Full Style

>

Suicidal tendency and prevention Hints , ఆత్మహత్యాయత్నాలు-నివారణ సూచనలు

ఆవేశము తొనే అఘాయిత్యాలు . తొందరపాటుతో ఆత్మహత్యాయత్నాలు . చిన్నపాటి కారణాలకే మనస్తాపాలు . ఇవన్నీమనిషి మానసిక పరిపక్వత , పరిసరప్రభావము , జీవితములో జయాపజయాలు మీద ఆదారపడి జరుగుతూ ఉంటాయి . ఉదా:
అడిగిన వెంటనే వేడి వేడిగా బజ్జీలు ఇవ్వలేదని హొటల్ యజమాని ముక్కు వేలి కొరికాడో యువకుడు . ఈ సంఘటనకు ముందుగాని , తర్వాత గాని ఆ యువకుడి ప్రవర్తననో నేరచరిత్ర కనిపించలేదు .
ఇంటర్మీడియట్ లో 94 శాతము మార్కులు సాధించి ఇంజినీరింగ్ మొదటి సమ్వత్సరము లో కూడా మంచి విద్యార్ధి అనిపించుకున్న ఒక యువకుడు రెండో ఏట కొన్ని సబ్జెక్టులు తప్పడం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు .
ప్రభుత్వ డిగ్రీ కళాశలలో చదువుతున్న ఓ విద్యార్ధిని రూ.500/- పోయినందుకు మనస్థాపముతో కళాశాల ఆవరణ లో బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది .
పట్నానికి చెందిన ఒక బాలిక బాగా చదవడం లేదని తల్లి మందలించడము తో మనస్థాపానికి గురియై ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చివరికి నిండు ప్రాణాలు బలి తీసుకుంది .
ఏడాది క్రితము గొల్లవీధికి చెందిన బాలుడు పక్కింటి మహిళను ఏదో అన్నాడని గొడవ చేయడం తో ఆత్మహత్య చేసుకున్నాడు . ... ... . ఇలా ఎన్నో లెక్కలలోనికి రానివి .

జీవితం ఎంతో విలువైనది . క్షణికావేశం లో బలవన్మరణానికి పాల్పడుతున్న వీరంతా కావాలనుకున్నప్పుడు మళ్ళీ తం ప్రాణాలను తెచ్చుకోగలరా... కేవలము క్షణికావేశం లో ఏమాత్రం ప్రాధాన్యత లేని చిన్నపాటి విషయాలకే ప్రాణము తీసుకోవాలనే ఆక్రోషాన్ని గుండెలో నింపుకొంటున్న నేటితరము వ్యవహారశైలి పై కొన్ని సూచనలు - >

పట్టణ వాసం లో పనులలో ఒత్తిడి , ఒంటరితనము , ఎడతెగిన బంధాలు , అలవాట్లు , చుట్టూఉన్న పరిస్థితులు ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయి . అయితే పల్లె జీవనము లో కూడా మారుతున్న ప్రమాణాలు యువతను పక్కదారి పట్టిస్తున్నాయి . నిత్యం అందరితో సందడిగా ఉండే పల్లెవాతావరణం లో ఆత్మహత్యలకు పాల్పడే క్షణికావేశము యువతలో ఇటీవల కాలములో పెరుగుతుంది . ఓ తొందరపాటు నిర్ణయం నిండు ప్రాణాల్ని బలితీసుకుంటోంది . కన్నవారికి కడుపుకోత మిగుల్చుతోంది

మారుతున్న కాలం లో పిల్లల పెంపకం లో తల్లిదండ్రులు వ్యవహరిస్తున్న తీరు , పరిసరాల ప్రభావము , మీడియా కథనాలు ఆత్మహత్య్లకు ఉత్ప్రేరకాలు గా మారుతున్నాయి . పల్లెలలో కుడా మెల్ల మెల్లగా పాకుతున్న పట్టణ జీవనశైలి , అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానము నకే పరిమితమవుతున్న నేటి యువతరం అనుబంధాలకు , ఆత్మీయతకు , జీవిత ఆస్వాదనకు దూరమవుతున్నారు . దీంతో తనకన్నా తనతోటి సమాజాన్ని , దాని విలువను గుర్తిచలేకపోతున్నారు . చిన్నతనము నుంచి గారాబముగా పెంచడం తో చిన్నపాటి విషయానికి కూడా పెద్ద అవమానం గా భావించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు .


Post a Comment

0 Comments