Full Style

>

గర్భవతులు తినకూడని పండ్లు , Some Fruits not good for pregnent women


గర్భవతులు తినకూడని పండ్లు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


సాధారణంగా పళ్లు తింటే ఆరోగ్యం ఆనందం రెండూ కలుగుతాయని చెప్తారు పెద్దలు అయితే కొన్ని రకాల ఫలాలు సమయానుకూలంఆ తీసుకోకుంటే కొత్త సమస్యలు తెచ్చి పెతాయని, అందునా గర్భవతు లు కొన్ని పళ్లు తీసుకుస్త్రంటే అనేక దుష్పరిణామాలను చవి చూడాల్సి వస్తుందని కూడా చెప్పారు. ఇలా సమస్యలు తెచ్చి పెట్టే ఫలాలపై ఓ సారి దృష్టి పెడితే..

పైనాపిల్‌ :

గర్భవతిగా ఉన్నవారు ప్రసవం అయ్యే వరకు పైనాపిల్‌కి దూరంగా ఉండాల్సిందే. ఇందుకు ముఖ్య కారణం ఇందులో అధికంగా ఉండే బ్రొమెలైన్‌ అనే పదార్ధం గర్భాశయాన్ని శుభ్ర పరిచే గుణం కలది. దీంతో గర్భ విఛ్చినం కావటమో... నెలలు నిండక ముందే ప్రసవం జరిగి బిడ్డ అనారోగ్యంగా పుట్టడమో జరుగుతాయి. అందుకే గర్భవతులు తినే పళ్లలో ఇది పూర్తిగా నిషేధించిన పండు.

బొప్పాయి:

గర్భవతులు బొప్పాయి పండు తీసుకుంటే అందులోని సి విటమిన్‌ మేలు చేస్తుందని, వారిలో వచ్చే గుండె మంట, మలబద్దకం తగ్గేందు కుఉపయోగపడు తుందని పెద్ద లు చెప్పి నా.. బొప్పాయిలో గర్భ విఛ్చిన్న గుణాలుండటంతో సురక్షిత ప్రసవం కోరుకునే గర్భిణీలు దాన్ని తినవద్దనే చెప్తారు.

అయితే ప్రసవానంతరం బొప్పాయికి కాసింత తేనె కలిపి తీసుకుంటే పిల్లలకు సరిపడ పాలు పడతాయి. పైగా ప్రసవంలో కోల్పోయిన సత్తువని బొప్పాయందించే విటమిన్‌ సి తో సరి చేసుకోవచ్చు.

నల్ల ద్రాక్ష :

చాలా మంది గర్భిణీలుగా ఉన్నవారికి రక్తం ఎక్కువగా ఇచ్చే గుణ ముందని నమ్మి, తెలిసో తెలియకో మార్కెట్‌లో కనిపించే నల్ల ద్రాక్షని కొని ఇస్తుంటారు. అయితే నల్ల ద్రాక్షకు శరీరంలో వేడిని పుట్టించే గుణం ఉండటం వల్ల అది గర్భస్ధ శిశువులకు మంచిది కాక పోవటం, దాన్ని తట్టుకోలేని బిడ్డల ఆరోగ్య స్ధితి మారిపోయే ప్రమాదం కూడా ఉందని అందుకే ఈపళ్లని గర్భిణీలకు ఇవ్వవద్దని వైద్య నిపుణులు సూచిస్తారు.

గర్భిణీలే కాదు మీరు తీసుకునే ఏ ఇతర పళ్లనైనా నేరు గా కాకుండా ఖచ్చితం గా ఒకటికి రెండు సార్లు శుభ్రమైన నీటితో కడిగి, వాటికి ఎలాంటి రసాయనా లు, పురుగులు లేనట్లు నిర్ణరించుకుని తినండి.లేదంటే రసాయనాలు మీ ఆరోగ్యా న్ని చెడగొట్టి మరిన్ని సమస్యలకు కారణమయ్యే అవకాశాలను మీరే ఇచ్చిన వారవుతారు.

Post a Comment

0 Comments