Full Style

>

స్వల్ప పక్షవాతం , T.I.A(Transient Ischaemic Attacks)



స్వల్ప పక్షవాతం , T.I.A(Transient Ischaemic Attacks)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


శరీరంలో ఒకపక్క మొద్దుబారటం, మాట తడబడటం, చూపు దెబ్బతినటం వంటి లక్షణాలు కొందరిలో హఠాత్తుగా కనిపించి కొద్దిసేపట్లోనే మాయమవుతుంటాయి. చాలామంది వీటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. ఏదో కొద్దిసేపు కనిపించి పోయాయిలే అని సరిపెట్టుకుంటారు. కానీ ఇలాంటి స్వల్ప పక్షవాతం (ట్రాన్సియెంట్‌ ఇస్కెమిక్‌ అటాక్స్‌... టీఐఏ) లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వెంటనే కారణాలు గుర్తించి చికిత్స తీసుకోవటం తప్పనిసరని సూచిస్తున్నారు. ఎందుకంటే టీఐఏ మున్ముందు భారీ పక్షవాతం రావొచ్చనటానికి సూచన మాత్రమే కాదు.. ఇది జీవనకాలాన్నీ గణనీయంగా తగ్గిస్తున్నట్టు తాజాగా నిర్ధరణ అయ్యింది మరి. మిగతావారితో పోలిస్తే టీఐఏ బారినపడ్డవారి జీవనకాలం తగ్గుతున్నట్టు ఇలినాయిస్‌ విశ్వవిద్యాలయంలోని పక్షవాత పరిశోధక కేంద్రం చేసిన అధ్యయనంలో తేలింది. పక్షవాతంలో కనిపించే లక్షణాలే టీఐఏలోనూ కనిపిస్తాయి గానీ అవి కొందరిలో కొన్ని నిమిషాల సేపే ఉంటే.. మరికొందరిలో కొన్ని గంటల పాటు ఉండి పోతుంటాయి. వీరిలో 40% మందికి నిజమైన పక్షవాతం వచ్చే ప్రమాదముండగా.. సగం మందికి టీఐఏ లక్షణాలు కనిపించిన రెండు రోజుల్లోనే పక్షవాతం ముంచుకొచ్చే అవకాశం ఉంది. టీఐఏ లక్షణాలు కనిపించిన 22వేల మందిపై పరిశోధకులు ఇటీవల తొమ్మిదేళ్ల పాటు ఒక అధ్యయనం చేశారు. మామూలు ప్రజల ఆయుర్దాయంతో పోలిస్తే టీఐఏ బారినపడ్డవారిలో 20% మంది ముందుగానే చనిపోతున్నట్టు బయటపడింది. కాబట్టి నడవటంలో ఇబ్బంది, మగత, నియంత్రణ కోల్పోవటం, చూపు దెబ్బతినటం, తికమక పడటం, మాటల్లో తడబాటు వంటి లక్షణాలు హఠాత్తుగా కనిపిస్తే వెంటనే డాక్టరుకి చూపించుకోవటం మేలు. పక్షవాతం ముప్పు ఏమైనా ఉందేమోనని తెలుసుకోవటం తప్పనసరి. ఈ సమయంలోనే తగు జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని నివారించుకునే అవకాశమూ ఉంది.

Risk factors

    Family history of stroke or TIA substantially increases risk.
    People 55 years or older are at higher risk.
    Males have a slightly higher risk of TIA than females but females are more likely to die from a stroke.
    High blood pressure
    Diabetes Mellitus
    Tobacco smoking

లక్షణాలేంటి?
* ముఖం, చేయి లేదా కాలు.. ముఖ్యంగా శరీరానికి ఒకవైపున.. మొద్దుబారటం, బలహీనం కావటం.
* మాట్లాడటంలో అర్థం చేసుకోవటంలో ఇబ్బంది.
* ప్రతి విషయంలోనూ తికమకపడటం.
* ఒక కంటిలో గానీ రెండు కళ్లల్లో గానీ చూపు దెబ్బతినటం.
* శరీరం పట్టు తప్పి తూలిపోవటం.

-ఇలాంటి లక్షణాలు ఒకట్రెండు కనబడినా తక్షణం జాగ్రత్త పడటం మంచింది. ఎందుకంటే వీరికి టీఐఏ వచ్చిందో, పక్షవాతం వచ్చిందో చెప్పటం కష్టం. స్వల్ప పక్షవాతంలో లక్షణాలు త్వరగా తగ్గిపోయినా మెదడు దెబ్బతిని ఉండొచ్చు. ఒకవేళ పక్షవాతమే అయితే లక్షణాలు కనిపించిన తొలి మూడు గంటల్లోనే చికిత్స మొదలుపెట్టటం తప్పనిసరి. అప్పుడే మంచి ఫలితం కనబడుతుంది. అందువల్ల తాత్సారం చేయకుండా వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లటం ఉత్తమం.

Post a Comment

0 Comments