Full Style

>

బరువు తగ్గాలనుకొనేవారు.. కడుపు మాడ్చుకోనవసంర లేదు...


బరువు తగ్గాలంటే మీరు కడుపుమాడ్చూకొనవసరం లేదు, రుచికరం అయిన ఆహారం తీసుకుని హాయిగా బరువు తగ్గించుకోవచ్చు. ఈ విదంగా మీరు స్థూలాకాయం నుండి దూరం కావచ్చు. కొంచెం తెలివి, కొంచెం నోటిని ఉపయోగిస్తే కుడుపు నిండా తింటు మీ శరీరాన్ని మీరే మెయిన్ టైన్ చేయవచ్చు. అది ఏలాగంటే.

 సూప్ తాగండి....7 కేజీల బరువు తగ్గిపోతారు..... ప్రస్తుతం మనంలో సూప్ తాగే అలవాటు చాల పెరిగింది. ప్రతి ఒక్కరు సూప్ తాగడానికి అలవాటు పడుతున్నారు. ప్రతి రోజు బోజం చేసే ముందు సూప్ తాగితే సంవత్సరంలో మీరు పెరిగే బరువులో 7 కేజీలు తగ్గిపోతారు. ఈ విషయం పెన్సిల్వేనియా యూనివర్శిటి చేసిన పరిశోదనలో ఇటివలే రుజువు అయ్యింది. ప్రతి ఒక్కరు సూప్ తాగడం అలవాటు చేసుకుంటే స్థూలాకాయం నుండి దూరం కావచ్చు. టమోటో లాంటి వెజిటబుల్ సూప్ తాగితే చా మంచిది అని నిపుణుల పరిశోదనలో వెల్లడి అయ్యింది.

అయిల్ తగ్గించాలి...... ఆరోగ్య సూత్రాలు పాటించే వారు మొదటి చేసేది ఆయిల్ తగ్గించడం. ఆయిల్ తగ్గించాలని వైద్యులు మొదట సూచిస్తారు. ఆలివ్ ఆయిల్ అలవాటు చేసి సాదారణంగా ఉపయోగించే అయిల్ ను దూరం చేసుకుంటే ఆరోగ్యానికి చాల మంచింది. ఆలివ్ అయిలో మ్యూఫా చాల ఉంటాయి. మ్యూఫా అంటే మోనో శాచ్యురేటడ్ ఫ్యాటి అని అర్థం. ఇవి శరీరంలోని మంచి కోలెస్ర్టాల్ ను తగ్గించకుండా చెడు కొలెస్ర్టాల్ ను తగ్గిస్తాయి. ఈ విధంగా గుండె జబ్బులు దూరం అవుతుంది. గుండె పదిలంగా ఉడంటంతో పాటు మీరు హాయిగా జీవిస్తారు.
కోడి గుడ్డు ఇలా తినండి..... కోడిగుడ్డు తింటే మీరు బరువు తగ్గించుకొవచ్చు. అయితే కోడిగుడ్డు ఉడికించి తినాలి, ఇష్టం వచ్చినట్లు ఆమ్లేట్ వేసుకుని తినాలంటే కుదరదు, రోజు రెండు కోడి గుడ్లు ఉడికించి తినండి. అప్పటికే మీకు కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. గుడ్డులో ల్యూసిన్ అనే ఎసెన్షియల్ అమైన్ యూసిడ్ ఉంటుంది. ఇది బరువును తగ్గించడానికి నేరుగా ఉపయోగపడుతుంది. ఈవిదంగా బరువు తగ్గించడం మీ చేతిలోనే ఉంటుంది. డబ్బు మీ దగ్గరే ఉంటుంది.
దానిమ్మ బెస్ట్.........దానిమ్మ గింజలు తినడం వలన శరీరంలో కోవ్వును నిల్వ చేసుకోవచ్చు, దానిమ్మ గింజలు కొన్ని తింటే కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. దానిమ్మ పండులో యాంటి ఆక్సిడెంట్స్ రక్తనాళాలలోని అడ్డంకులను తోలగిస్తాయి. యూనివర్శిటి ఆఫ్ హ్యూస్టన్ పరశోదకులు ఇదే విషయం చెబుతున్నారు. కొన్ని దానిమ్మ గింజలు తింటే కడుపు నిండిపోయిటన్లు అని పిస్తుంది. అయితే ఇంకా కొన్ని గింజలు తిని ఆరోగ్యాన్ని కాపోడుకొవాలి.
చేపలు తినండి............ మాంసాహారం తినే వారు తాము ఎక్కడ లావు అవుతాము అని భయపడతారు. మాంసం తినకూడదని వాటి జోలికి వెల్లరు, అయితే మాంసం బాగాతిని ఆరోగ్యం కాపాడుకొవడానికి చక్కటి అవకాశం ఉంది. చేపలు తిని బరువు తగ్గించుకొవచ్చు. చేపలో క్యాలరీలు చాల తక్కువ. కోవ్వు దాదాపు ఉండదు. చేపలు తినే వారు ఆరోగ్యంగా ఉంటారని అనేక సార్లు పరిశోధకులు చెప్పారు. చేపలు తినే వారు చాల కాలం బ్రతుకుతారు. వారంలో నాలుగు రోజులు చేపలు తినే వారు చాల కాలం బ్రతుకుతారని, వారికి ఎలాంటి జబ్బులు రావని వైద్యులు అంటున్నారు. ఇంకే ముంది వైట్ మీట్ తినేయండి.

 

Post a Comment

0 Comments