జీర్ణక్రియకు: 1. కరివేపాకు ఆకులను పచ్చిగా లేదా ఉడికించినవైన అవతల పారేయక నమిలి మింగండి. దీని వలన ఎంతో మేలు కలుగుతుంది.
2. కరివేపాకు జీర్ణక్రియ ఇబ్బందులను పోగొట్టే గుణముంది. జీర్ణక్రియ సమస్యతో బాధపడేవారు కరివేపాకు ఆకులను, జీలకర్రతో కలిపి బాగా నూరి, అలా నూరగా వచ్చిన పొడిని పాలలో కలుపుకుని తాగిలే సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.
3. వేవిళ్ళతో బాధపడేవారికి కరివేపాకు ఆకుల నుండి తీసిన రసం, నిమ్మరసం, పంచదారలతో కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
4. అతిగా కొవ్వు పదార్థాలు(నెయ్యి, వెన్న వంటివి) తినడం వల్ల కలిగే జీర్ణక్రియ ఇబ్బంది నుండి బయటపడవేయగలవు కరివేపాకు ఆకులు, వాంతులు, విరేచనాలు, తలతిరుగుడు వంటి వాటికి కరివేపాకు రసం బాగా పనిచేస్తుంది.
5. లేత కరివేపాకు ఆకులను తేనెతో తీసుకుంటే బంక విరోచనాలు తగ్గిపోతాయి. మొలల ఇబ్బందులకు అదే విరుగుడు.
6. పసరు వాంతులను కట్టగలిగిన శక్తి కరివేపాకు మొక్క బెరడుకుంది. ఎండు బెరడును పొడి చేసి ఆ పొడి నుండి వచ్చిన కషాయాన్ని చల్లనీటితో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.
7. వంశపారంపర్యంగా వచ్చే మధుమేహానికి కూడా కరివేపాకు పనిచేస్తుంది. ప్రతి రోజూ పది ముదురు కరివేపాకు ఆకులను బాగా నమిలి మింగాలి. అలా మూడు నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే మధుమేహాన్ని నియత్రించుకోగలుగుతారు.
8. భారీకాయం వల్ల వచ్చే మధుమేహానికి కరివేపాకు పనికొస్తుంది. ప్రతి రోజు ఉదయం పరగడుపున కరివేపాకు ఆకులను, మిరియంతో కలిపి తీసుకుంటే రక్తంలో చక్కర తగ్గుతుంది. కరివేపాకును తినడం వల్ల మూత్రంలో పాటుగా విసర్జించే చక్కర శాతం బాగా తగ్గుతుంది.
9. స్థూలకాయుల్లో కనిపించే మధుమేహం: కరివేపాకును ముద్దగా నూరి మోతాదుకు టీ స్పూన్ చొప్పున మజ్జిగతోగాని నీళ్లతోగాని రెండుపూటలా తీసుకుంటుంటే స్థూలకాయం తగ్గి తద్వారా మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.
10. కరివేపాకుకు కొలస్ట్రెరాల్‌ని నియంత్రించే గుణముందని పరిశోధకులు కనుగొన్నారు. రక్తానికి సంబంధించిన లోపాలు, బొల్లి వంటి చర్మరోగాలకు కరివేపాకు పనికొస్తుందని ఇటీవల జరిపిన పరిశోధనలో వెల్లడైంది. అందుకే కరివేపాకును అలా తీసిపారేయక దాని లాభాలను గుర్తించి చక్కగా వినియోగించుకోండి.
0 Comments