నారు. దీన్ని రక్తపోటుకు వాడతారు. చరక సంహిత, సుశ్రుతసంహిత అనే గ్రంథాలను క్రీస్తు శకం 800 సంవత్సరంలో పర్షియన్, అరబిక్ భాషలలోకి అనువదించారు. ఇటువంటి విభిన్న వైద్య వ్యవస్థలలో జరిగిన కృషికి కొనసాగింపుగానే అలోపతి వైద్యం ఆవిర్భవించింది. అలోపతి వైద్యానికి యూరోపియన్ పారిశ్ర్రామిక విప్లవకాలపు ప్రోత్సాహం పెద్ద ఎత్తున లభించింది. అదేకాలంలో మన దేశంలో పాలకుల మద్దతు లేకపోవడంతో ఆయుర్వేదం క్రమేణా దెబ్బతిన్నది.
0 Comments