వర్షాకాలంలో జలుబు చేయడం సాధారణం. అయితే దుమ్ము, ధూళి, పొగ, చల్లటి గాలి వలన కలిగే ముక్కు సమస్యను తేలికగా తీసివేయకూడదు. వాతావరణంలో అనేక రకాల సూక్ష్మక్రిములు (Viruses) వుంటాయి. అందులో రినో వైరస్, ఎడినో వైరస్, ఇతర వైరస్‌లు వుండవచ్చు. వాటి బారిన పడితే జీవిత కాల సమస్యలుగా వుండిపోతాయి. కనుక అవి సోకకుండా జాగ్రత్తలు పాటించడం అవసరం.
సాధారణ జలుబు అంటే వాతావరణ మార్పువల్ల వచ్చే జలుబు వారంలో తగ్గిపోతుంది. మందులు వాడితే ఏడు రోజుల్లో తగ్గిపోతుంది అనే ‘జోక్'వాస్తవమయినప్పటికీ, అంతకుమించి, తలనొప్పి, ముక్కు బిగవేత, ముక్కు వెంట ద్రవం కారడం, తుమ్ములు, గొంతు మంట వంటి లక్షణాలు వుంటే ఏదైనా వైరస్ కారణమని భావించి వైద్య సలహా పొంది జాగ్రత్తపడాలి.
కాకపోతే ఈ సీజన్ లో వచ్చే జలుబుకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అది ఎలా వచ్చిందో అలానే పోతుంది. అందుకు కొన్ని వంటింటి చిట్కాలు:
1. యూకలిప్టస్ ఆయిల్ నుదురు, చెస్ట్, వీపు, ముక్కుపైన అప్లయ్ చేసుకోవాలి. మిరియాలచారు రోజూ ఉదయం, సాయంత్రం తీసుకున్నా ఉపశమనం ఉంటుది.
2. ఒక కప్పు నీటిలో చిన్న అల్లం ముక్కను సన్నముక్కలుగా తరిగివేసి నీరు మరిగించి అరచెంచా పంచదార వేసుకుని వెచ్చగా వున్నపుడే తాగాలి. టీ లో అల్లం వేసి మరిగించి ఈ టీ తాగినా కొంత వరకు లాభం ఉంటుంది.
3. ఒక కప్పు నీటిలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మరగనిచ్చి ఆ నీటిని తాగొచ్చు, చికిన్ సూప్ కూడా అద్భుతంగా జలుబుపై ప్రభావం చూపిస్తుంది.
4. తులసి ఆకులు అయిదారు తీసుకొని నమిలి మింగాలి. లేదంటే తులసి ఆకులతో డికాషన్ పెట్టి ఆ డికాషన్ రోజుకు మూడు లేదా నాలుగు సార్లు తాగొచ్చు.
5. ఒక నిమ్మపండు రసం తీసి, రెండు కప్పలు గోరువెచ్చని నీటిలో కలిపి ఒక స్పూన్ తేనె కలిపి రోజుకు రెండు మూడు సార్లు తీసుకున్నా బాగుంటుంది. రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ నీటిలో రెండు నిమ్మకాయల రసం పిండి తగినంత పంచదార వేసుకుని త్రాగాలి. ఇలా నాలుగు రోజులు తాగితే చాలు జలుబు తగ్గుతుంది. 6. పావు చెంచా దాల్చిన చెక్క పౌడర్ అరకప్పు నీటిలో బాయిల్ చేయాలి. కొంచెం మిరియాల పొడి, ఒక చెంచా తేనె వేసి రోజూ రెండుమూడుసార్లు త్రాగాలి.
7. అరలీటర్ నీటిలో 100 గ్రాములు బెండకాయ ముక్కలుగా తరిగివేసి బాయిల్ చేసి ఈ నీటి గుండా వెలువడే ఆవిరి పీల్చండి.
8. అర చెంచా మిరియాలు పొడి ఒక చెంచా బెల్లంపొడి కప్పు నీటిలో వేసి మరిగించి గోరు వెచ్చగా ఉండగానే తీసుకోవాలి.
9. స్టీమ్ పీలవడం వలన ముక్కులు బిగించి తగ్గుతుంది. శ్లేష్మం ఫ్రీ అయి బయటకు పోతుంది.
10. కప్పు వేడి పాలల అరచెంచా శుద్దమైన పసుపువేసి త్రాగాలి. రోజూ రెండు మూడు మార్లు తాగాలి. వేడి వేడిగా వెజిటబుల్ సూప్స్.. పెప్పర్, సాల్ట్ వేసుకుని తీసుకోండి రోజూ రెండుసార్లు.
0 Comments